Stocks to buy today : హెచ్‌సీఎల్ టెక్, గ్రాసిమ్ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ లాభాలు!
08 January 2024, 20:38 IST
- Stocks to buy today : ట్రేడర్స్ ట్రాక్ చేయాల్సిన నేటి స్టాక్స్ బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
నేటి స్టాక్స్ టు బై లిస్ట్
Stocks to buy today : తీవ్ర ఒడుదొడుకల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 59,500 లెవల్‌ను టచ్ చేసింది. నిఫ్టీ50.. 44 పాయింట్లు పెరిగి 17,648 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 40,378 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. బడ్జెట్ 2023 సమీపిస్తున్న నేపథ్యంలో ట్రేడర్లు జాగ్రత్త వహించాలి.
India Stock market news : "ఫిబ్రవరి 1న బడ్జెట్ ఉండనుంది. ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలి. బడ్జెట్ తర్వాత మార్కెట్‌కు ఒక డైరక్షన్ లభించే అవకాశం ఉంది. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్లో కీలక సపోర్ట్ వద్దకు చేరిన నిఫ్టీ.. అక్కడి నుంచి పెరిగింది. అంటే.. బుల్స్ తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ..
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ను లాభాలతో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్‌జీఎక్స్ నిఫ్టీ.. దాదాపు 55 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
Budget 2023 live updates : అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో ముగించాయి. డౌ జోన్స్ 0.7శాతం, ఎస్ అండ్ పీ 500 1.3శాతం, నాస్డాక్ 1.96శాతం మేర నష్టపోయాయి.
ఫెడ్ సమావేశం సమీపిస్తుండటం, ఆసియాలో కీలక ఆర్థిక డేటాలు వెలువడనున్న నేపథ్యంలో.. సోమవారం ట్రేడింగ్ సెషన్లో అనేక ఏషియన్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వారం రోజుల సెలవు అనంతరం తెరుచుకున్న చైనా స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరపడ్డాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు.. అమ్మకాల తీవ్రతను పెంచారు! సోమవారం ఒక్క రోజే రూ. 6,792.8కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5512.63కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
స్టాక్స్ టు బై..
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1105, టార్గెట్ రూ. 1170- రూ. 1190
Grasim share price target : గ్రాసిమ్ ఇండస్ట్రీస్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1560, టార్గెట్ రూ. 1640- రూ. 1660
ఎన్టీపీసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 159, టార్గెట్ రూ. 180
ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 688, టార్గెట్ రూ. 760
Stock to buy list : ఇండస్ టవర్స్:- బై రూ. 148, స్టాప్ లాస్ రూ. 142, టార్గెట్ రూ. 160
ఓఐఎల్ (ఆయిల్ ఇండియా లిమిటెడ్):- బై రూ. 238, స్టాప్ లాస్ రూ. 232, టార్గెట్ రూ. 245
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)