తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Day Trading Guide: టైటన్, జ్యోతి ల్యాబ్.. టార్గెట్ ప్రైస్ ఎంతో తెలుసా?

Day trading guide: టైటన్, జ్యోతి ల్యాబ్.. టార్గెట్ ప్రైస్ ఎంతో తెలుసా?

HT Telugu Desk HT Telugu

09 November 2023, 9:27 IST

google News
    • Day trading guide for today: జేఎస్ డబ్ల్యూ స్టీల్, టైటన్, హీరో మోటోకార్ప్, దిలిప్ బిల్డ్ కాన్, జ్యోతి ల్యాబ్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Day trading guide for today: మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. జేఎస్ డబ్ల్యూ స్టీల్, టైటన్, హీరో మోటోకార్ప్, దిలిప్ బిల్డ్ కాన్, జ్యోతి ల్యాబ్.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.

నష్టాల్లో బ్యాంక్ నిఫ్టీ

బుధవారం ఊగిసలాటతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ గ్రీన్ జోన్ లో ముగియగా, బ్యాంక్ నిఫ్టీ మాత్రం రెడ్ జోన్ లోనే ఉండిపోయింది. నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 19,443 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 64,975 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 79 పాయింట్లు నష్టపోయి 43,658 వద్ద ముగిసింది. బ్రాడ్ మార్కెట్లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.60%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.78% వృద్ధి సాధించాయి.

కన్సాలిడేషన్ మూడ్

ప్రస్తుతం మార్కెట్ కన్సాలిడేషన్ మూడ్ లో ఉందని, నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు సాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంచ్‌మార్క్ నిఫ్టీ ఇటీవలి పెరుగుదల తర్వాత ప్రస్తుత స్థాయిల చుట్టూ ఏకీకృతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. US ఫెడరల్ రిజర్వ్ రేటు విరామం, మెరుగైన రేట్ అవుట్‌లుక్ తర్వాత గత మూడు సెషన్‌లలో నిఫ్టీ 50, సెన్సెక్స్ రెండూ 2 శాతం చొప్పున పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఇండెక్స్‌లో మరింత కన్సాలిడేషన్‌ను చూడవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఈ స్టాక్స్ పై దృష్టి

మార్కెట్ నిపుణులు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా, ఆనంద్ రాఠీలో సీనియర్ మేనేజర్ టెక్నికల్ రీసెర్చ్ గా ఉన్న గణేశ్ దోంగ్రె, బొనాంజా పోర్ట్ ఫోలియోలో రీసెర్చ్ అనలిస్ట్ గా ఉన్న విరాట్ జాగడ్ అంచనాల ప్రకారం.. జేఎస్ డబ్ల్యూ స్టీల్, టైటన్, హీరో మోటోకార్ప్, దిలిప్ బిల్డ్ కాన్, జ్యోతి ల్యాబ్. ... స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.

జేఎస్ డబ్ల్యూ స్టీల్: ప్రస్తుత ధర రూ. 756; టార్గెట్ ప్రైస్ రూ. 786; స్టాప్ లాస్ రూ. 740.

టైటన్: ప్రస్తుత ధర రూ. 3311; టార్గెట్ ప్రైస్ రూ. 3450; స్టాప్ లాస్ రూ. 3245.

హీరో మోటోకార్ప్: ప్రస్తుత ధర రూ. 3135; టార్గెట్ ప్రైస్ రూ. 3200; స్టాప్ లాస్ రూ. 3100

దిలిప్ బిల్డ్ కాన్: ప్రస్తుత ధర రూ. 356; టార్గెట్ ప్రైస్ రూ 385; స్టాప్ లాస్ రూ.343.

జ్యోతి ల్యాబ్: ప్రస్తుత ధర రూ. 411; టార్గెట్ ప్రైస్ రూ 450; స్టాప్ లాస్ రూ.400

సూచన: ఇవి మార్కెట్ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.

తదుపరి వ్యాసం