తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Diwali Gift To Parents : ఈ దీపావళికి అమ్మానాన్నలను ఈ స్కీమ్‌లో జాయిన్ చేసి గిఫ్ట్‌గా ఇవ్వండి

Diwali Gift To Parents : ఈ దీపావళికి అమ్మానాన్నలను ఈ స్కీమ్‌లో జాయిన్ చేసి గిఫ్ట్‌గా ఇవ్వండి

Anand Sai HT Telugu

30 October 2024, 14:00 IST

google News
    • Diwali Gift To Parents : ఆర్థిక భద్రత అన్ని వయసుల వారికి ముఖ్యమే. ఈ దీపావళికి మీ అమ్మానాన్నల కోసం పెట్టుబడి పెట్టి వారికి గిఫ్ట్‌గా ఇవ్వండి. ఏ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే మంచిదో తెలుసుకోండి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వెలుగుల పండుగ దీపావళి వచ్చింది. ఈ శుభ సమయం పెట్టుబడికి ఉత్తమ అవకాశంగా చెబుతారు. మీ ఇంట్లో అమ్మానాన్నల కోసం ప్రభుత్వ స్కీములు ఉన్నాయి. ఇవి సురక్షితమైన, హామీతో కూడిన రాబడి కోసం మీకు ఉపయోగపడతాయి. ఈ దీపావళికి అమ్మానాన్నలకు పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టి బహుమతిని ఇవ్వండి. మంచి వడ్డీని కూడా పొందుతారు. ప్రభుత్వ హామీతో వడ్డీ లభిస్తుంది. ఈ పథకం ఐదేళ్లలో మెచ్యూర్ అవుతుంది. ఈ పథకంలో కూడా పెట్టుబడిదారులకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సీఎస్ఎస్).

పోస్ట్ ఆఫీస్ ఎస్‌సీఎస్ఎస్ వివరాలు

మొత్తం పెట్టుబడి: రూ. 5 లక్షలు, వార్షిక వడ్డీ రేటు: 8.2 శాతం, మెచ్యూరిటీ కాలం: 5 సంవత్సరాలు, మెచ్యూరిటీ మొత్తం: రూ. 7,05,000, వడ్డీ ద్వారా మొత్తం సంపాదన: రూ. 2,05,000, త్రైమాసిక ఆదాయం: రూ. 10,250గా ఉంటుంది.

30 లక్షల వరకు పెట్టుబడి

ఇన్వెస్టర్లు అందుకున్న రాబడి రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే, అప్పుడు వడ్డీపై టీడీఎస్ కట్ చేస్తారు. పెట్టుబడిదారులు 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో ఒకేసారి రూ. 30 లక్షల వరకు సైతం పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో సంవత్సరానికి 8.2 శాతం వడ్డీని అందజేస్తున్నారు. కొత్త వడ్డీ రేట్లు జనవరి 1, 2024 నుండి వర్తిస్తాయి.

ఈ పొదుపు పథకంలో పెట్టుబడిదారులు స్థిర ఆదాయాన్ని పొందుతారు. వడ్డీ మొత్తం ప్రతి త్రైమాసికంలో ఖాతాకు బదిలీ అవుతుంది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును కూడా అందిస్తుంది.

ఎప్పుడైనా క్లోజ్ చేయవచ్చు

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో పెట్టుబడిదారులు పెట్టుబడి తేదీ తర్వాత ఎప్పుడైనా పథకాన్ని క్లోచ్ చేయవచ్చు. 1 సంవత్సరానికి ముందు ఎలాంటి పెనాల్టీ లేకుండా పెట్టుబడి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. 1 నుండి 2 సంవత్సరాలలోపు మొత్తాన్ని ఉపసంహరించుకున్నప్పుడు మొత్తంపై 1.5 శాతం ఛార్జ్ చేస్తారు. 2 నుండి 5 సంవత్సరాల వ్యవధిలో మొత్తంపై 1 శాతం వసూలు చేస్తారని గుర్తుంచుకోవాలి.

పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌‌పై సంవత్సరానికి 8.2 శాతం వడ్డీని అందిస్తున్నారు. ఈ రేట్లు చివరిగా జనవరి 1, 2024న మార్చారు. 31 మార్చి, 30 జూన్, 30 సెప్టెంబర్ లేదా 31 డిసెంబర్ త్రైమాసిక ప్రాతిపదికన పథకంపై వచ్చే వడ్డీ మారుతుంది. పెట్టుబడిదారుడు ఫారమ్ 15జీ/15హెచ్ నింపినట్లయితే వడ్డీ మొత్తంపై టీడీఎస్ పడదు.

తదుపరి వ్యాసం