Realme New Phone : రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్.. 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమెరా-realme gt 7 pro come up with 16 gb ram details leaked ahead of launch check inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Realme New Phone : రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్.. 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమెరా

Realme New Phone : రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్.. 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమెరా

Anand Sai HT Telugu
Oct 28, 2024 05:30 PM IST

Realme New Phone : రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్ రానుంది. ఈ మేరకు వివరాలు లీక్ అయ్యాయి. రియల్‌మీ జీటీ 7 ప్రోకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్
రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్

రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చే నెలలో లాంచ్ కానుంది. కంపెనీ దీనిని మొదట చైనాలో లాంచ్ చేయబోతోంది. దీని లాంచ్ తేదీ నవంబర్ 4గా నిర్ణయించారు. లాంచ్‌కు ముందు ఈ ఫోన్‌కు పలు సర్టిఫికేషన్లు వచ్చాయి. చైనాలోని ఎంఐఐటీలో ఈ ఫోన్ కనిపించింది. ఇది కాకుండా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్బెంచ్లో కూడా జాబితా చేశారు. రెండు సర్టిఫికేషన్లలో ఫోన్ స్పెసిఫికేషన్లు ఒకేలా ఉన్నాయి. గీక్బెంచ్ సింగిల్ కోర్ టెస్ట్‌లో 3216 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్‌లో 10301 పాయింట్లు సాధించింది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టంపై 16 జీబీ ర్యామ్‌ను ఈ ఫోన్ అందించనుంది.

ఈ ఫోన్ టైటానియం, వైట్ రంగుల్లో లభిస్తుంది. ప్రత్యేకత ఏంటంటే ఈ ఫోన్‌లో ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కంపెనీ అందించబోతోంది. ఫోన్ ప్రాసెసర్ విషయానికొస్తే జీటీ 7 ప్రో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. రియల్‌మీ‌కి చెందిన ఈ ఫోన్ ఏఐ అడాప్టివ్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో రానుంది. ఈ ఫోన్ వినియోగదారులకు అద్భుతమైన తక్కువ-పవర్ ఫుల్ ఫ్రేమ్ అనుభవాన్ని ఇస్తుంది. రియల్‌మీ జీటీ 7 ప్రో 11480 ఎంఎం డ్యుయల్ వీసీ హీట్ డిస్ట్రిబ్యూషన్, మెరుగైన టెంపరేచర్ బ్యాలెన్స్ పెర్ఫార్మెన్స్‌తో వచ్చిన మొదటి డివైజ్.

లీకైన నివేదిక ప్రకారం ఈ ఫోన్లో 2780×1264 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల డిస్‌ప్లేను కంపెనీ అందించవచ్చు. ఈ డిస్‌ప్లే 6000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ లెవల్‌తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్న ఈ ఫోన్‌లో డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ను కూడా చూడవచ్చు. 24 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 1 టీబీతో ఈ ఫోన్ రానుంది.

ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో ఎల్ఈడి ఫ్లాష్‌తో మూడు కెమెరాలను అందించవచ్చు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50 మెగాపిక్సెల్ 3 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను పొందవచ్చు.

బయోమెట్రిక్ సెక్యూరిటీ కోసం ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను చూడొచ్చు. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఈ ఫోన్ బ్యాటరీ 6500 ఎంఏహెచ్‌గా ఉండనుంది. కనెక్టివిటీ కోసం కంపెనీ ఫోన్లో 5 జీఎస్ఎ / ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4 జి వోల్టే, వై-ఫై 7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్బీ టైప్ సి పోర్ట్ వంటి ఆప్షన్స్ అందించనుంది. ఓఎస్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ యూఐ 6.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

Whats_app_banner