తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tech Stocks: క్యూ 3 రిజల్ట్స్ తరువాత ఈ 3 టెక్ స్టాక్స్ లో ఏది కొంటే బెటర్?

Tech stocks: క్యూ 3 రిజల్ట్స్ తరువాత ఈ 3 టెక్ స్టాక్స్ లో ఏది కొంటే బెటర్?

HT Telugu Desk HT Telugu

25 January 2024, 15:50 IST

  • Tech stocks to buy now: ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY24) ఫైనాన్షియల్ రిజల్ట్స్ ను కంపెనీలు వరుసగా ప్రకటిస్తున్నాయి. ఐటీ, టెక్నాలజీ సంస్థలు ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేదు. ఈ నేపథ్యంలో.. 

    హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా ల్లో ఏ స్టాక్స్ పై పెట్టుబడి పెట్టడం బెటర్?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (iStockphoto)

ప్రతీకాత్మక చిత్రం

ఐటీ కంపెనీల డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. హెచ్సీఎల్ టెక్ క్యూ 3 ఫలితాలు ఊహించిన దానికంటే కాస్త మెరుగ్గా ఉండగా, విప్రో, టెక్ మహీంద్రా క్యూ 3 ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి.

ముందున్నాయి సవాళ్లు..

కీలకమైన పాశ్చాత్య మార్కెట్లలో డిమాండ్ తగ్గుతోంది. పెరిగిన వడ్డీ రేట్లు సవాళ్లను పెంచుతున్నాయి. వడ్డీ రేట్ల కోతలు మే నెల తరువాతే అమల్లోకి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఐటి కంపెనీలు సమీప భవిష్యత్తులో పుంజుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా ల్లో అత్యంత అనుకూలమైన స్టాక్ ను గుర్తించే ప్రయత్నం చేద్దాం.

హెచ్ సీఎల్ టెక్

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY24) లో హెచ్ సీఎల్ టెక్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.4,350 కోట్లుగా నమోదైంది. సంస్థ ఆపరేషన్స్ రెవెన్యూ 6.5 శాతం వృద్ధితో రూ.28,446 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ఆదాయ వృద్ధి 6 శాతం పెరిగింది.

విప్రో ఫలితాలు

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (Q3FY24) లో కన్సాలిడేటెడ్ లాభం 1.2 శాతం పెరిగి రూ.2,700.6 కోట్లకు చేరుకుంది. ఆపరేషన్స్ నుంచి వచ్చిన కన్సాలిడేటెడ్ ఆదాయం, గత సంవత్సరం Q3FY23 తో పోలిస్తే 4.4 శాతం తగ్గింది. అలాగే, గత త్రైమాసికం (Q2FY24) కన్నా 1.4 శాతం క్షీణించి రూ.22,205.1 కోట్లకు పరిమితమైంది.

టెక్ మహీంద్రా ఫలితాలు

ఈ క్యూ 3లో (Q3FY24) అత్యంత నిరాశాజనక ఫలితాలను టెక్ మహింద్ర ప్రకటించింది. సంస్థ నికర లాభంలో 61 శాతం క్షీణత నమోదైంది. కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం Q3FY23 లో రూ.13,734.6 కోట్లు కాగా, ఈ Q3FY24లో 4 శాతం తగ్గి రూ.13,101.3 కోట్లకు పరిమితమైంది.

ఏ స్టాక్ కొంటే బెటర్?

Q3FY24 ఫలితాలను పరిశీలిస్తే, టెక్ మహింద్రా కన్నా విప్రో, హెచ్ సీ ఎల్ టెక్ సంస్థల ఫలితాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. అందువల్ల, మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టెక్ మహీంద్రా కంటే హెచ్సిఎల్ టెక్, విప్రో స్టాక్స్ ను కొనుగోలు చేయడం మంచిది. హెచ్సీఎల్ టెక్, విప్రో ల్లో డిమాండ్ పరంగా సమీప, మధ్యకాలికంగా స్థిరీకరణ సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. కాగా, టెక్ మహీంద్రా తన దీర్ఘకాలిక వ్యూహాలను ఇంకా ప్రకటించలేదు. ‘‘హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రోల ఇటీవలి ఆర్థిక ఫలితాలు, భవిష్యత్ వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత హెచ్సీఎల్ టెక్ వైపే మొగ్గు చూపుతున్నాయి’’ అని స్టాక్ బాక్స్ లో రీసెర్చ్ అనలిస్ట్ గా ఉన్న ధ్రువ్ ముదరద్ది తెలిపారు. హెచ్సీఎల్ టెక్ స్టాక్స్ ను రూ.1,880 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచిస్తోంది. మరోవైపు, ఈ సంస్థ విప్రో స్టాక్ పై తటస్థ ధోరణిని కొనసాగిస్తోంది.

సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు మార్కెట్ విశ్లేషకులు, నిపుణులు, బ్రోకింగ్ కంపెనీలవి. ‘హిందుస్తాన్ టైమ్స్ తెలుగు’ వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

తదుపరి వ్యాసం