BSNL Broadband Plans: రూ. 275కే 3,300 జీబీ.. కొన్ని రోజులే అవకాశం-bsnl bharat fiber rs 275 special freedom broadband plans to end on november 15 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bsnl Broadband Plans: రూ. 275కే 3,300 జీబీ.. కొన్ని రోజులే అవకాశం

BSNL Broadband Plans: రూ. 275కే 3,300 జీబీ.. కొన్ని రోజులే అవకాశం

HT Telugu Desk HT Telugu
Nov 06, 2022 11:28 AM IST

BSNL Bharat Fiber Broadband Plan: భారత్ ఫైబర్ రూ.275 బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్స్ మరికొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. వీటితో 75 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.

bsnl fiber plan: బీఎస్ఎన్ఎల్ నుంచి ఫైబర్ ప్లాన్ ఆఫర్
bsnl fiber plan: బీఎస్ఎన్ఎల్ నుంచి ఫైబర్ ప్లాన్ ఆఫర్

BSNL Bharat Fiber 275 Broadband Plan : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) పరిధిలోని భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ నుంచి ప్రస్తుతం ఓ అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. బ్రాడ్‍బ్యాండ్‍లో ప్రస్తుతం అతితక్కువ ధరతో మంచి బెనిఫిట్స్ కలిగి ఉన్న రెండు ప్లాన్స్ ఇవి. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూ.275 ధరతో రెండు భారత్ ఫైబర్ ప్లాన్‍లను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. రూ.275 ధరతో 75 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. పరిమిత కాల ఆఫర్ గా బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్స్ లాంచ్ చేసింది. ముందుగా అక్టోబర్ 13వ తేదీ వరకే ఈ ఆఫర్ ఉంటుందని ప్రకటించగా.. ఆ తర్వాత గడువును పొడిగించింది. నవంబర్ 15వ తేదీ వరకు ఈ ఆఫర్ ప్లాన్‍లను అందుబాటులో ఉంచనుంది. ఈ రూ.275 బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ఫైబర్ బ్రాండ్‍బ్యాండ్ ప్లాన్‍ల వివరాలు ఇవే.

BSNL Bharat Fiber 275 Broadband Plans: తుది గడువు ఆరోజే..

ఫ్రీడమ్ 75 ఫైబర్ బేసిక్ పేరుతో ఈ రూ.275 భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్‍లను బీఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. ఈనెల 15వ తేదీ వరకు ఇవి లభిస్తాయి. ఈ చీపెస్ట్ ప్లాన్స్ కావాలంటే ఆరోజులోగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్ ఫైబర్ వాడుతున్న వారితో పాటు కొత్త కస్టమర్లు కూాడా ఈ ఫ్రీడమ్ ప్లాన్‍లను తీసుకోవచ్చు.

BSNL Bharat Fiber 275 Broadband Plans: రూ.275 భారత్ ఫైబర్ బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్స్ బెనిఫిట్స్

బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రూ.275 ప్లాన్‍లను ఎంపిక చేసుకుంటే 75 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. 3,300జీబీ (3టీబీ) డేటా దక్కుతుంది. ఇదే ధరతో రెండు ప్లాన్‍లు ఉన్నాయి. రెండింటితో ఈ ప్రయోజనాలు వస్తాయి. అయితే ఓ ప్లాన్‍తో 30ఎంబీపీఎస్, మరో ప్లాన్‍తో 60ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటుంది. ఇదొక్కటే తేడా. ఇక 3,300జీబీ డేటా అయిపోతే 4 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు.

మరోవైపు భారత్ ఫైబర్ రూ.775 బ్రాడ్‍బ్యాండ్ ప్లాన్ కూడా ఈనెల 15వ తేదీ వరకే అందుబాటులో ఉండనుంది. ఈ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకున్నా 75 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అయితే 150 ఎంబీపీఎస్ వేగంతో 2000 జీబీ డేటా దక్కుతుంది. ఈ డేటా అయిపోయాక 10 ఎంబీపీఎస్ స్పీడ్‍తో ఇంటర్నెట్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

Whats_app_banner