తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Day Trading Guide: కోల్ ఇండియా, సన్ టీవీ.. తదితర 5 స్టాక్స్ టార్గెట్ ప్రైస్ ఇదే..

Day trading guide: కోల్ ఇండియా, సన్ టీవీ.. తదితర 5 స్టాక్స్ టార్గెట్ ప్రైస్ ఇదే..

HT Telugu Desk HT Telugu

15 November 2023, 9:23 IST

google News
  • Day trading guide for today: ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, హిందుస్తాన్ కాపర్, సన్ టీవీ.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Day trading guide for today: మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, హిందుస్తాన్ కాపర్, సన్ టీవీ.. స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.

అమ్మకాల ఒత్తిడి

చివరి గంటల్లో అమ్మకాల ఒత్తిడి కారణంగా మంగళవారం.. ఇంట్రా డే కనిష్టంతో భారతీయ స్టాక్ మార్కెట్లు ముగిశాయి. నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 19,443 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 325 పాయింట్ల లాభంతో 64,933 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 105 పాయింట్లు లాభపడి 43,891 వద్ద ముగిసింది. బ్రాడ్ మార్కెట్లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.05% నష్టపోగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.10% వృద్ధి సాధించాయి.

నిఫ్టీ ఔట్ లుక్

"నిఫ్టీ యొక్క సమీప-కాల ట్రెండ్ సానుకూలంగా కొనసాగుతోంది. కీలకమైన ఓవర్‌హెడ్ రెసిస్టెన్స్ 19,550 నుంచి 19,600 స్థాయిల మధ్య ఉంది. అలాగే,19,300 నుంచి 19,250 స్థాయిల మధ్య సపోర్ట్ లభించవచ్చు" అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ తెలిపారు. మరోవైపు, ఈట్రేడింగ్ వారంలో, ప్రధాన ఈవెంట్‌లు లేకపోవడం, అలాగే, క్యూ2 సీజన్ ముగింపు దశకు రావడం వల్ల మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది.

ఈ స్టాక్స్ పై దృష్టి

మార్కెట్ నిపుణులు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా, ఆనంద్ రాఠీలో సీనియర్ మేనేజర్ టెక్నికల్ రీసెర్చ్ గా ఉన్న గణేశ్ దోంగ్రె, బొనాంజా పోర్ట్ ఫోలియోలో రీసెర్చ్ అనలిస్ట్ గా ఉన్న విరాట్ జాగడ్ అంచనాల ప్రకారం.. ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా, హిందుస్తాన్ కాపర్, సన్ టీవీ. ... స్టాక్స్ ఈ రోజు లాభాలను చవి చూసే అవకాశం ఉంది.

ఎం అండ్ ఎం: ప్రస్తుత ధర రూ. 1538; టార్గెట్ ప్రైస్ రూ. 1660; స్టాప్ లాస్ రూ. 1475.

ఇండస్ ఇండ్ బ్యాంక్: ప్రస్తుత ధర రూ. 1510; టార్గెట్ ప్రైస్ రూ. 1600; స్టాప్ లాస్ రూ. 1470.

కోల్ ఇండియా: ప్రస్తుత ధర రూ. 350; టార్గెట్ ప్రైస్ రూ. 360; స్టాప్ లాస్ రూ. 345

హిందుస్తాన్ కాపర్: ప్రస్తుత ధర రూ. 160; టార్గెట్ ప్రైస్ రూ 175; స్టాప్ లాస్ రూ.154.

సన్ టీ: ప్రస్తుత ధర రూ. 670; టార్గెట్ ప్రైస్ రూ 720; స్టాప్ లాస్ రూ.650

సూచన: ఇవి మార్కెట్ నిపుణుల అంచనాలు, అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.

తదుపరి వ్యాసం