Dell XPS 13 2-in-1। టాబ్లెట్ కమ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన డెల్, ధరెంతంటే?
29 September 2022, 14:46 IST
- డెల్ టెక్నాలజీస్ నుంచి Dell XPS 13 2-in-1 ల్యాప్‌టాప్ కమ్ టాబ్లెట్ విడుదలయింది. ఇది రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంతో చూడండి.
Dell XPS 13 2-in-1
డెల్ టెక్నాలజీస్, తాజాగా భారత మార్కెట్లో Dell XPS 13 అనే 2-in-1 టాబ్లెట్ కమ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఇది అధునాతన 12వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ల ద్వారా పనిచేస్తుంది. ఇందులోనే ఇన్-బిల్ట్ WiFi ను కలిగి ఉంది. ఈ గాడ్జెట్ మాగ్నెటిక్ కీబోర్డ్ కేస్‌తో 13-అంగుళాల అతి సన్నని వేరు చేయగలిగిన డిజైన్‌తో వచ్చింది. అందువల్ల టాబ్లెట్ నుంచి ల్యాప్‌టాప్‌కి సులభంగా మార్చుకోవచ్చు.
Dell XPS 13లో 4K వీడియో క్వాలిటీ అందించగల అధిక-రిజల్యూషన్ 11MP వెనుక కెమెరా, 1080p 5MP వెబ్‌క్యామ్‌ను అందిస్తున్నారు. ఆఫీస్ పనుల కోసం, ఇ- లర్నింగ్ కోసం లేదా సాధారణ అవసరాలకు ఉపయోగపడే ల్యాప్‌టాప్ ఇది. దీనికి స్టైలస్‌ను కూడా అందిస్తున్నారు.
Dell XPS 13 ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్ Dell.comలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 29, 2022 నుంచి నుంచి డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర, రూ. 1,39,990/- , 1TB స్టోరే వేరియంట్ ధర రూ, 1,64,990/-. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించండి.
Dell XPS 13 2-in-1 ల్యాప్‌టాప్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
13-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
16 GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
Intel Ci7-1250U 10 కోర్ ప్రాసెసర్
Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్
51Wh బ్యాటరీని ప్యాక్, 45W ఛార్జింగ్ సపోర్ట్
ఫోలియో కీబోర్డ్ & స్టైలస్
Thunderbolt 4 USB Type-C పోర్ట్
5G కనెక్టివిటీ
2022 Dell XPS 13 ల్యాప్‌టాప్ ‘ఐసేఫ్’ టెక్నాలజీని కలిగి ఉండటంతో కంటిపై భారం తక్కువగా పడుతుంది. దీని స్క్రీన్ స్లిమ్ బెజెల్‌లను కలిగి ఉంది. అలాగే బ్యాక్‌లిట్ కీబోర్డ్, డ్యూయల్ స్పీకర్‌లను ఇచ్చారు. ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ 3 టెక్నాలజీతో ఈ ల్యాప్‌టాప్ గంటలోపు 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.