Economic Survey 2023 : 'ఎకనామిక్ సర్వే' అంటే ఏంటి? టైమ్, లైవ్ వివరాలు..
Economic Survey 2023 : మరికొన్ని గంటల్లో.. పార్లమెంట్లో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో ఎకామిక్ సర్వే అంటే ఏంటి? వంటి విషయాలను తెలుసుకుందాము.

Economic Survey 2023 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అనంతరం 2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఎకనామిక్ సర్వేను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో.. అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి? టైమ్, లైవ్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము.
ఎకనామిక్ సర్వే అంటే ఏంటి?
అభివృద్ధి అంశంలో ఏడాది కాలంలో దేశం ప్రదర్శనను వివరించేదే ఈ ఎకనామిక్ సర్వే. అంతేకాకుండా.. భవిష్యత్తు కాలంలో ఎదురుకానున్న కీలక సవాళ్లు, చిక్కులను కూడా ఈ సర్వే వివరిస్తుంది. సవాళ్లు ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా ఈ ఎకనామిక్ సర్వే వివరిస్తుంది.
Budget economic survey : బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు.. ఈ ఎకనామిక్ సర్వేను విడుదల చేస్తారు. ఆర్థిక వృద్ధి అంచనాలను ఇది చెబుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు పెరుగుతుంది? లేదా ఎందుకు నెమ్మదిస్తుంది? లేదా ఎందుకు పడుతుంది? అన్న విషయానికి గల కారణాలను ఇందులో వివరిస్తారు. ఈ సర్వే ద్వారా.. గతేడాది దేశ ప్రగతి ఎలా ఉంది? అన్న విషయంతో పాటు భవిష్యత్తులో ఎలా రాణిస్తుంది? అన్న విషయంపై అంచనా వేయొచ్చు. మనీ సప్లై, వ్యవసాయం, పరిశ్రమల ఉత్పత్తి, మౌలికవసతులు, ధరలు, ఉద్యోగం, ఎగుమతులు, దిగుమతులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలతో పాటు ఇతర ఆర్థికపరమైన అంశాలపై మరింత అవగాహన వస్తుంది.
India economic survey : ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాను ప్రతియేటా.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతారు. 1950- 51 నుంచి ఈ ఎకనామిక్ సర్వే అనేది ఆనవాయతీగా వస్తోంది. కానీ కొన్నేళ్లుగా.. ఈ ఎకనామిక్ సర్వేను రెండు భాగాలుగా ప్రవేశపెడుతున్నారు. మొదటి భాగంలో.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరిస్తారు. రెండో భాగంలో.. గతేడాదిని 'రివ్యూ' చేస్తారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోని కీలక పథకాలు, విధానాలు వాటి ఫలితాలను సైతం వివరిస్తారు.
టైమ్.. లైవ్.. వివరాలు..
Economic survey 2023 live streaming : మంగళవారం ఉదయం 11 గంటలకు.. రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు రాష్ట్రపతి. అనంతరం.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వేను ప్రవేశపెడతారు. ఈ ఎకనామిక్ సర్వేను.. సీఈఏ (చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్) ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి.. డీఈఏ (డిపార్ట్మెంట్ ఫ్ ఎకనామిక్ అఫైర్స్)కి చెందిన ఆర్థిక విభాగం తయారు చేస్తుంది. నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగిసిన అనంతరం.. మీడియా సమావేశాన్ని నిర్వహిస్తుంది సీఈఏ.
ప్రభుత్వ ఆధారిత యూట్యూబ్, ట్విట్టర్ అకౌంట్లలో ఎకనామిక్ సర్వే లైవ్ స్ట్రీమ్ అవుతుంది. సర్వేకు సంబంధించిన డాక్యుమెంట్లను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. www.indiabudget.gov.in/economicsurvey లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టిన కొద్ది గంటలకు అది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది.
సంబంధిత కథనం