తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Shine 100 Dispatches: షోరూమ్‌లకు హోండా షైన్ 100 సీసీ బైక్స్

Honda shine 100 dispatches: షోరూమ్‌లకు హోండా షైన్ 100 సీసీ బైక్స్

HT Telugu Desk HT Telugu

03 May 2023, 16:44 IST

google News
    • Honda Shine: హోండా నుంచి షైన్ 100 సీసీ షోరూములకు చేరుకుంటోంది.
హోండా షైన్ 100
హోండా షైన్ 100

హోండా షైన్ 100

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) నుంచి సరికొత్త షైన్ 100 సీసీ టూ వీలర్ వాహనాలు ఫ్యాక్టరీ యూనిట్ల నుంచి షోరూమ్‌లకు బయలుదేరాయి. కర్ణాటకలోని నర్సాపుర ఫ్యాక్టరీ నుంచి షైన్ వాహనాలను సంస్థ డీలర్లకు పంపిణీ ప్రారంభించింది. కంపెనీకి హర్యానాలోని మనేసర్, రాజస్తాన్‌లో అల్వార్‌లో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొత్త వాహనాల పంపిణీ వేడుకలో హోండా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సుసోము ఒటాని, సీనియర్ డైరెక్టర్ వినయ్ ధింగ్రా తదితరులు పాల్గొన్నారు.

కొత్త షైన్ 100 సీసీ వాహనం హోండాకు అత్యంత ముఖ్యమైన ఉత్పత్తిగా నిలుస్తోంది. దశాబ్దకాలం తరువాత 100 సీసీ టూవీలర్ సెగ్మెంట్‌లోకి హోండా తిరిగి వచ్చింది. హోండా షైన్ 100 సీసీ ధర (మహారాష్ట్ర ఎక్స్-షోరూమ్) రూ. 64,900గా ఉంది. హోండా షైన్ 100 సీసీ ఐదు రంగుల్లో వస్తోంది. రెడ్ స్ట్రైప్స్‌తో కూడిన బ్లాక్, బ్లూ స్ట్రైప్స్‌తో కూడిన బ్లాక్, గ్రీన్ స్ట్రైప్స్‌తో కూడిన బ్లాక్, గోల్డ్ స్ట్రైప్స్‌తో కూడిన బ్లాక్, అలాగే గ్రే స్ట్రైప్స్‌తో కూడిన బ్లాక్ రంగుల్లో లభ్యమవుతుంది. హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా 100 సీసీ బైక్స్‌కు హోండా షైన్ 100‌ కాంపిటీటర్‌గా నిలుస్తుంది.

హోండా షైన్ 98.98 సీసీ సామర్థ్యం, ఎయిర్-కూల్ కలిగిన సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 7.2 బీహెచ్‌పీ శక్తిని ఇస్తుంది. 4 స్పీడ్ గేర్లు ఉంటాయి. ఇంజిన్ ఇ20 టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫ్యుయల్ ఇంజెక్షన్, ఈఎస్పీ కూడా ఉంటాయి. ఆటో చోక్ ఫీచర్ కూడా ఉంటుంది. అయితే ఎంత మైలేజీ ఇస్తుందో ఇప్పటి వరకు వెల్లడించకపోయినప్పటికీ, ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ మైలేజీ వస్తుందని తెలిపింది.

హోండా షైన్ ముందు భాగంలో సరికొత్త డైమండ్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్క్స్‌తో వస్తోంది. వెనకవైపు ట్విన్ షాక్ అబ్జర్వర్స్ కూడా ఉంటాయి. ఇరువైపులా డ్రమ్ బ్రేక్స్‌తో బ్రేకింగ్ ఫీచర్ ఉంటుంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం