General Elections 2024: లోక్ సభ ఎన్నికల సమయంలో.. ఈ స్టాక్స్ తో లాాభాలు గ్యారెంటీ
17 February 2024, 19:24 IST
- General Elections 2024 Stock Picks: ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో శ్రీరామ్ వే2వెల్త్ తన టాప్ 10 స్టాక్ పిక్స్ ను విడుదల చేసింది. ఇవి స్వల్ప లేదా మధ్యకాలికంగా కనీసం 10 నుంచి 20 శాతం వృద్ధి సాధిస్తాయని చెబుతోంది.
ప్రతీకాత్మక చిత్రం
స్టాక్ మార్కెట్ ను గణనీయంగా ప్రభావితం చేసే ప్రధాన అంశాలలో లోక్ సభ ఎన్నికలు ఒకటి. చివరకు, ప్రి పోల్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు కారణమవుతుంటాయి. వరుసగా మూడవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాని మోదీ ఆత్మ విశ్వాసంతో ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు అధిక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
మోదీ వైపే చూపు
పీఎం మోదీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే సెంటిమెంట్ మార్కెట్ సానుకూలతకు కారణమవుతుందని, ఇది ఇన్వెస్టర్ల మనోభావాలను బలపరుస్తుందని, గత విధానాల కొనసాగింపు వల్ల మార్కెట్ బలపడుతుందని బ్రోకరేజీ సంస్థ శ్రీరామ్ వే2వెల్త్ అభిప్రాయపడుతోంది. సగటు కంటే తక్కువ వర్షపాతం, ఎల్-నినో ప్రభావం తదితర కారణాల వల్ల గత కొన్ని నెలలుగా గ్రామీణ వినియోగ డిమాండ్ తగ్గిపోయింది. గ్రామీణ వినియోగ డిమాండ్ ను ఉత్తేజపరిచేందుకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో లిక్విడిటీని ఇన్ ఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల, ఎఫ్ఎంసీజీ, ట్రాక్టర్, అగ్రి ఎక్విప్మెంట్ స్టాక్స్ ను ఇన్వెస్టర్లు పరిశీలిస్తుంటారని బ్రోకరేజీ సంస్థ తెలిపింది. ఎన్నికలకు ముందు వ్యవసాయ ఆధారిత ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భారీ ఎరువుల సబ్సిడీని ప్రకటిస్తే సానుకూలంగా స్పందించే వ్యవసాయ, రసాయన రంగం మరో ముఖ్యమైన రంగం.
సార్వత్రిక ఎన్నికలు 2024 స్టాక్ ఎంపికలు
ప్రస్తుత మార్కెట్ నేపధ్యంలో శ్రీరామ్ వే2వెల్త్ ఈ ఎన్నికల సీజన్ కోసం తన టాప్ 10 జనరల్ ఎలక్షన్స్ 2024 స్టాక్ పిక్స్ ను విడుదల చేసింది. టెక్నికల్, ఫండమెంటల్ పారామీటర్ల ఆధారంగా ఈ క్వాలిటీ స్టాక్స్ ను ఎంపిక చేసింది. అవి
1.భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్): ప్రస్తుత మార్కెట్ ధర (సీఎంపీ): రూ.185.90; టార్గెట్: రూ.215; వృద్ధి అవకాశం: 14 శాతం
2. హీరో మోటోకార్ప్: సీఎంపీ: రూ.4,818.55; టార్గెట్: రూ.5,020; వృద్ధి అవకాశం: 14 శాతం.
3. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్): సీఎంపీ: రూ.2,351; టార్గెట్: రూ.2,828; వృద్ధి అవకాశం: 11 శాతం.
4. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ): సీఎంపీ: రూ.189.90; టార్గెట్: రూ.210; వృద్ధి అవకాశం: 11 శాతం.
5. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ): సీఎంపీ: రూ.951.30; లక్ష్యం: రూ.1,080; వృద్ధి అవకాశం: 16 శాతం.
6. న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ): సీఎంపీ: రూ.261.90; టార్గెట్: రూ.325; వృద్ధి అవకాశం: 21 శాతం.
7. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ): సీఎంపీ: రూ.634; టార్గెట్: రూ.700; వృద్ధి అవకాశం: 10 శాతం.
8. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్: సీఎంపీ: రూ.9,815.35; టార్గెట్: రూ.10,980; వృద్ధి అవకాశం: 11 శాతం.
9.యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్: సీఎంపీ: రూ.1,069.5; టార్గెట్: రూ.1,192; వృద్ధి అవకాశం: 12 శాతం.
10. వరుణ్ బేవరేజెస్ లిమిటెడ్: సీఎంపీ: రూ.1,425.05; లక్ష్యం: రూ.1,452; వృద్ధి అవకాశం: 18 శాతం
సూచన: ఇది నిపుణులు, బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయాలతో కూడిన కథనం. ఇన్వెస్టర్లు స్వీయ అధ్యయనం, స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.
టాపిక్