Flipkart Big Diwali Sale: ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్ ఈ రోజే లాస్ట్; ఈ స్మార్ట్ ఫోన్స్ పై బెస్ట్ ఆఫర్స్
11 November 2023, 15:31 IST
Flipkart Big Diwali Sale: ఫ్లిప్ కార్ట్ లో దీపావళి సందర్భంగా నిర్వహించిన బిగ్ దివాళి సేల్ నవంబర్ 11వ తేదీతో ముగుస్తుంది. వన్ ప్లస్ 11 5జీ, ఐ ఫోన్ 15 ప్రొ, సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జీ, ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్, గూగుల్ పిక్సెల్ 8 ప్రొ.. తదితర ప్రీమియం ఫోన్స్ పై ఈ సేల్ లో మంచి ఆఫర్స్ ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
Flipkart Big Diwali Sale: దీపావళి వచ్చేసింది. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడానికి ఇది మంచి సమయం. ఈ పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళి సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌సెట్‌లు, ఇతర గాడ్జెట్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. బ్యాంకుల నుండి అదనపు డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
OnePlus 11 5G: వన్ ప్లస్ 11 5 జీ - 256 జీబీ
ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.58,700 కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లో 50 MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్ తో 32MP టెలిఫోటో లెన్స్ సెటప్ ఉంది. అదనంగా, 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ PRO, PANO, NIGHT వంటి అనేక రకాల కెమెరా మోడ్‌లను అందిస్తుంది. గేమింగ్ ప్రియుల కోసం రూపొందించబడిన ఈ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో 6.7-అంగుళాల 120Hz AMOLED QHD డిస్‌ప్లే ఉంది. ఇందులో 8 GB RAM ఉన్న స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ను అమర్చారు.
Apple iPhone 15 Pro: ఐ ఫోన్ 15 ప్రొ - 128 జీబీ
ఇటీవలనే మార్కెట్లోకి వచ్చిన ఐ ఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో ఒకటైన ఐ ఫోన్ 15 ప్రొ ఫ్లిప్ కార్ట్ సేల్ లో అందుబాటులో ఉంది. టైటానియం బిల్డ్ తో, మన్నికైన సిరామిక్ షీల్డ్ ఫ్రంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ ను దృఢంగా రూపొందించారు. ఇందులో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. అలాగే, A17 ప్రో చిప్ ను ఇందులో అమర్చారు. ఇందులో 7 లెన్స్‌లతో 48MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ ప్రీమియం ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ.134900 లకు లభిస్తుంది.
Samsung Galaxy S23 Ultra 5G: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా
సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5 జీ ఫోన్ ప్రీమియం ఫోన్ ఎంఆర్పీ రూ. 99,999 గా ఉంది. ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ప్రో-గ్రేడ్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. నైట్‌గ్రఫీ ద్వారా తక్కువ-కాంతిలో కూడా స్పష్టమైన ఫోటోలను తీయగలదు. 200MP రిజల్యూషన్‌తో వైడ్ యాంగిల్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. ఇందులో శక్తిమంతమైన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ను అమర్చారు.
iPhone 14 Pro Max: ఐ ఫోన్ 14 ప్రొ మాక్స్ 128 జీబీ
ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న 48MP మెయిన్ కెమెరా 4K డాల్బీ విజన్ సినిమాటిక్ మోడ్ కు సపోర్ట్ చేస్తుంది. అద్భుతమైన బ్యాటరీ సామర్ద్యంతో 29 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ను అందించగలదు. ఈ స్మార్ట్ ఫోన్ గరిష్ట రిటైల్ ధర రూ.127999.
Google Pixel 8 Pro: గూగుల్ పిక్సెల్ 8 ప్రొ
ఈ స్మార్ట్‌ఫోన్ 12 GB RAM మరియు 128 GB స్టోరేజ్‌తో వస్తోంది. ఇందులో టెన్సర్ G3 SoC ప్రాసెసర్ ను అమర్చారు. ఇందులో 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. అలాగే, 50MP+48MP+48MP రెజొల్యూషన్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ తో అధిక నాణ్యత కలిగిన ఫోటోలను తీయవచ్చు. ఇందులో 5050 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ గరిష్ట రిటైల్ ధర రూ. 1,06,999.