HDFC Bank Q1 results: క్యూ1 లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభాలు రూ. 11,952 కోట్లు
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సోమవారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ విలీనం తరువాత వెల్లడించిన తొలి ఫలితాలు ఇవే కావడం విశేషం.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) సోమవారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ విలీనం తరువాత వెల్లడించిన తొలి ఫలితాలు ఇవే కావడం విశేషం.
వడ్డీ ఆదాయం సూపర్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సోమవారం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ నెలతో ముగిసే తొలి త్రైమాసికం (Q1FY24)లో రూ. 11,951.7 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY23)లో సాధించిన నికర లాభాలతో పోలిస్తే, Q1FY24 లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) 30% అధిక లాభాలను ఆర్జించింది. Q1FY23 లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సాధించిన నికర లాభాలు రూ. 9,196 కోట్లు. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలో కూడా 21.1% వృద్ధి నమోదైంది. Q1FY24 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం రూ. 23,599.1 కోట్లు. Q1FY23 లో ఈ బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 19,481.4 కోట్లు.
పెరిగిన ఎన్పీఏలు..
మరోవైపు బ్యాంక్ నిరర్ధక ఆస్తులు (non-performing assets NPA) ఈ Q1FY24 లో 5.7% పెరిగాయి. Q1FY23 లో 18,019 కోట్లుగా ఉన్న ఎన్పీఏల విలువ Q1FY24 లో రూ. 19,045.1 కోట్లకు పెరిగింది. అలాగే, నికర ఎన్పీఏ (Net NPA)ల విలువ Q1FY23 లో 4.368.4 కోట్లు ఉండగా, Q1FY24 లో రూ. 4,776.9 కోట్లకు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిపాజిట్ల విలువ కూడా Q1FY24 లో గణనీయంగా పెరిగింది. 2023, జూన్ 30 నాటికి బ్యాంక్ లో రూ. 19,13,096 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. 2022, జూన్ 30 లో బ్యాంక్ లో ఉన్నడిపాజిట్ల విలువ కన్నా ఇది 19.2% ఎక్కువ.హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ల విలీనం తరువాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విడుదల చేసిన తొలి ఆర్థిక ఫలితాలు ఇవి. ఈ Q1FY24 లో బేసెల్ నిబంధనల ప్రకారం బ్యాంక్ సీఏఆర్ (Capital Adequacy Ratio CAR) 18.9% గా ఉంది. జులై 17, సోమవారం మధ్యాహ్నం 2.50 గంటలకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ విలువ 1.98% పెరిగి, రూ. 1676.75 కి చేరింది.