తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Paytm: మార్చి 15 తర్వాత పేటీఎం వాలెట్ లో క్యాష్ బ్యాక్స్, రీఫండ్స్ పొందవచ్చా?

Paytm: మార్చి 15 తర్వాత పేటీఎం వాలెట్ లో క్యాష్ బ్యాక్స్, రీఫండ్స్ పొందవచ్చా?

HT Telugu Desk HT Telugu

20 February 2024, 13:57 IST

  • Paytm wallet: పేటీఎం సంక్షోభం నేపథ్యంలో పేటీఎం వినియోగదారుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది మార్చి 15 తర్వాత పేటీఎం వాలెట్ లో క్యాష్ బ్యాక్స్, రీఫండ్స్ పొందవచ్చా? అన్న ప్రశ్న.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Reuters)

ప్రతీకాత్మక చిత్రం

Paytm wallet: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షల అమలు గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 29 నుంచి మార్చి 15 వరకు పొడిగించింది. మార్చి 15 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తో అనుసంధానమై ఉన్న వాలెట్లు లేదా ఖాతాలలోకి డిపాజిట్లు, టాప్-అప్ లు లేదా క్రెడిట్ లావాదేవీలు సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఆర్బీఐ తన ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

ఆర్బీఐ స్టేట్మెంట్

‘‘మార్చి 15, 2024 తర్వాత ఏ పేటీఎం కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు మొదలైన వాటిలో ఎటువంటి డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్ లను అనుమతించకూడదు. అయితేే, వడ్డీ మినహా, క్యాష్ బ్యాక్ లను, భాగస్వామ్య బ్యాంకుల నుంచి స్వీప్ ఇన్ లేదా రీఫండ్స్ ను ఎప్పుడైనా పొందవచ్చు’’ అని ఆర్బీఐ తెలిపింది.

మార్చి 15 తర్వాత క్యాష్ బ్యాక్, రీఫండ్స్ పొందవచ్చా?

మార్చి 15 తర్వాత రీఫండ్స్, క్యాష్ బ్యాక్ లు జమ చేసుకోవచ్చు. దీని అర్థం అప్పటికే మీ ఖాతాలో ఉన్న డబ్బు నుండి మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవడం, మీ నగదును ఉపసంహరించుకోవడం లేదా బదిలీ చేయడం కొనసాగించవచ్చు. అయితే, మార్చి 15 తర్వాత మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా టాప్-అప్ చేసుకోలేరు. అలాగే, వాలెట్లోకి డబ్బును బదిలీ చేయలేరు. మీ పేటీఎం వాలెట్ లోకి క్యాష్ బ్యాక్ లు లేదా రీఫండ్ లు మినహా మరే ఇతర క్రెడిట్ లను పొందలేరు.

అనుమతించబడని క్రెడిట్లు ఏమిటి?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో ఆధార్ తో లింక్ చేయబడిన వేతనం, సబ్సిడీ లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్స్ క్రెడిట్ కావు. పేటీఎం వినియోగదారులు మార్చి 15 తర్వాత అటువంటి క్రెడిట్లను మీ ఖాతాలోకి పొందలేరు.

పేటీఎం వాలెట్ క్లోజ్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చా?

పేటీఎం వాలెట్ ను క్లోజ్ చేసి, అందులోని డబ్బులను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ యాప్ ద్వారా మరో బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం