Bank Holidays in June : జూన్‌లో బ్యాంక్‌లకు ఎన్ని రోజుల పాటు సెలవులంటే..
27 May 2024, 11:10 IST
Hyerabad bank holidays : జూన్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల లిస్ట్ బయటకు వచ్చింది. వచ్చే నెలలో బ్యాంక్ హాలిడే పూర్తి లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకుని, దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి..
జూన్‌లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
June 2024 bank holidays : జూన్ 2024లో వివిధ మతపరమైన సెలవులు, ప్రాంతీయ వేడుకలు, వీకెండ్ హాలీడే కారణంగా బ్యాంక్‌లకు కనీసం 12 షెడ్యూల్డ్ సెలవులు లభిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సహా భారతదేశంలోని అన్ని జాతీయ, ప్రైవేట్ బ్యాంకులకు వారి ప్రాంతీయ పండుగలను బట్టి జూన్ 2024 లో కనీసం 12 రోజులు సెలవులు ఉన్నాయి. ఇందులో నెలలో రెండు నాల్గొవ శనివారాలు, అన్ని ఆదివారాలు కూడా ఉన్నాయి.
ప్రాంతీయ వేడుకలు, పండుగల కారణంగా బ్యాంక్ సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. ఈ మేరకు సంబంధిత బ్యాంక్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మీకు బాగా ప్లాన్ చేయడానికి, చివరి నిమిషంలో గందరగోళం, అత్యవసర పరిస్థితులను నివారించడానికి సహాయపడుతుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు.. సంవత్సరానికి బ్యాంకుల హాలిడే క్యాలెండర్‌ను నిర్ణయిస్తాయి. అందువల్ల, రాష్ట్రాల్లోని స్థానిక ఆచారాల కారణంగా షెడ్యూల్స్ మారవచ్చు.
జూన్ 2024లో బ్యాంక్ సెలవుల వివరాలు..
Bank Holidays in June 2024 : జూన్ 9 న బ్యాంక్ సెలవు: హిమాచల్ ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల్లో మహారాణా ప్రతాప్ జయంతి కారణంగా సెలవు.
జూన్ 10న బ్యాంకులకు సెలవు: పంజాబ్‌లో శ్రీ గురు అర్జున్ దేవ్ జీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సెలవు.
జూన్ 14న బ్యాంకులకు సెలవు: పహిలీ రాజా కోసం ఈ రోజు ఒడిశాలో బ్యాంకులు మూసివేయబడతాయి.
జూన్ 15 న బ్యాంక్ సెలవు: ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో బ్యాంకులు వైఎంఏ డే కోసం మూసివేసి ఉంటాయి. రాజా సంక్రాంతికి ఒడిషాలో బ్యాంకులు మూసివేయబడతాయి.
జూన్ 17 న బ్యాంక్ సెలవు: బక్రీద్ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు మినహా భారతదేశం అంతటా బ్యాంకులకు సెలవు.
జూన్ 21న బ్యాంకులకు సెలవు: వట్ సావిత్రి వ్రతం సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు సెలవు.
వీకెండ్ బ్యాంక్ హాలిడేస్ లిస్ట్..
June Bank holidays list : జూన్ 8న భారతదేశం అంతటా రెండవ శనివారం బ్యాంకులకు సెలవు.
జూన్ 22 న భారతదేశం అంతటా నాల్గవ శనివారం బ్యాంకులు మూసివేయబడతాయి.
జూన్ 2, 9, 16, 23, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆదివారం బ్యాంకులకు సెలవులు.
ఇవి పనిచేస్తాయి..
ఖాతాదారుల సౌలభ్యం కోసం బ్యాంకు సెలవులు, వారాంతాలతో సంబంధం లేకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు నిరాటంకంగా కొనసాగుతాయి. అత్యవసర లావాదేవీల కోసం బ్యాంకుల వెబ్సైట్లు, మొబైల్ యాప్‌లు, ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చు. అయితే, మీకు బ్యాంకు సిబ్బంది నుంచి సహాయం అవసరమైతే, బ్యాంక్ హాలిడే షెడ్యూల్ గురించి తెలుసుకోవడం దాని ప్రకారం ప్లాన్ చేయడం చాలా ముఖ్యం.
Telangana Bank holidays in June : జాతీయ / రాష్ట్ర సెలవులు, సాంస్కృతిక లేదా మతపరమైన ఆచారాలు, కార్యాచరణ అవసరాలు, ప్రభుత్వ ప్రకటనలు, ఇతర బ్యాంకులతో సమన్వయంతో సహా వివిధ అంశాల ఆధారంగా సెంట్రల్ బ్యాంక్ సంవత్సరానికి పూర్తి బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ ఈ సమాచారాన్ని తన వెబ్సైట్, నోటిఫికేషన్ల వంటి అధికారిక మార్గాల ద్వారా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు తెలియజేస్తుంది.