తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fire-boltt Supernova: యాపిల్ వాచ్ అల్ట్రా లాంటి లుక్‍తో మరో బడ్జెట్ స్మార్ట్‌వాచ్.. ఫైర్ బోల్ట్ నుంచి..

Fire-Boltt Supernova: యాపిల్ వాచ్ అల్ట్రా లాంటి లుక్‍తో మరో బడ్జెట్ స్మార్ట్‌వాచ్.. ఫైర్ బోల్ట్ నుంచి..

15 January 2023, 22:27 IST

google News
    • Fire-Boltt Supernova Smartwatch: ఫైర్ బోల్ట్ సూపర్‌నోవా స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. యాపిల్ వాచ్ అల్ట్రా లాంటి డిజైన్‍ను ఇది కలిగి ఉంది. బడ్జెట్ రేంజ్‍లో ఇది అడుగుపెట్టింది.
Fire-Boltt Supernova: యాపిల్ వాచ్ అల్ట్రా లాంటి లుక్‍తో మరో బడ్జెట్ వాచ్ (Photo: Fire-Boltt)
Fire-Boltt Supernova: యాపిల్ వాచ్ అల్ట్రా లాంటి లుక్‍తో మరో బడ్జెట్ వాచ్ (Photo: Fire-Boltt)

Fire-Boltt Supernova: యాపిల్ వాచ్ అల్ట్రా లాంటి లుక్‍తో మరో బడ్జెట్ వాచ్ (Photo: Fire-Boltt)

Fire-Boltt Supernova Smartwatch: ప్రీమియమ్ యాపిల్ వాచ్ అల్ట్రా.. డిజైన్ పరంగా చాలా డిఫరెంట్‍గా అదిరిపోయేలా ఉంది. రగ్డ్ డిజైన్‍తో సూపర్ లుక్‍ను కలిగి ఉంది. దీంతో ఇతర కంపెనీలు అదే డిజైన్‍ను పోలినట్టు ఉండేలా స్మార్ట్‌వాచ్‍లను మార్కెట్‍లోకి తెస్తున్నాయి. యాపిల్ వాచ్‍ అల్ట్రా ను పోలిన డిజైన్‍తో కొన్ని స్మార్ట్‌వాచ్‍లు వస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయ కంపెనీ ఫైర్ బోల్ట్.. అచ్చం చూసేందుకు యాపిల్ వాచ్ అల్ట్రాలా ఉండే మరో మోడల్‍ను లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ సూపర్‌నోవా పేరిట దీన్ని తాజాగా విడుదల చేసింది. అమోలెడ్ డిస్‍ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో ఫైర్ బోల్ట్ సూపర్‌నోవా స్మార్ట్‌వాచ్ వస్తోంది. ఈ వాచ్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లు ఇవే.

ఫైర్ బోల్ట్ నోవా వాచ్ ధర

Fire-Boltt Supernova Smartwatch Price: ఫైర్ బోల్ట్ సూపర్‌నోవా స్మార్ట్‌వాచ్ ధర రూ.3,499గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, ఫైర్ బోల్ట్ వెబ్‍సైట్‍లో సేల్‍కు అందుబాటులోకి వచ్చింది. ఎల్లో, ఆరెంజ్, బ్లాక్, లైట్ గోల్డ్, గోల్డ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

ఫైర్ బోర్ట్ సూపర్‌నోవా: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Fire-Boltt Supernova Specifications: 1.78 ఇంచుల AMOLED స్క్వేర్ షేప్ డిస్‍ప్లేను ఫైర్ బోల్ట్ సూపర్‌నోవా స్మార్ట్‌వాచ్ వస్తోంది. ఆల్వేస్ ఆన్ డిస్‍ప్లే ఫీచర్ ఉంటుంది. ఈ వాచ్ డయల్, ఫంక్షనల్ బటన్, సైడ్‍లో స్పీకర్ హోల్స్ చూడడానికి వాచ్ అల్ట్రానే పోలి ఉంటాయి. స్ట్రాప్స్ డిజైన్‍ కూడా లుక్ పరంగా అలాగే ఉంది. బ్లూటూత్ కాలింగ్‍కు ఫైర్ బోల్ట్ సూపర్‌నోవా సపోర్ట్ చేస్తుంది. ఇందుకోసం ఇన్‍బుల్ట్ గా స్పీకర్, మైక్రో ఫోన్‍ను కలిగి ఉంది. దీంతో బ్లూటూత్ ద్వారా మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ నుంచి కాల్స్ మాట్లాడవచ్చు.

వాయిస్ అసిస్టెంట్‍కు కూడా Fire-Boltt Supernova స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్, స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లు ఉంటాయి. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ సహా మొత్తంగా 123 స్పోర్ట్స్ మోడ్స్ కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

Fire-Boltt Supernova Smartwatch: ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు దానికి వచ్చే నోటిఫికేషన్లను కూడా ఈ ఫైర్ బోల్ట్ సూపర్‌నోవా వాచ్‍లో పొందవచ్చు. మ్యూజిక్, కెమెరాను కంట్రోల్ చేయవచ్చు. ఇక ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే సూపర్‌నోవా స్మార్ట్‌వాచ్ ఐదు రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఫైర్ బోల్ట్ పేర్కొంది. వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం ఐపీ67 రేటింగ్ ఉంటుంది.

యాపిల్ వాచ్ అల్ట్రాను పోలిన డిజైన్‍తో గ్లాడియేటర్ స్మార్ట్ వాచ్‍ను ఫైర్ బోల్ట్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా, ఇప్పుడు సూపర్‌నోవా వాచ్‍ను తీసుకొచ్చింది.

టాపిక్

తదుపరి వ్యాసం