తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsnl New Broadband Plan: బడ్జెట్ రేంజ్‍లో కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ : పూర్తి వివరాలివే

BSNL New Broadband Plan: బడ్జెట్ రేంజ్‍లో కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ : పూర్తి వివరాలివే

HT Telugu Desk HT Telugu

08 November 2022, 18:09 IST

google News
    • BSNL New Broadband Plan: బడ్జెట్ ధరలో కొత్త బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍ను లాంచ్ చేసింది బీఎస్ఎన్ఎల్. 3,300జీబీ డేటా దక్కేలా దీన్ని తీసుకొచ్చింది.
bsnl fiber plan: బీఎస్ఎన్ఎల్ నుంచి ఫైబర్ ప్లాన్ ఆఫర్
bsnl fiber plan: బీఎస్ఎన్ఎల్ నుంచి ఫైబర్ ప్లాన్ ఆఫర్

bsnl fiber plan: బీఎస్ఎన్ఎల్ నుంచి ఫైబర్ ప్లాన్ ఆఫర్

BSNL New Broadband Plan: బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍ల విషయంలోనూ ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ దూకుడుగా ముందుకు సాగుతోంది. ప్రత్యేక ఆఫర్లు, కొత్త ప్లాన్‍లతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా తక్కువ ధర ప్లాన్‍లతోనే ఎక్కువ ఎఫ్‍యూపీ డేటాను ఇస్తోంది. ఈ క్రమంలోనే బడ్జెట్ రేంజ్‍లో మరో భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍ను బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసింది. రూ. 499 భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍ను కొత్తగా తీసుకొచ్చింది. అయితే రూ. 449 ప్లాన్‍కు ఉన్న ఫైబర్ బేసిక్ పేరును ఈ కొత్త రూ. 499కు పెట్టింది. రూ. 449 ప్లాన్ పేరును ఫైబర్ బేసిక్ నియోగా మార్చి.. అవే ప్రయోజనాలను కొనసాగించింది. నూతనంగా బీఎస్‍ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.499 ప్లాన్‍తో ఏ బెనిఫిట్స్ లభిస్తాయో ఓ లుక్కేయండి.

BSNL 499 Bharat Fibre Basic Broadband Plan: బీఎస్ఎన్ఎల్ రూ. 499 బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్

గతంలోనూ రూ. 499 ధరతో ఓ బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍ను కొంతకాలం అందుబాటులో ఉంచింది బీఎస్ఎన్ఎల్. ఆ తర్వాత నిలిపివేసింది. అయితే ఈసారి విభిన్నమైన బెనిఫిట్స్ తో రూ. 499 ప్లాన్‍ను కొత్తగా లాంచ్ చేసింది. ఈ ప్లాన్‍ను తీసుకుంటే 40 ఎంబీపీఎస్ వేగంతో 3,300జీబీ (3.3TB) డేటా లభిస్తుంది. నెల వ్యాలిడిటీ. అన్‍లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్రయోజనం కూడా దక్కుతుంది. నెలలో 3,300జీబీ డేటా అయిపోతే.. 4 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

BSNL 449 Bharat Fibre Basic Neo Broadband Plan: బీఎస్ఎన్ఎల్ రూ.449 బేసిక్ నియో బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్

బేసిక్‍గా ఉండే రూ. 449 బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్ పేరును బేసిక్ నియోగా మార్చింది బీఎస్ఎన్ఎల్. ఈ బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍ను ఎంపిక చేసుకుంటే 30ఎంబీపీఎస్ వేగంతో 3,300జీబీ డేటా పొందవచ్చు. నెలలో ఆ డేటా అయిపోతే 4ఎంబీపీఎస్ వేగంతో డేటా వాడుకోవచ్చు. అన్‍లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం కూడా దక్కుతుంది. కొత్త కస్టమర్లు తొలి నెల రెంట్‍పై 90శాతం డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది.

ఈ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 275 బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍లు ఈనెల 15వ తేదీ వరకే ఉండనున్నాయి. ఆ తర్వాత వీటని తొలగించనుంది బీఎస్ఎన్ఎల్. రూ. 275 ప్లాన్‍ను తీసుకుంటే 75 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 3,300 జీబీ డేటా పొందొచ్చు. రూ. 775 బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్ కూడా 15వ తేదీ వరకే అందుబాటులో ఉండనుంది.

టాపిక్

తదుపరి వ్యాసం