Indian employees : అల్లాడిపోతున్న భారత ఉద్యోగులు.. 86శాతం మంది పనిలో నలిగిపోతున్నారు!-86 indian employees struggling at workplaces gallup ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Indian Employees : అల్లాడిపోతున్న భారత ఉద్యోగులు.. 86శాతం మంది పనిలో నలిగిపోతున్నారు!

Indian employees : అల్లాడిపోతున్న భారత ఉద్యోగులు.. 86శాతం మంది పనిలో నలిగిపోతున్నారు!

Sharath Chitturi HT Telugu
Jun 14, 2024 11:08 AM IST

Indian employees Gallup : భారత ఉద్యోగులు పనిలో నలిగిపోతున్నారు! ఈ మేరకు ఒక నివేదిక పలు కీలక, ఆందోళనకర విషయాలను వెల్లడించింది.

86శాతం మంది భారతీయులు.. పనిలో నలిగిపోతున్నారు
86శాతం మంది భారతీయులు.. పనిలో నలిగిపోతున్నారు (Pixabay)

Indian employees gallup survey : దక్షిణాసియాలో రెండో అతిపెద్ద శ్రామిక జనాభా కలిగిన దేశంగా గుర్తింపు ఉన్న భారత్​లో.. ఉద్యోగులు అల్లాడిపోతున్నారు! 86శాతం మంది ఉద్యోగులు.. చేస్తున్న పనితో నలిగిపోతున్నారు. ఇది.. ప్రపంచ సగటు కన్నా చాలా రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళనకర విషయం. ఈ వివరాలు.. 2024 గాలప్​ స్టేట్​ ఆఫ్​ ది గ్లోబల్​ వర్క్​ప్లేస్​ నివేదిక వెల్లడించింది.

86శాతం మందికి పనిలో కష్టాలు..!

తాము తమ లక్ష్యాలకు అనుగుణంగా ముందడుగు వేస్తున్నామని.. కేవలం 14శాతం మంది భారతీయ ఉద్యోగులే చెప్పారు. అంతర్జాతీయంగా ఈ సగటు 34శాతంగా ఉంది. 2023లో ఇది 35శాతంగా ఉండేది.

మరీ ముఖ్యంగా.. ఉద్యోగంలో సంతోషంగా ఉండి, జీవితంలో ముందడుగు వేస్తున్నట్టు భావించే ఉద్యోగులు ఉన్న ప్రాంతాల్లో దక్షిణాసియా అట్టడుగున ఉంది! ఇక్కడ.. కేవలం 15శాతం మంది ఉద్యోగులే.. గోల్స్​వైపు అడుగులు వేస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్​లో ఇది 60శాతంగా ఉంది.

Struggling Indian employees : ఉద్యోగులను.. థ్రైవింగ్​ (అభివృద్ధి చెందడం), స్ట్రగ్లింగ్​ (కష్టపడుతుండటం), సఫరింగ్​ (బాధఫడుతుండటం) వంటి మూడు కేటగిరీలుగా విభజించి, వివిధ ఫ్యాక్టర్స్​ని పరిగణలోకి తీసుకుని ఈ 'లైఫ్​ ఇవాల్యుయేషన్​ ఇండెక్స్​'ని రూపొందించింది గాలప్​.

పని ప్రదేశాల్లో సమస్యలు..

నివేదిక ప్రకారం.. 48శాతం మంది భారత ఉద్యోగులు.. చేస్తున్న పని మీద మోటివేషన్​, డెడికేషన్​తో లేరు. దక్షిణాసియాలో ఈ సగటు 56శాతంగా ఉంది. 32శాతం మంది భారత ఉద్యోగులు.. చేస్తున్న పని పట్ల శ్రద్ధ, మోటివేడెట్​గా ఉన్నారు. అంతర్జాతీయ సగటు 23శాతం కన్నా ఎక్కువే!

20శాతం మంది భారతీయ ఉద్యోగులు.. చేస్తున్న పనితో తమ అవసరాలు తీరడం లేదని అభిప్రాయపడ్డారు. అంటే.. జీతాలు సరిపోకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్టు. యాజమాన్యాలు పెట్టే టార్గెట్​లను వీరు నిత్యం విమర్శిస్తూనే ఉంటారు.

Indian employees survey : దక్షిణాసియాలోని 29శాతం మంది ఉద్యోగులు.. ఒంటరితనంతో బాధపడుతున్నారు. 34శాతం మంది ఎప్పుడు కోపంగా ఉంటారు. 42శాతం మంది బాధలో ఉంటారు. 25శాతం మంది రిమోట్​ వర్కర్స్​.. ఒంటరితనంతో సతమతమవుతున్నారు.

జాబ్​ మార్కెట్​ బాగుందని 57శాతం మంది భారతీయ ఉద్యోగులు అభిప్రాపడ్డారు. కానీ గతేడాదితో పోల్చితే.. ఇలా చెప్పేవారు 2శాతం తగ్గారు! కానీ దక్షిమాసియాతో (48శాతం) పోల్చుకుంటే ఎక్కువే.

యాజమాన్యం.. ప్రొడక్టివ్​ టీమ్స్​ని బిల్డ్​ చేయడంపై, ఉద్యోగుల ఆరోగ్య విషయాలకు మద్దతివ్వడం వంటి వాటిపై ఫోకస్​ చేయాలని నివేదిక సూచించింది. ఉద్యోగులు.. పని ప్రదేశాల్లో తాము పడుతున్న కష్టాలను బయటకు చెప్పాలని, అప్పుడే నెగిటివ్​ ఎమోషన్స్​ దూరమవుతాయని స్పష్టం చేసింది. ఫలితంగా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని పేర్కొంది. యాజమాన్యం కూడా.. ఉద్యోగుల పనికి తగ్గట్టు గుర్తింపు, ప్రయోజనాలను ఇవ్వాలని వెల్లడించింది.

Whats_app_banner

సంబంధిత కథనం