తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Audi Price Hike: కార్ల ధరను పెంచనున్న ఆడి.. కొత్త రేట్లు ఎప్పటి నుంచంటే!

Audi Price Hike: కార్ల ధరను పెంచనున్న ఆడి.. కొత్త రేట్లు ఎప్పటి నుంచంటే!

12 April 2023, 10:56 IST

google News
    • Audi Cars Price Hike: ఆడి కార్ల ధరలు మళ్లీ పెరగనున్నాయి. ఈసారి 1.6 శాతం వరకు రేట్లు అధికం కానున్నాయి.
Audi Price Hike: కార్ల ధరను పెంచనున్న ఆడి.. కొత్త రేట్లు ఎప్పటి నుంచంటే!
Audi Price Hike: కార్ల ధరను పెంచనున్న ఆడి.. కొత్త రేట్లు ఎప్పటి నుంచంటే! (HT_Auto)

Audi Price Hike: కార్ల ధరను పెంచనున్న ఆడి.. కొత్త రేట్లు ఎప్పటి నుంచంటే!

Audi Cars Price Hike: లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి కూడా ధరల పెంపుపై ప్రకటన చేసింది. కార్లపై 1.6 శాతం వరకు ధరలను అధికం చేయనున్నట్టు ఆడి ఇండియా (Audi India) వెల్లడించింది. మే 1వ తేదీ నుంచి కొత్త ధరలు వర్తిస్తాయని ఆ జర్మనీ ఆటోమేకర్ తెలిపింది. ఆడి క్యూ3 (Audi Q3), ఆడి క్యూ3 స్పోర్ట్ బ్యాక్ (Audi Q3 Sportsback) కార్లపై 1.6 శాతం ధరను ఆ సంస్థ పెంచనుంది. క్యూ8 సెలబ్రేషన్ (Audi Q8 Celebration), ఆర్ఎస్5 (Audi RS5), ఎస్5 (Audi S5) కార్లపై ఆడి ఇప్పటికే ధరలను పెంచింది. ఇప్పుడు మరిన్ని మోడళ్లపై రేట్లు అధికం చేయనుంది. కొత్త రేట్లు ఎలా ఉంటాయంటే..

కొత్త ధరలు ఇవే..

Audi Cars Price Hike: కస్టమ్ డ్యూటీ, ఉత్పత్తి ఖర్చులు పెరగటంతో కార్లపై ధరలు పెంచుతున్నట్టు ఆడి ఇండియా పేర్కొంది. పరిస్థితుల వల్ల కస్టమర్లపై కాస్త అదనపు భారం వేయకతప్పడం లేదని ప్రకటించింది. ప్రస్తుతం ఆడి క్యూ3 ఎస్‍యూవీ ధర రూ.44.89లక్షలుగా ఉండగా.. పెంపు తర్వాత మే నుంచి రూ.45.60లక్షలకు చేరనుంది. ఆడి ఆర్ఎస్5 ప్రస్తుత ధర రూ.1.12 కోట్లుగా ఉండగా.. రూ.1.15కోట్ల వరకు చేరనుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. కొత్త రేట్లు మే 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

Audi Cars Price Hike: “మా కస్టమర్లకు మేం ఎప్పుడూ అత్యుత్తమం ఇవ్వాలనుకుంటాం. కానీ కస్టమ్ డ్యూటీ, ఉత్పత్తి ఖర్చులు పెరగటంతో ధరలు సవరించక తప్పడం లేదు. వివిధ దశల్లో ఈ భారాన్ని మోయాలని భావించినా.. ప్రస్తుత పరిస్థితుల వల్ల ధరలు పెంచడం అనివార్యమైంది” అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ చెప్పారు. కాగా, ఇటీవలే కొన్ని కార్ల ధరలు పెంచిన ఆడి.. ఇప్పుడు మరోసారి అధికం చేసింది.

కాగా, మర్సెడెస్ బెంజ్ కూడా ఇటీవల కార్ల ధరలను అధికంగా చేసింది. సుమారు 3.5 శాతం వరకు రేట్లు పెరిగాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఈ కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. రవాణా ఖర్చులు, మెటీరియల్, ఉత్పత్తి ఖర్చులు పెరగటంతో ధరలను పెంచినట్టు ఆ సంస్థ కూడా చెప్పింది.

మారుతీ సుజుకీ (Maruti Suzuki) కూడా పాపులర్ కార్లపై ధరలను అధికం చేసింది. మారుతీ సుజుకీ డిజైర్, మారుతీ సుజుకీ వాగన్‍ఆర్, మారుతీ సుజుకీ స్విఫ్ట్ సహా మొత్తంగా 6 కార్లపై రేట్లు పెంచింది. కొత్త ధరలు ఇప్పటికే వర్తిస్తున్నాయి. టాటా మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్‍తో పాటు చాలా కంపెనీలు రేట్లు పెంచాయి.

తదుపరి వ్యాసం