తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Discount : వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై భారిగా డిస్కౌంట్.. మళ్లీ ఈ ఛాన్స్ రాదేమో!

OnePlus Discount : వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌పై భారిగా డిస్కౌంట్.. మళ్లీ ఈ ఛాన్స్ రాదేమో!

Anand Sai HT Telugu

29 October 2024, 14:00 IST

google News
  • OnePlus 12 Discount: వన్‌ప్లస్ ఫోన్ కొనాలని చూసేవారికి గుడ్‌న్యూస్. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ మీద మంచి ఆఫర్ లభిస్తుంది. రూ.7 వేల వరకు డైరెక్ట్ డిస్కౌంట్ ఉంది.

వన్‌ప్లస్ 12 డిస్కౌంట్
వన్‌ప్లస్ 12 డిస్కౌంట్

వన్‌ప్లస్ 12 డిస్కౌంట్

పండుగ సీజన్ కావడంతో కంపెనీలు తమ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. వన్‌ప్లస్ కూడా ఈ లిస్టులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12 తగ్గింపుతో వస్తుంది. వన్‌ప్లస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 13 అక్టోబర్ 30న చైనాలో లాంచ్ కానుంది. లాంచ్ వార్తలతో భారతదేశంలో దాని పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 12పై రూ .7000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12 ఫోన్ మీద రూ.7250 డైరెక్ట్ డిస్కౌంట్ నడుస్తోంది. అందమైన డిజైన్‌తో 5400 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ స్మార్ట్ ఫోన్ కలిగి ఉంది. మీరు మంచి ఫోన్ కొనాలనుకుంటే ఇది గొప్ప అవకాశం.

వన్‌ప్లస్ 13 వచ్చేందుకు రెడీ అయింది. అంతకుముందు వన్‌ప్లస్ 12పై ఈ ఆఫర్ ప్రకటించారు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ 12 జీబీ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.57,749కు విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ పై ఎలాంటి షరతులు లేకుండా రూ.7250 డిస్కౌంట్ లభిస్తుంది.

ఎస్బీఐ బ్యాంక్ కార్డుతో రూ.750 అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ మీద ఎలాంటి ఎక్స్ఛేంజ్ ఆఫర్ లేదు.

వన్‌ప్లస్ 12 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

6.82 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ 2కే డిస్‌ప్లేను అందించారు. ఇందులో ఎల్టీపీ ప్లస్ ప్యానెల్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిమిషాల బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో స్క్రీన్‌కు సేఫ్టీగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ను ఇన్ స్టాల్ చేశారు.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై నడుస్తుంది. గ్రాఫిక్స్ కోసం అడ్రినో 750 జీపీయూ, గేమింగ్ కోసం అధునాతన వేపర్ కూలింగ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం, వన్‌ప్లస్ 12లో 5400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 100వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

కెమెరా విషయానికొస్తే వన్‌ప్లస్ 12 ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

తదుపరి వ్యాసం