విప్రో షేరు ధర 13 శాతం పైకి.. 52 వారాల గరిష్ట స్థాయికి..-wipro share price jumps 13 percent to 52 week high post q3 results nifty it up ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  విప్రో షేరు ధర 13 శాతం పైకి.. 52 వారాల గరిష్ట స్థాయికి..

విప్రో షేరు ధర 13 శాతం పైకి.. 52 వారాల గరిష్ట స్థాయికి..

HT Telugu Desk HT Telugu
Jan 15, 2024 01:38 PM IST

విప్రో షేర్ ధర ఇంట్రాడేలో 13 శాతం పెరిగి 52 వారాల గరిష్టస్థాయికి చేరింది. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3ఎఫ్వై24)లో నికర లాభం క్షీణించినప్పటికీ కంపెనీ డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలు అంచనాలను అధిగమించడంతో విప్రో షేర్ ధర రూ.526.45కు చేరింది.

ఇంట్రాడేలో 13 శాతం పెరిగిన విప్రో షేర్ ధర
ఇంట్రాడేలో 13 శాతం పెరిగిన విప్రో షేర్ ధర

డిసెంబర్ త్రైమాసికం (క్యూ3ఎఫ్వై24)లో నికర లాభం క్షీణించినప్పటికీ కంపెనీ ఆదాయాలు అంచనాలను అధిగమించడంతో విప్రో షేర్లు ఇంట్రాడేలో 13 శాతం పెరిగి రూ. 526.45 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకాయి.

జనవరి 12న కంపెనీ ఫలితాలను వెల్లడించిన తర్వాత కంపెనీ అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ (ఏడీఆర్) దాదాపు 18 శాతం పెరిగి 20 నెలల గరిష్ట స్థాయి 6.35 డాలర్లకు చేరుకుంది.

విప్రో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 12 శాతం క్షీణించి రూ. 2,694 కోట్లకు పరిమితమైంది. క్యూ2ఎఫ్వై24లో కంపెనీ లాభం రూ. 2,667.3 కోట్లు కాగా క్యూ3ఎఫ్వై23లో రూ. 3,065 కోట్లుగా ఉంది.

వరుసగా నాలుగో త్రైమాసికంలో విప్రో లాభాల్లో క్షీణతను నమోదు చేసింది. ఈ పనితీరు ఇలాగే కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (క్యూ3ఎఫ్వై24) మూడో త్రైమాసికంలో నికర ఆదాయం 1.8 శాతం పెరిగి రూ. 2,690 కోట్లకు (323.9 మిలియన్ డాలర్లు) చేరుకుంది. ఐటీ సేవల వ్యాపార విభాగం ఆదాయం క్యూ4ఎఫ్ వై24లో 2,615 మిలియన్ డాలర్ల నుంచి 2,669 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని విప్రో సీఈవో విజయకుమార్ అంచనా వేశారు.

2024 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో విప్రో యొక్క మొత్తం ఆర్డర్లు స్థిర కరెన్సీలో 3.8 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి,.ఇది స్వల్పంగా 0.2 శాతం క్యూఓక్యూ పెరుగుదలను సూచిస్తుంది. 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో భారీ డీల్ బుకింగ్స్ 0.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది 8.3 శాతం క్షీణతను చూపించింది.

ఐటీ దిగ్గజాలు ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు ప్రకటించిన తరువాత, మొత్తం నిఫ్టీ ఐటి ఇండెక్స్ సోమవారం ఇంట్రాడేలో 2.5 శాతానికి పైగా పెరిగింది. విప్రో టాప్ పెర్ఫార్మర్ కాగా, టెక్ మహీంద్రా 7 శాతానికి పైగా పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,401.50కి చేరుకుంది. హెచ్సీఎల్ టెక్ కూడా 5 శాతం పెరిగి రూ.1,617.65 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది.

టీసీఎస్, ఇన్ఫోసిస్ కూడా సోమవారం వరుసగా 2 శాతం, 3.2 శాతం పెరిగి 52 వారాల గరిష్టాన్ని తాకాయి. ఫలితాల అనంతరం బ్రోకరేజీ సంస్థ యాక్సిస్ సెక్యూరిటీస్ రూ. 450 కోట్ల టార్గెట్ ధరతో విప్రోపై తన 'సేల్' నిర్ణయాన్ని కొనసాగించింది.

డిస్క్లైమర్: పైన చేసిన అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హిందుస్తాన్ టైమ్స్‌వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను తనిఖీ చేయాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.

Whats_app_banner