Government employees : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ మీద షాక్ ఇచ్చిన కేంద్రం.. ఆ రెండు విషయాల్లో!
17 June 2024, 11:54 IST
General provident fund : జీపీఎఫ్ వడ్డీని యథాతథంగా ఉంచింది కేంద్రం. అంతేకాదు.. ఉద్యోగుల వర్కింగ్పైనా పలు కఠిన నిబంధనలను తీసుకొస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
General provident fund interest rate : 2024 ఏప్రిల్ నుంచి జూన్ వరకు జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్) సహా ఇలాంటి ప్రావిడెంట్ ఫండ్ పథకాలకు వర్తించే వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో వెల్లడించింది. జీపీఎఫ్ వడ్డీ రేట్లను మార్చకుండా ఉద్యోగులకు షాక్ ఇచ్చింది కేంద్రం.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం పలు రకాల ప్రావిడెంట్ ఫండ్లు ఉన్నాయి. వీటిలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ముఖ్యమైనవి.
జీపీఎఫ్ ప్రధానంగా ప్రభుత్వ సిబ్బందికి సేవలు అందిస్తుంది. అయితే ఈపీఎఫ్ ప్రైవేట్ రంగ కార్మికుల కోసం రూపొందించారు. పీపీఎఫ్ ఏ వృత్తికి చెందిన వ్యక్తులకైనా అందుబాటులో ఉంటుంది.
జీపీఎఫ్పై అధికారిక ప్రకటన..
ఆర్థిక మంత్రిత్వ శాఖ డీఈఏ విడుదల చేసిన తీర్మానం ప్రకారం.. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ధృవీకరించింది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ , ఇతర సారూప్య ఫండ్ల చందాదారులకు జమ చేసిన మొత్తాలపై ఏప్రిల్ 1, 2024 నుంచి జూన్ 30, 2024 వరకు 7.1% వడ్డీ రేటు ఉంటుంది.
General provident fund latest news : 2024-2025 సంవత్సరంలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్, ఇతర సారూప్య ఫండ్లకు చందాదారులు జమ చేసే మొత్తాలపై 7.1% (ఏడు పాయింట్లు ఒక శాతం) చొప్పున వడ్డీ ఉంటుందని ప్రకటన వెల్లడించింది. ఇది ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లో ఉంటుందని తెలిపింది.
గత త్రైమాసికంలోనూ జీపీఎఫ్పై వడ్డీ రేటు 7.1శాతంగానే ఉంది.
2024 జూన్ 10న ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) జారీ చేసిన తీర్మానం ద్వారా ఈ నిర్ణయాన్ని ధృవీకరించారు.
ఇన్ని ఫండ్స్ ఉన్నాయి..
- జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (సెంట్రల్ సర్వీసెస్)
- కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (ఇండియా)
- ఆల్ ఇండియా సర్వీసెస్
- ప్రావిడెంట్ ఫండ్ స్టేట్ రైల్వే ప్రావిడెంట్
- ఫండ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (డిఫెన్స్ సర్వీసెస్)
- ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్ మెంట్ ప్రావిడెంట్ ఫండ్
- ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ వర్క్ మెన్ ప్రావిడెంట్ ఫండ్
- ఇండియన్ నేవల్ డాక్ యార్డ్ వర్క్ మెన్ ప్రావిడెంట్ ఫండ్
- డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్
- ఆర్మ్ డ్ ఫోర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్
గత 15 ఏళ్లుగా జీపీఎఫ్ పై వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..
ఉద్యోగులకు కఠిన నిబంధనలు..!
Government employees updates : మరోవైపు.. ఉద్యోగుల పనితీరుపైనా కఠిన నిబంధనలు విధించేందుకు సిద్ధపడింది కేంద్రం. కార్యాలయానికి ఆలస్యంగా వచ్చి, సమయం గడవక ముందే వెళ్లిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది సిబ్బంది మంత్రిత్వశాఖ. అన్ని విభాగాలు, శాఖలు ఈ విషయంపై ఫోకస్ చేయాలని సూచించింది. ఇప్పటికే పలు ఫిర్యాదులు అందినట్టు వివరించింది.
ఆలస్యంగా వస్తే.. ఆరోజుకు ఒక పూట సాధారణ సెలవు చొప్పున కొత విధించాలని సిబ్బంది మంత్రిత్వశాఖ వెల్లడించింది.