EPFO Passbook: మరోసారి ఉద్యోగులకు తిప్పలు.. ఈపీఎఫ్‍వో పాస్‍బుక్ సర్వీస్ మళ్లీ డౌన్
24 April 2023, 17:47 IST
- EPFO Passbook Service Down: ఈపీఎఫ్‍వో ఈ-పాస్‍బుక్ సర్వీస్ మళ్లీ డౌన్ అయింది. ఇలా జరగడం ఈ ఏడాది ఇది రెండోసారి.
EPFO Passbook: మరోసారి ఉద్యోగులకు తిప్పలు.. ఈపీఎఫ్‍వో పాస్‍బుక్ సర్వీస్ మళ్లీ డౌన్
EPFO e-passbook Service Down: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చందాదారులుగా ఉన్న ఉద్యోగులకు మరోసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని రోజులుగా ఈపీఎఫ్‍వో ఈ-పాస్‍బుక్ సర్వీస్ సదుపాయం అందుబాటులో లేదు. ఈపీఎఫ్‍వో వెబ్‍సైట్‍లో పాస్‍బుక్ లింక్‍లోకి వెళితే సర్వర్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ వస్తోంది. దీంతో కొన్ని రోజుల నుంచి పాస్‍బుక్‍ను ఉద్యోగులు చెక్ చేసుకోలేకపోతున్నారు. ఈపీఎఫ్‍వో ఈ-పాస్‍బుక్ సర్వీస్ ఇలా డౌన్ కావడం ఈ ఏడాది ఇది రెండోసారి.
సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు
EPFO e-passbook Service Down: ఈవీఎఫ్‍వో వెబ్‍సైట్‍లో కొన్ని రోజుల నుంచి పాస్‍బుక్‍ను చూడడం, డౌన్‍లోడ్ చేసుకోవడం లాంటి సేవలు అందుబాటులో లేవని కొందరు యూజర్లు.. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సర్వర్ నాట్ ఫౌండ్ అని వస్తోందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఉమాంగ్ యాప్‍లో కూడా ఈవీఎఫ్‍వో పాస్‍బుక్ సేవ పని చేయడం లేదని చెబుతున్నారు.
EPFO e-passbook Service Down: “డియర్ మెంబర్, అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయంపై సంబంధింత టీమ్ పని చేస్తోంది. దయచేసి కొంతసేపు వేచి ఉండండి. ఈ సమస్య త్వరలో పరిష్కారం అవుతుంది” అని ఓ యూజర్ చేసిన ఫిర్యాదుకు ట్విట్టర్లో స్పందించింది ఈపీఎఫ్‍వో.
రెండోసారి..
EPFO passbook service down: ఈ ఏడాది జనవరిలోనూ చాలా రోజుల పాటు ఈపీఎఫ్‍వో ఈ-పాస్‍బుక్ సర్వీస్ పని చేయలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు తిరిగి సేవలను ఈపీఎఫ్‍వో అందుబాటులోకి తెచ్చింది. అయితే, నాలుగు నెలలు తిరగకముందే రెండోసారి పాస్‍బుక్ సేవలు డౌన్ అయ్యాయి.
EPFO e-passbook: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (EPS)లో ఉద్యోగి, సంస్థ చేసిన లావాదేవీల పూర్తి వివరాలు ఈ-పాస్‍బుక్‍లో ఉంటాయి. నెలవారీ కాంట్రిబ్యూషన్, మొత్తం బ్యాలెన్స్ వంటివి పాస్‍బుక్‍లో చెక్ చేసుకోవచ్చు. మొత్తం అమౌంట్ మీద వడ్డీ ఎంత జమ అయిందనే విషయం కూడా పాస్‍బుక్‍లో ఉంటుంది.
కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‍పై వడ్డీ రేటును ఈపీఎఫ్‍వో 8.15 శాతంగా ప్రకటించింది. కిందటి ఏడాది 8.10 శాతం ఉండగా.. దాన్ని స్వల్పంగా పెంచింది. మార్చిలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
టాపిక్