తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hdfc Bank Shares: వారంలో 7 శాతం పైగా నష్టపోయిన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ షేర్స్; ఇప్పుడు కొనొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

HDFC Bank shares: వారంలో 7 శాతం పైగా నష్టపోయిన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ షేర్స్; ఇప్పుడు కొనొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

HT Telugu Desk HT Telugu

21 September 2023, 11:12 IST

google News
    • HDFC Bank share price: హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. గత వారం రోజుల్లో ఈ బ్యాంక్ షేర్లు 7% నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ఈ షేర్లపై నిపుణులు ఏం చెబుతున్నారు?
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

HDFC Bank share price: భారీ అమ్మకాల మధ్య హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ ధర వరుసగా మూడో రోజైన గురువారం కూడా క్షీణించింది. గురువారం ఉదయం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు బిఎస్‌ఇలో 1.65% క్షీణించి ఒక్కొక్కటి రూ.1,538.05 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

వారంలో 7% నష్టం

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్ ఈ వారంలో ఇప్పటివరకు 7% కంటే ఎక్కువ నష్టపోయింది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ గా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లో ఈ డౌన్ ట్రెండ్ పై మార్కెట్ నిపుణులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ ల విలీనం నేపథ్యంలో అమ్మకాల ఒత్తిడి వల్ల ఈ డౌన్ ట్రెండ్ ప్రారంభమైందని, త్వరలోనే మళ్లీ అప్ ట్రెండ్ ప్రారంభమవుతుందని కొన్ని బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి. కాగా, అంతర్జాతీయంగా పలు సంస్థలు ఈ కంపెనీ షేర్ల టార్గెట్ ప్రైస్ ను తగ్గించడం విశేషం. హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ తో విలీనం తర్వాత స్వల్పకాలంలో నికర వడ్డీ మార్జిన్, నికర విలువ, ఆస్తి నాణ్యత క్షీణించడాన్ని అవి ఎత్తి చూపుతున్నాయి. విదేశీ బ్రోకరేజ్ సంస్థ నోమురా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌పై తన రేటింగ్‌ను ‘న్యూట్రల్’కి తగ్గించింది మరియు టార్గెట్ ధరను రూ.1,970 నుండి రూ.1,800కి తగ్గించింది.

ముందుముందు పెరుగుతుంది..

కాగా, ఈ డౌన్ ట్రెండ్ కొంతకాలమే ఉంటుందని, మళ్లీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్ల అప్ ట్రెండ్ ప్రారంభమవుతుందని మరికొన్ని బ్రోకరేజ్ సంస్థలు గట్టిగా చెబుతున్నాయి. బ్యాంక్ షేర్ స్వల్పకాలిక టార్గెట్ ప్రైస్ ను అవి రూ. 1950 నుంచి రూ. 2,050 గా నిర్ధారిస్తున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధరను ప్రముఖ గోల్డ్‌మన్ సాచ్స్ సంస్థ షేర్‌కు రూ. 2,051 గా నిర్ధారించడం విశేషం. హెచ్‌డిఎఫ్‌సి స్టాక్‌ ను ఇప్పుడు కొనుగోలు చేయవచ్చని, ఈ షేర్ టార్గెట్ ధర రూ.1,950 అని దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెబుతోంది. విలీనం వల్ల హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఫండమెంటల్స్ మరింత బలంగా మారాయని అభిప్రాయపడింది. గురువారం ఉదయం 10:05 గంటలకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు బిఎస్‌ఇలో 0.43% తగ్గి రూ.1,557.20 వద్ద ట్రేడవుతున్నాయి.

సూచన: ఇక్కడ వ్యక్తం చేసినవి నిపుణుల సూచనలు, అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిపుణులను సంప్రదించి పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవడం మంచిది.

తదుపరి వ్యాసం