తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hero Karizma Xmr 210 : సరికొత్త అవతారంలో హీరో 'కరిష్మా'.. లాంచ్​ డేట్​ ఫిక్స్​!

Hero Karizma XMR 210 : సరికొత్త అవతారంలో హీరో 'కరిష్మా'.. లాంచ్​ డేట్​ ఫిక్స్​!

Sharath Chitturi HT Telugu

15 August 2023, 11:13 IST

google News
    • Hero Karizma XMR 210 : హీరో కరిష్మా ఎక్స్​ఎంఆర్​ 210 లాంచ్​కు సిద్ధమవుతోంది. ఈ మోడల్​కు సంబంధించిన టీజర్​ను తాజాగా రిలీజ్​ చేసింది సంస్థ.
సరికొత్త అవతారంలో హీరో 'కరిష్మా'.. లాంచ్​ డేట్​ ఫిక్స్​!
సరికొత్త అవతారంలో హీరో 'కరిష్మా'.. లాంచ్​ డేట్​ ఫిక్స్​!

సరికొత్త అవతారంలో హీరో 'కరిష్మా'.. లాంచ్​ డేట్​ ఫిక్స్​!

Hero Karizma XMR 210 : కరిష్మా మోడల్​తో హీరో మోటోకార్ప్​ సంస్థ గతంలో పెద్ద హిట్​ కొట్టింది. తక్కువ సమయంలోనే ఈ మోడల్​కు డిమాండ్​ భారీగా పెరిగింది. చాలా కాలం తర్వాత సేల్స్​లో డ్రాప్​ కనిపించడంతో, ఈ మోడల్​ను 2020లో డిస్కంటిన్యూ చేసింది హీరో సంస్థ. ఇక ఇప్పుడు ఈ బైక్​ను మళ్లీ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. కరిష్మా ఎక్స్​ఎంఆర్​ 210 పేరుతో మార్కెట్​లో ఈ నెల 29న ఈ బైక్​ లాంచ్​ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టీజర్​ను విడుదల చేసింది సంస్థ.

సరికొత్తగా హీరో కరిష్మా..!

తాజా క్లిప్స్​లో బైక్​ ఫ్యూయెల్​ ట్యాంక్​ కనిపిస్తోంది. ఇందులో సెమీ ఫైరింగ్​ ఉండొచ్చు. వెహికిల్​కి సంబంధించిన క్లిప్​-ఆన్​ హ్యాండిల్​బార్​ కూడా టీజర్​లో కనిపిస్తోంది. ఈ మోడల్​ స్టైలింగ్​ షార్ప్​గా, స్పోర్టీగా ఉంటుందని తెలుస్తోంది. పాయింటెడ్​ నోస్​, టాల్​ విండ్​స్క్రీన్​, ఫైరింగ్​ మౌంటెడ్​ మిర్రర్స్​, స్ప్లిట్​ సీట్స్​ వంటివి రావొచ్చు. ఎల్​ఈడీ లైటింగ్​, ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ లైట్స్​, ఫుల్లీ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, బ్లూటూత్​ కనెక్టివిటీ వంటి ఫీచర్స్​ సైతం ఉండొచ్చు.

Hero Karizma XMR 210 launch date : ఇక ఈ హీరో కరిష్మా ఎక్స్​ఎంఆర్​ 210లో 210 సీసీ, సింగిల్​ సిలిండర్​, లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉండనుంది. ఇది 25 హెచ్​పీ పవర్​ను, 30 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 6 స్పీడ్​ గేర్​బాక్స్​ దీని సొంతం. సేఫ్టీ ఫీచర్స్​ విషయానికొస్తే.. ఈ మోడల్​ ఫ్రెంట్​, రేర్​ వీల్స్​కు డిస్క్​ బ్రేక్స్​తో పాటు డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ సెటప్​ ఉండనుంది.

ఈ మోడల్​కు బ్యాండ్​ అంబాసిడర్​గా.. బాలీవుడ్​ నటుడు హృతిక్​ రోషన్​ను సంస్థ నియమించింది.

హీరో కొత్త బైక్​ ధర సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. రానున్న రోజుల్లో ధర, ఫీచర్స్​ వంటి వివరాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ప్యాషన్​ ప్రో కట్​..!

Hero Karizma XMR 210 price : తక్కువ నిర్వహణ ఖర్చు, మంచి మైలేజీ ఇచ్చే స్టైలిష్ బైక్ గా హీరో ప్యాషన్ ప్రొ పేరు గాంచింది. కానీ, ఆ బైక్ ఇకపై కొనుగోలుదారులకు అందుబాటులో ఉండదు. హీరో ప్యాషన్ ప్రొ ఉత్పత్తిని నిలిపివేయాలని హీరో మోటార్స్ సంస్థ నిర్ణయించింది. తమ వెబ్ సైట్ నుంచి ఆ బైక్ ను సైలెంట్ గా తొలగించింది. హీరో పాషన్ ప్రొ బైక్ ఇక లభించదని డీలర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం