EPFO update : ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్- ఇకపై ఆ ప్రూఫ్‌గా ఆధార్ పని చేయదు!
18 January 2024, 12:15 IST
EPFO update : డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ విషయంపై కీలక అప్డేట్ ఇచ్చింది ఈపీఎఫ్ఓ. పుట్టిన రోజును ధ్రువీకరించేందుకు.. ఇక నుంచి ఆధార్‌ను వాడలేరని స్పష్టం చేసింది.
ఈపీఎఫ్ఓ కీలక అప్డేట్- ఇకపై దానికి ఆధార్ పని చేయదు!
EPFO update latest : ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఓ కీలక ప్రకటన చేసింది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఆమోదయోగ్యం కాదని ప్రకటించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) ఆదేశాల మేరకు.. పుట్టిన తేదీకి ఆమోదయోగ్యమైన పత్రంగా ఆధార్ కార్డును తొలగిస్తున్నట్టు భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఈపీఎఫ్ఓ నోటిఫై చేసింది.
యూఐడిఏఐ ఆదేశం (సర్క్యులర్ నంబర్ 08 ఆఫ్ 2023) ప్రకారం, చాలా మంది లబ్ధిదారులు ఆధార్‌ను.. పుట్టిన తేదీకి రుజువుగా పరిగణిస్తున్నారు. ఆధార్ చట్టం, 2016 ప్రకారం ఆధార్ ఒక ప్రత్యేక ఐడెంటిఫైయర్ అయినప్పటికీ, పుట్టిన తేదీ రుజువుగా గుర్తించడం లేదు. ఆధార్.. గుర్తింపు ధృవీకరణను మాత్రమే అందిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా పనిచేయదని యూఐడిఏఐ స్పష్టం చేసింది.
EPFO date of birth proof Aadhaar card : యూఐడిఏఐ ఆదేశాలను అనుసరించి.. పుట్టిన తేదీని సరిదిద్దడానికి ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుంచి ఆధర్ను తొలగించింది ఈపీఎఫ్ఓ. ఆధార్ తొలగింపు గతంలో జారీ చేసిన జాయింట్ డిక్లరేషన్ ఎస్ఓపీలోని అనుబంధం-1లోని టేబుల్-బికి సంబంధించినదని, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (సీపీఎఫ్సీ) ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్లో పేర్కొంది. నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేయాలని ఇంటర్నల్ సిస్టెమ్ డివిజన్ (ఐఎస్డీ)ని ఆదేశించింది. ఈపీఎఫ్ఓ సభ్యులు, పుట్టిన తేదీ దిద్దుబాట్ల కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ మార్పు గురించి తెలుసుకోవాలని సూచించింది.
డేట్ ఆఫ్ బర్త్ రుజువు కంటే.. గుర్తింపు ధృవీకరణలోనే ఆధార్ పాత్రపై అధికంగా ఉంటుందని యూఐడిఏఐ అనేకమార్లు చెప్పింది.
చెల్లుబాటు అయ్యే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌లు..
రిజిస్ట్రార్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ జారీ చేసిన సర్టిఫికేట్లు.
EPFO Aadhaar card latest news : ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్శిటీ-స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (ఎస్ఎల్సీ)/ స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ)/ సర్వీస్ రికార్డుల ఆధారంగా పేరు, పుట్టిన తేదీతో కూడిన ఎస్ఎస్సీ సర్టిఫికేట్.
పాన్ కార్డ్
సెంట్రల్ / స్టేట్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్
ప్రభుత్వం జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం- సభ్యుడిని వైద్యపరంగా పరీక్షించిన తరువాత సివిల్ సర్జన్ జారీ చేసే మెడికల్ సర్టిఫికేట్ మరియు సభ్యుడి ప్రమాణ స్వీకారంపై అఫిడవిట్తో సమర్ధవంతమైన న్యాయస్థానం ద్వారా ధృవీకరించబడుతుంది.
దరఖాస్తుదారుడిని సివిల్ సర్జన్ పరీక్షించిన ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్. ఇందులోనే.. సంబంధిత సర్జన్ అఫిడవిట్ కూడా ఉండాలి.