GO 317 Problems: నేటి నుంచి తెలంగాణ స్థానికత నమోదుకు ఉద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
GO 317 Problems: జీవో 317తో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు తలెత్తుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.
GO 317 Problems: తెలంగాణ స్థానికత నమోదులో తలెత్తుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం జారీ చేసిన జీవో 317 పై తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
స్థానికత సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14 నుంచి 30 వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. జీవో 317పై బుధ వారం సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామో దర్ రాజనర్సింహ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది.
ఉపసంఘం సభ్యుడు, రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రఘునందన్రావు, పీఆర్సీ చైర్మన్ శివశంకర్, ఇతర అధి కారులు ఈ భేటీలో పాల్గొన్నారు. జీవో 317 జారీతో తమకు అన్యాయం జరిగిందని, తమను స్వస్థలాలకు బదిలీ చేయాలని, దంప తులకు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ దాదాపు 12 వేల మందికిపైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు.
స్థానికత విషయంలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 14 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీక రించాలని మంత్రులు ఆదేశించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మరో సారి దరఖాస్తు చేసుకునే అవ కాశం కల్పించాలని నిర్ణయించారు.
ఉద్యోగుల దరఖాస్తుల్లో స్థానికత నమోదు చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా స్పౌజ్ క్యాటగిరీలో భార్య/భర్తకు సైతం బదిలీ కోరుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. సెల్‌ఫోన్లకు మెసేజ్ ద్వారా సమాచారం పంపాలని, దరఖాస్తు స్వీకరించినట్టు ధృవీకరణ ఇవ్వాలని సూచించారు.
క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో కమిటీ చైర్మన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ, సభ్యులు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు .
ఉద్యోగులు మల్టిపుల్ అప్లికేషన్స్ దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటివరకు మొత్తం 12,011 దరఖాస్తులను వెబ్‌సైట్ ద్వారా స్వీకరించారు. ఈ దరఖాస్తులను రీ - వెరిఫికేషన్ కు అవకాశం కల్పించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తు స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా రిజిస్ట్రేషన్ నంబర్ కూడా కేటాయిస్తున్నారు. sar