తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ebay Lay Off: కొనసాగుతున్న లే ఆఫ్స్ పర్వం; తాజాగా ఈ కామర్స్ సంస్థ ‘ఈ బే’ లో కూడా..

eBay lay off: కొనసాగుతున్న లే ఆఫ్స్ పర్వం; తాజాగా ఈ కామర్స్ సంస్థ ‘ఈ బే’ లో కూడా..

HT Telugu Desk HT Telugu

24 January 2024, 17:20 IST

google News
  • eBay lay off: 2024 ప్రారంభం నుంచి దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగించే కార్యక్రమం చేపట్టాయి. ఇప్పటికే గూగుల్, మెటా ఈ దిశగా చర్యలు తీసుకున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS/Beck Diefenbach)

ప్రతీకాత్మక చిత్రం

eBay lay off: 2024 లో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికే కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే కూడా 1,000 ఉద్యోగాలను తొలగించబోతోంది. ఇది దాని పూర్తికాల శ్రామిక శక్తిలో 9 శాతం ఉంటుంది. ఆదాయం కన్నా ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఇ-కామర్స్ సంస్థ ‘ఈ బే’ వెల్లడించింది.

తప్పని సరి నిర్ణయం

ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ సవాళ్లతో నిండి ఉందని, ఈ పరిస్థితుల్లో వ్యయ పరిమితిపై దృష్టి పెట్టడం అవసరమని భావించామని ఈ బే తెలిపింది. "మేము మా వ్యూహానికి వ్యతిరేకంగా, మా లక్ష్యానికి దూరంగా వెళ్తున్నాం. మా మొత్తం ఉద్యోగుల సంఖ్య, ఖర్చులు మా వ్యాపారం యొక్క వృద్ధిని అధిగమించాయి. "దీనిని పరిష్కరించడానికి, ఎండ్-టు-ఎండ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారుల అవసరాలను మెరుగ్గా తీర్చడానికి మేము కొన్ని సంస్థాగత మార్పులను అమలు చేస్తున్నాము" అని ఈ బే ప్రకటించింది.

3 మిలియన్ డాలర్ల జరిమానా

అమెరికాలోని మసాచుసెట్స్ లో వేధింపులు, నిఘా ఆరోపణలపై దావా వేసిన జంటకు 3 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించడానికి ఈ-కామర్స్ దిగ్గజం ఈబే అంగీకరించిందని సిబిఎస్ న్యూస్ నివేదించింది. జనవరి 11 న యుఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ తీర్పును వెలువరించింది.

తదుపరి వ్యాసం