తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Day Trading Guide For Today: ఈ ఆరు స్టాక్స్ తో ఈ రోజు లాభాలు ఆర్జించండి..

Day trading guide for today: ఈ ఆరు స్టాక్స్ తో ఈ రోజు లాభాలు ఆర్జించండి..

HT Telugu Desk HT Telugu

08 November 2023, 9:23 IST

google News
    • Day trading guide for today: ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, సన్ టీవీ నెట్ వర్క్, ఎన్టీపీసీ, టెక్స్మాకో ఇన్ ఫ్రా, క్రియేటివ్ కాస్టింగ్స్ లిమిటెడ్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

ప్రతీకాత్మక చిత్రం

Day trading guide for today: మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, సన్ టీవీ నెట్ వర్క్, ఎన్టీపీసీ, టెక్స్మాకో ఇన్ ఫ్రా, క్రియేటివ్ కాస్టింగ్స్ లిమిటెడ్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.

సెన్సెక్స్, నిఫ్టీ..

మూడు రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. మదుపర్లు పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. నిఫ్టీ 50 సూచీ 5 పాయింట్లు కోల్పోయి 19,406.70 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 16 పాయింట్లు కోల్పోయి 64,942.40 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ సూచీ 0.53%, స్మాల్ క్యాప్ సూచీ 0.38% లాభపడడం విశేషం.

బెంచ్‌మార్క్ నిఫ్టీ ఇటీవలి పెరుగుదల తర్వాత ప్రస్తుత స్థాయిల చుట్టూ ఏకీకృతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. US ఫెడరల్ రిజర్వ్ రేటు విరామం, మెరుగైన రేట్ అవుట్‌లుక్ తర్వాత గత మూడు సెషన్‌లలో నిఫ్టీ 50, సెన్సెక్స్ రెండూ 2 శాతం చొప్పున పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఇండెక్స్‌లో మరింత కన్సాలిడేషన్‌ను చూడవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఈ స్టాక్స్ పై దృష్టి

మార్కెట్ నిపుణులు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా, ఆనంద్ రాఠీలో సీనియర్ మేనేజర్ టెక్నికల్ రీసెర్చ్ గా ఉన్న గణేశ్ దోంగ్రె, బొనాంజా పోర్ట్ ఫోలియోలో రీసెర్చ్ అనలిస్ట్ గా ఉన్న ఆశిశ్ కాత్వా అంచనాల ప్రకారం.. ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, సన్ టీవీ నెట్ వర్క్, ఎన్టీపీసీ, టెక్స్మాకో ఇన్ ఫ్రా, క్రియేటివ్ కాస్టింగ్స్ లిమిటెడ్. ... స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.

ఐసీఐసీఐ బ్యాంక్: ప్రస్తుత ధర రూ. 948.10; టార్గెట్ ప్రైస్ రూ. 980; స్టాప్ లాస్ రూ. 930.

టాటా స్టీల్: ప్రస్తుత ధర రూ. 119; టార్గెట్ ప్రైస్ రూ. 127; స్టాప్ లాస్ రూ. 114.

సన్ టీవీ నెట్ వర్క్: ప్రస్తుత ధర రూ. 652; టార్గెట్ ప్రైస్ రూ. 675; స్టాప్ లాస్ రూ. 639

టెక్స్మాకో ఇన్ ఫ్రా: ప్రస్తుత ధర రూ. 106; టార్గెట్ ప్రైస్ రూ 139; స్టాప్ లాస్ రూ.90.

క్రియేటివ్ కాస్టింగ్స్ లిమిటెడ్ : ప్రస్తుత ధర రూ. 665; టార్గెట్ ప్రైస్ రూ 750; స్టాప్ లాస్ రూ.611

ఎన్టీపీసీ: ప్రస్తుత ధర రూ.239; టార్గెట్ ప్రైస్ రూ 248; స్టాప్ లాస్ రూ.232.

సూచన: ఇవి మార్కెట్ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.

తదుపరి వ్యాసం