తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Car Mileage Improve Tips : ఈ 5 చిట్కాలు పాటిస్తే.. మీ కారు మైలేజీని పెంచడంలో సాయపడతాయి

Car Mileage Improve Tips : ఈ 5 చిట్కాలు పాటిస్తే.. మీ కారు మైలేజీని పెంచడంలో సాయపడతాయి

Anand Sai HT Telugu

06 November 2024, 12:00 IST

google News
    • Mileage Improve Tips : మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువగా చూసేది కారు మైలేజీ. తక్కువ ధరలో కారు కొన్నా మైలేజీ ఎక్కువగా ఇవ్వాలని కోరుకుంటారు. కానీ మైలేజీ ఎక్కువగా వచ్చేందుకు కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలి
కారు మైలేజీ టిప్స్
కారు మైలేజీ టిప్స్ (Pixabay)

కారు మైలేజీ టిప్స్

కారు కొనడమే కాదు.. దానిని మెయింటెన్ చేయడం కూడా తెలిసి ఉండాలి. లేకపోతే మైలేజీ మీద ప్రభావం చూపిస్తుంది. చాలా మంది సరిగా కారు మెయింటెన్ చేయక.. మైలేజీ రావడం లేదని తిడుతుంటారు. ప్రతీ చిన్న విషయాన్ని ఫాలో అయితేనే ఇది సాధ్యమవుతుంది.

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల మధ్య ప్రజలు సతమతమవుతున్నారు. ఇదే సమయంలో తమ కారు మంచి మైలేజీని ఇవ్వాలని కోరుకుంటారు. దీనికోసం కొన్ని ప్రయత్నాలు చేయాలి. కారులో మంచి ఇంధనాన్ని నింపడం నుంచి ఏసీ స్విచ్ ఆఫ్ చేసి కారు నడపడం వరకు చాలా విషయాలు ఉంటాయి.

ఇంజిన్‌ను మంచి స్థితిలో ఉంచడంలో కారు టైర్లు చాలా సాయంగా ఉంటాయి. వాహనం నాలుగు చక్రాలలో సరైన గాలి ఒత్తిడి ఉంటే, ఇంజిన్‌పై తక్కువ లోడ్ ఉంటుంది. ఈ విధంగా వాహనం సామర్థ్యాన్ని పెంచవచ్చు. గాలి మరి తక్కువగా ఉంటే మాత్రం మైలేజీపై ప్రభావం చూపుతుంది. కారు వెళ్లే వేగం తగ్గుతుంది.

కారు మైలేజ్ దాని ఇంజిన్‌పై ఎంత లోడ్ చేయబడుతోంది అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మీ కారులో 4 మంది కూర్చునే సామర్థ్యం ఉండి, ఆపై మీరు బూట్‌లో ఎక్కువ లగేజీని నింపినట్లయితే ఇంజిన్‌పై లోడ్ పెరుగుతుంది. దీని కారణంగా మైలేజ్ కూడా తగ్గవచ్చు. అందుకే బరువు అతిగా ఉండేలా చేయెుద్దు.

మీ ఇంజిన్‌లో సరిగాలేని స్పార్క్ ప్లగ్ మీ వాహనం ఇంధన వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. స్పార్క్ ప్లగ్ సకాలంలో మార్చకపోతే కారు మైలేజ్ 30 శాతం వరకు తగ్గవచ్చు. కారు మైలేజ్ అకస్మాత్తుగా తగ్గితే కచ్చితంగా ఒకసారి స్పార్క్ ప్లగ్‌ని చెక్ చేయండి. కొత్తది మార్చండి.

డ్రైవింగ్ చేసేటప్పుడు సరైన వేగాన్ని నిర్వహించడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. కారు వేగం దాని ఇంధన సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వేగంగా డ్రైవ్ చేస్తూ, మళ్లీ మళ్లీ బ్రేక్‌లు నొక్కాల్సి వస్తే ఇంజన్‌పై ఎక్కువ లోడ్‌ ఏర్పడి ఇంధనం కూడా అయిపోతుంది. దీంతో మైలేజీ మీద ప్రభావం పడుతుంది. ఒకే స్పీడుతో వెళ్తే మంచిది.

మీరు రెడ్ లైట్ వద్ద ఆపి 30 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం వేచి ఉండవలసి వస్తే కారు ఇంజిన్‌ను ఆఫ్ చేయండి. ఒక అధ్యయనం ప్రకారం వాహనం కదలకుండా ఇంజిన్‌ను ఆన్‌లో ఉంచినట్లయితే ప్రతి గంటకు చాలా పెట్రోల్‌ను వాడుకుంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం