తెలుగు న్యూస్  /  National International  /  Upsc Epfo Recruitment 2023: Commission Issues Notice For Applicants

UPSC EPFO Recruitment: ఈపీఎఫ్ఓ రిక్రూట్ మెంట్; మార్చి 17 లాస్ట్ డేట్

HT Telugu Desk HT Telugu

15 March 2023, 18:08 IST

    • UPSC EPFO Recruitment 2023: ఈపీఎఫ్ఓ లో 577  పోస్ట్ ల భర్తీకి గానూ యూపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ పై కీలక అప్ డేట్ వెలువడింది. ఈ రిక్రూట్ మెంట్ లో అప్లికేషన్ల సబ్మిషన్ కు మార్చి 17 ఆఖరు తేదీ అని, అయితే, చివరి నిమిషం వరకు జాప్యం చేయకుండా, ముందే అప్లై చేసుకోవాలని సూచించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Photo)

ప్రతీకాత్మక చిత్రం

UPSC EPFO Recruitment 2023: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (Employees' Provident Fund Organisation EPFO) లో 577 అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ (Asstt. Provident Fund Commissioner and Enforcement Officer-Accounts Officer) పోస్ట్ లను భర్తీ చేయడానికి యూపీఎస్సీ (Union Public Service Commission UPSC) ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 17. అయితే, ఆ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు చివరి నిమిషం వరకు ఎదురు చూడకుండా, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ ఒక ప్రకటనలో సూచించింది.

ట్రెండింగ్ వార్తలు

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

UPSC EPFO Recruitment 2023: మొత్తం 577 పోస్ట్ లు..

ఈ Asstt. Provident Fund Commissioner and Enforcement Officer-Accounts Officer పోస్ట్ లకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. అందుకు గానూ అభ్యర్థులు upsc.gov.in. వెబ్ సైట్ ను సందర్శించాలి. ముందుగా డిటైల్ నోటిఫికేషన్ ను క్షుణ్నంగా చదువుకోవాలి. మొత్తం 577 పోస్ట్ ల్లో 418 ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్ (Enforcement Officer/Accounts Officer) పోస్ట్ లు, 159 అసిస్టెంట్ ప్రావిడెండ్ ఫండ్ కమిషనర్ (Assistant Provident Fund Commissioner) పోస్ట్ లు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ముందుగా రాత పరీక్ష, ఆ తరువాత ఇంటర్వ్యూ ఉంటాయి. ఈ రెండు పోస్ట్ లకు రాత పరీక్ష వేరువేరుగా ఉంటుంది. వయో పరిమితి, విద్యార్హతలు, పరీక్ష విధానం, సిలబస్ మొదలైన వివరాలు నోటిఫికేషన్ లో వివరంగా ఉన్నాయి.