తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Home Loans: హోం లోన్ వడ్డీ రేట్లు పెరిగాయి.. ప్రధాన బ్యాంక్ ల్లోని గృహ రుణాల వడ్డీ రేట్లు ఇవే

Home loans: హోం లోన్ వడ్డీ రేట్లు పెరిగాయి.. ప్రధాన బ్యాంక్ ల్లోని గృహ రుణాల వడ్డీ రేట్లు ఇవే

HT Telugu Desk HT Telugu

21 August 2024, 21:26 IST

google News
  • Home loans: పలు బ్యాంక్ లు గృహ రుణాలపై వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను సవరించాయి. ఈ పెంపు వల్ల గృహ రుణాలపై చెల్లించే వడ్డీ పెరుగుతుంది. తద్వారా, మీ ఈఎంఐ పెరుగుతుంది. ప్రధాన బ్యాంక్ ల్లోని హోం లోన్ వడ్డీ రేట్ల వివరాలను ఇక్కడ చూడండి..

హోం లోన్ వడ్డీ రేట్లు పెరిగాయి; ఇవే ఆయా బ్యాంక్ ల్లో పెరిగిన రేట్లు
హోం లోన్ వడ్డీ రేట్లు పెరిగాయి; ఇవే ఆయా బ్యాంక్ ల్లో పెరిగిన రేట్లు

హోం లోన్ వడ్డీ రేట్లు పెరిగాయి; ఇవే ఆయా బ్యాంక్ ల్లో పెరిగిన రేట్లు

Home loans: మీరు ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే, ఇంటి రుణాన్ని ఎక్కడ నుండి తీసుకోవాలని ఆలోచిస్తుంటే, నిర్ణయం తీసుకునే ముందు వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను సరిపోల్చుకోండి. గృహ రుణాల విషయంలో వడ్డీరేటు ఒక కీలక అంశం. అయితే, అదొక్కటే ముఖ్యం కాదు. ప్రాసెసింగ్ ఫీజు, కస్టమర్ సర్వీస్ లను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

వడ్డీ రేట్లు పెరిగాయి..

ఇదిలా ఉండగా, కొన్ని బ్యాంకులు ఇటీవల వడ్డీ రేట్లను పెంచాయి. ఎస్బీఐ మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. గృహ రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూద్దాం.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్

భారత్ లో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ప్రత్యేక గృహ రుణ రేట్లను 8.75 శాతం నుంచి 9.65 శాతం వరకు, స్టాండర్డ్ హౌసింగ్ లోన్ రేట్లు 9.40 నుంచి 9.95 శాతానికి పెంచింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఎస్బీఐ గృహ రుణాలపై 8.5 శాతం నుంచి 9.65 శాతం వరకు వడ్డీ ని వసూలు చేస్తోంది. అయితే, రుణ గ్రహీతల సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ రేట్లు ఉంటాయి. సిబిల్ స్కోర్ బాగా ఉన్నవారికి తక్కువ వడ్డీకే రుణం అందిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్

ఐసీఐసీఐ బ్యాంక్ రెండు అంశాల ఆధారంగా గృహ రుణాల వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. రుణం కోరుతున్న వ్యక్తి ఆదాయ మార్గం (ఉద్యోగమా? లేక స్వయం ఉపాధా?) , అతడు కోరుతున్న రుణం మొత్తం.. అనే రెండు అంశాల ఆధారంగా 9.25 శాతం నుంచి 10.05 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ఉదాహరణకు, రుణ మొత్తం రూ .35 లక్షల వరకు ఉంటే, వేతన ఉద్యోగులకు వడ్డీ రేటు 9.25 నుండి 9.65 శాతం, స్వయం ఉపాధి ఉన్నవారికి 9.4 నుండి 9.8 శాతం మధ్య ఉంటుంది. అదేవిధంగా, రుణ మొత్తం రూ .75 లక్షలకు మించి ఉంటే, వేతన ఉద్యోగులకు వడ్డీ రేటు 9.6 నుండి 9.90 శాతం, స్వయం ఉపాధి ఉన్నవారికి 9.75 శాతం నుండి 10.05 శాతం మధ్య ఉంటుంది. ఈ రేట్లు ఆగస్టు 31, 2024 వరకు అమల్లో ఉంటాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్

క్రెడిట్ స్కోర్, రుణ మొత్తం, ఎల్టీవీ (లోన్ టు వాల్యూ) నిష్పత్తి మరియు రుణ కాలపరిమితి వంటి అనేక అంశాల ఆధారంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 9.40 శాతం నుండి 11.10 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తుంది. ఉదాహరణకు రుణ మొత్తం రూ.30 లక్షలకు పైన ఉండి, ఎల్టీవీ నిష్పత్తి 80 శాతం కంటే తక్కువగా లేదా సమానంగా ఉంటే, కాలపరిమితి 10 సంవత్సరాల వరకు ఉన్నప్పుడు వడ్డీ రేటు 9.40 శాతం, కాలపరిమితి 10 ఏళ్లు పైబడినప్పుడు 9.90 శాతానికి పెరుగుతుంది. మరిన్ని వివరాలకు పీఎన్బీ వెబ్సైట్ ను సందర్శించవచ్చు.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా వేతన జీవులు, వేతనం లేని వ్యక్తుల నుంచి 8.4 నుంచి 10.60 శాతం వరకు ఫ్లోటింగ్ వడ్డీని వసూలు చేస్తుంది. వేతన జీవులకు 10.15 శాతం నుంచి 11.50 శాతం వరకు, వేతనం లేని వారికి 10.25 శాతం నుంచి 11.60 శాతం వరకు ఫిక్స్ డ్ రేటు ఉంది.

తదుపరి వ్యాసం