తెలుగు న్యూస్  /  బిజినెస్  /  కోల్ ఇండియా క్యూ3 ఫలితాలు: రూ.9,069 కోట్లకు పెరిగిన పీఏటీ, ఒక్కో షేరుకు రూ. 5.25 మధ్యంతర డివిడెండ్

కోల్ ఇండియా క్యూ3 ఫలితాలు: రూ.9,069 కోట్లకు పెరిగిన పీఏటీ, ఒక్కో షేరుకు రూ. 5.25 మధ్యంతర డివిడెండ్

HT Telugu Desk HT Telugu

12 February 2024, 19:36 IST

  • కోల్ ఇండియా క్యూ3 ఫలితాలు: కోల్ ఇండియా మూడో త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ (పీఏటీ) రూ. 9,069 కోట్లుగా వెల్లడించింది. మధ్యంతర డివిడెండ్ రూ.5.25 ప్రకటించింది.

కోల్ ఇండియా మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల (ప్రతీకాత్మక చిత్రం)
కోల్ ఇండియా మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల (ప్రతీకాత్మక చిత్రం) (AP)

కోల్ ఇండియా మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల (ప్రతీకాత్మక చిత్రం)

కోల్ ఇండియా 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభంలో 17 శాతం వృద్ధితో రూ . 9,069 కోట్లుగా ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

MG Astor : ఇండియాలోకి ఎంజీ మోటార్​ కొత్త ఎస్​యూవీ.. ఇదే ఆస్టర్​ ఫేస్​లిఫ్ట్​?

Naga Chaitanya Porsche : రూ. 3.5 కోట్లు పెట్టి పోర్షే కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్​లో ఇదే ఫస్ట్​!

Stocks to buy today : భారీగా పతనమైన టాటా మోటార్స్​ షేర్లు ఇప్పుడు కొంటే.. భారీ ప్రాఫిట్స్​!

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

అంతేకాకుండా కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన 3 శాతం వృద్ధితో మూడో త్రైమాసికంలో రూ. 36,154 కోట్లకు చేరుకుంది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 5.25 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. ఈ డివిడెండ్ కోసం కంపెనీ ఫిబ్రవరి 20ని రికార్డు తేదీగా నిర్ణయించింది. మార్చి 12 న పంపిణీగా నిర్ణయించింది.

ఈ తాజా డివిడెండ్ ప్రకటనతో, 2024 ఆర్థిక సంవత్సరానికి క్యుములేటివ్ మధ్యంతర డివిడెండ్ ప్రతి షేరుకు రూ. 20.5 అవుతుంది. ఇది ముఖ విలువలో 205% కు సమానం. గత ఏడాది నవంబర్ లో కోల్ ఇండియా ఒక్కో షేరుకు రూ. 15.25 మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది.

సీక్వెన్షియల్ ప్రాతిపదికన నికర లాభం అంతకుముందు సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 33 శాతం పెరిగి రూ. 6,800 కోట్లకు చేరుకుంది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 10 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో ఇబిటా 31.5 శాతం మార్జిన్లతో రూ.11,350 కోట్లుగా నమోదైంది.

మూడో త్రైమాసికంలో మొత్తం వ్యయాలు రూ. 26,268 కోట్లతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. మూడో త్రైమాసికంలో పన్నుకు ముందు లాభం ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 12,375 కోట్లకు చేరింది.

మూడో త్రైమాసికంలో బొగ్గు ఉత్పత్తి 11 శాతం పెరిగి 199 మిలియన్ టన్నులకు చేరుకుంది. బొగ్గు సరఫరా కూడా 9 శాతం పెరిగి మొత్తం 191.30 మిలియన్ టన్నులకు చేరుకుంది.

ఫిబ్రవరి 13 నుంచి అమల్లోకి వచ్చేలా చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్ వో)గా ముఖేష్ అగర్వాల్ నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. అగర్వాల్ ఫిబ్రవరి 8న బొగ్గు గనుల సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) పదవిని చేపట్టారు.

2024 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి పీఏటీ, పీబీటీలు కూడా రికార్డు గరిష్టాలకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది.

తదుపరి వ్యాసం