తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bajaj Housing Finance Ipo : బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ ఐపీఓ మీకు అలాట్​ అయ్యిందా? ఇలా చెక్​ చేసుకోండి..

Bajaj Housing Finance IPO : బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ ఐపీఓ మీకు అలాట్​ అయ్యిందా? ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu

13 September 2024, 12:10 IST

google News
    • Bajaj Housing Finance IPO allotment status : బజాజ్ హౌసింగ్​​ ఫైనాన్స్​ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ విడుదలైంది. ఎలా చెక్​ చేసుకోవాలి? నేటి జీఎంపీ ఎంత? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ ఐపీఓ..
బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ ఐపీఓ..

బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​ ఐపీఓ..

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ లైవ్​ అయ్యింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓ కోసం దరఖాస్తు చేసుకున్న ఇన్వెస్టర్లు రిజిస్ట్రార్ పోర్టల్ అయిన కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్​లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ని చెక్​ చేసుకోవచ్చు. మరి మీకు ఈ ఐపీఓ అలాట్​ అయ్యిందా? ఇక్కడ తెలుసుకోండి..

బజాజ్​ హౌసింగ్​ ఫైనాన్స్​కి విపరీతమైన డిమాండ్​..

ఈ నాన్ డిపాజిట్ టేకింగ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ సెప్టెంబర్ 9 సోమవారం సబ్​స్క్రిప్షన్ కోసం ప్రారంభమై సెప్టెంబర్ 11 బుధవారం ముగిసిన విషయం తెలిసిందే. చివరి బిడ్డింగ్ రోజు ముగిసే సమయానికి ఈ ఇష్యూకు నాన్ ఇన్​స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ఐఐలు) (41.51 రెట్లు), క్వాలిఫైడ్ ఇన్​స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీలు) (209.36 రెట్లు), రిటైల్ ఇన్వెస్టర్ల (7.04 రెట్లు) నుంచి మంచి స్పందన లభించింది. ఎంప్లాయీ కోటా 2.05 రెట్లు సబ్​స్క్రిప్షన్​ని చూసింది. షేర్ హోల్డర్ కేటగిరీ 17.53 రెట్లు అధికంగా సబ్​స్క్రైబ్ అయ్యింది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ సబ్​స్క్రిప్షన్ స్టేటస్ మూడో రోజు 63.61 రెట్లు పెరిగింది.

ఐపీఓ కేటాయింపు స్థితిని తనిఖీ చేసేటప్పుడు, అందుబాటులో ఉన్న షేర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. షేర్లు పొందడంలో దరఖాస్తుదారులు విఫలమైతే, కంపెనీ రీఫండ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. కేటాయించిన షేర్లను వ్యక్తి డీమ్యాట్ ఖాతాలో జమ చేస్తారు.

షేర్లను కేటాయించని వ్యక్తులకు, రీఫండ్ ప్రక్రియ సెప్టెంబర్ 13, శుక్రవారం ప్రారంభమవుతుంది. కేటాయించిన వ్యక్తులకు అదే రోజు వారి డీమ్యాట్ ఖాతాల్లో జమ అవుతాయి.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ లిస్టింగ్ తేదీ సెప్టెంబర్ 16 సోమవారం జరగనుంది.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి..

మీరు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ కోసం దరఖాస్తు చేసినట్లయితే, మీరు ఈ రోజు ఐపీఓ రిజిస్ట్రార్, కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ వెబ్​సైట్స్​లో అలాట్​మెంట్​ స్టేటస్​ని చెక్​ చేసుకోవచ్చు.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ కేటాయింపు లింక్ - https://ris.kfintech.com/ipostatus/

స్టెప్ 1:

మీరు పైన పేర్కొన్న లింక్​ని క్లిక్ చేసినప్పుడు, మీరు ఐదు లింక్​లలో ఒకదాన్ని ఉపయోగించి స్టేటస్ చెక్ చేయవచ్చు.

స్టెప్ 2:

అందుబాటులో ఉన్న ఐదు యూఆర్ఎల్స్​లో ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత, "సెలెక్ట్ ఐపీఓ" డ్రాప్-డౌన్ ఆప్షన్ నుంచి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపిఓను ఎంచుకోండి.

స్టెప్ 3:

స్టేటస్ చూడటానికి మీ పాన్, డీమ్యాట్ ఖాతా నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేయండి.

స్టెప్ 4:

మీరు ఈ ఆప్షన్​ని ఎంచుకుంటే, ముందుగా అప్లికేషన్ నంబర్​ని ఎంటర్​ చేయండి. తరువాత క్యాప్చా కోడ్​ ఎంటర్​ చేయండి. "సబ్మిట్" మీద క్లిక్ చేయండి.

- మీరు డీమ్యాట్ ఖాతాను ఎంచుకుంటే, ఖాతా సమాచారం, క్యాప్చా కోడ్​ని నమోదు చేయండి. "సబ్మిట్" మీద క్లిక్ చేయండి.

-మూడో ఆప్షన్ పాన్ యాక్సెస్ చేయడానికి పాన్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. "సబ్మిట్" మీద క్లిక్ చేయండి.

బీఎస్​ఈలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1

బిఎస్​ఈ అధికారిక వెబ్​సైట్​లోని అలాట్​మెంట్​ పేజీని సందర్శించండి- https://www.bseindia.com/investors/appli_check.aspx

స్టెప్​ 2

'ఇష్యూ టైప్' కింద 'ఈక్విటీ' ఎంచుకోండి.

స్టెప్ 3

'ఇష్యూ నేమ్' (డ్రాప్ డౌన్ మెనూ) సెలెక్ట్ చేసి ఐపీఓను సెలెక్ట్ చేయాలి.

స్టెప్ 4

మీ అప్లికేషన్ నంబర్ లేదా పాన్ ఎంటర్ చేయండి.

 

ఎన్ఎస్ఈలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్ 1

ఎన్ఎస్ఈ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి- https://www1.nseindia.com/products/dynaContent/equities/ipos/ipo_login.jsp

స్టెప్ 2

ఎన్ఎస్ఈ వెబ్​సైట్​లో 'సైన్ అప్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి' ఆప్షనపై క్లిక్ చేయడం ద్వారా పాన్​తో రిజిస్టర్ చేసుకోవాలి.

స్టెప్ 3

మీ పాస్వర్డ్, యూజర్ నేమ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.

స్టెప్ 4

ఓపెన్ అయ్యే తర్వాతి పేజీలో మీ ఐపీఓ కేటాయింపు స్టేటస్ చెక్ చేసుకోండి.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ జీఎంపీ.. 

నేడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ జీఎంపీ (గ్రే మార్కెట్​ ప్రీమియం) +77గా ఉంది. అంటే గ్రే మార్కెట్​లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు ధర రూ.77 ప్రీమియం వద్ద ట్రేడవుతోందని investorgain.comలో ఉంది.

బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ షేరు ధర అంచనా లిస్టింగ్ ధర రూ .147 వద్ద అవ్వొచని ఇది సూచిస్తోంది. ఇది 110శాతం అధికం!

(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

తదుపరి వ్యాసం