PNB SO Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లు; అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్-pnb so recruitment 2024 registration for 1025 posts ends tomorrow link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pnb So Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లు; అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

PNB SO Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లు; అప్లై చేయడానికి రేపే లాస్ట్ డేట్

HT Telugu Desk HT Telugu
Feb 24, 2024 05:17 PM IST

PNB SO Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. అయితే, పీఎన్బీలో స్పెషలిస్ట్ పోస్ట్ ల కోసం అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 25వ తేదీ లాస్ట్ డేట్.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

PNB SO Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 25 న ముగియనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పీఎన్బీ అధికారిక వెబ్ సైట్ pnbindia.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 1025 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏప్రిల్ లోనే పరీక్ష

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank) లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్ లైన్ పరీక్ష మార్చి/ ఏప్రిల్ నెలల్లో జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ ఆన్ లైన్ టెస్ట్ తో పాటు, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది.

ఇలా అప్లై చేయండి..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.

  • పిఎన్బీ అధికారిక వెబ్ సైట్ pnbindia.in ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిక్రూట్మెంట్ సెక్షన్ పై క్లిక్ చేయండి.
  • ఆ పేజీలో అందుబాటులో ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
  • అక్కడ అభ్యర్థులు అప్లై ఆన్ లైన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
  • అప్లికేషన్ ఫారం నింపండి. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.

అప్లికేషన్ ఫీజు

ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి దరఖాస్తు ఫీజు ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.59, ఇతర కేటగిరీ అభ్యర్థులకు రూ.1180. అభ్యర్థులు డెబిట్ కార్డులు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డు), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డులు/ మొబైల్ వాలెట్లు లేదా యూపీఐలను ఉపయోగించి ఈ ఫీజు చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.