తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Amara Raja Batteries Results: భారీగా పెరిగిన ‘అమరరాజా’ లాభాలు; డివిడెండ్ ఎంతంటే..?

Amara Raja Batteries results: భారీగా పెరిగిన ‘అమరరాజా’ లాభాలు; డివిడెండ్ ఎంతంటే..?

HT Telugu Desk HT Telugu

23 May 2023, 22:18 IST

google News
    • Amara Raja Batteries results: 2022 -23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY23) లో అమర రాజా బ్యాటరీస్ (Amara Raja Batteries) నికర ఆదాయం గణనీయంగా పెరిగింది. Q4FY23 లో సంస్థ రూ. 2,429.4 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amara Raja Batteries results: 2022 -23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (FY23) లో అమరరాజా బ్యాటరీస్ (Amara Raja Batteries) నికర లాభాలు 41% పెరిగాయి. Q4FY23 లో అమరరాజా బ్యాటరీస్ (Amara Raja Batteries) 139.4 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అయితే, Q4FY23 లో అమరరాజా బ్యాటరీస్ (Amara Raja Batteries) కనీసం రూ. 177 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది.

Amara Raja Batteries results: 11.4% వృద్ధి

అమర రాజా బ్యాటరీస్ ఇండస్ట్రియల్, ఆటోమోటివ్, టెలికాం, సోలార్, రైల్వేస్, డిఫెన్స్ తదితర రంగాలకు బ్యాటరీలను అందిస్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రియల్, ఆటోమోటివ్ రంగాల్లో మంచి పురోగతి సాధిస్తోంది. 2022 -23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY23) లో అమర రాజా బ్యాటరీస్ (Amara Raja Batteries) నికర ఆదాయం గణనీయంగా పెరిగింది. Q4FY23 లో సంస్థ రూ. 2,429.4 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. Q4FY22 లో అమర రాజా బ్యాటరీస్ (Amara Raja Batteries) నికర ఆదాయం రూ. 2,180.9 కోట్లు. అంటే, Q4FY22 తో పోలిస్తే, Q4FY23 లో సంస్థ ఆదాయం 11.4% పెరిగింది.

Amara Raja Batteries results: డివిడెండ్

Q4FY23 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు ఫైనల్ డివిడెండ్ ను కూడా అమర రాజా బ్యాటరీస్ (Amara Raja Batteries) ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 3.20 లను డివిడెండ్ (Dividend) గా అందించనున్నట్లు వెల్లడించింది. కాగా, మొత్తం FY23 లో సంస్థ నికర లాభాలు రూ. 694.5 కోట్లు. FY22 లో సంస్థ ఆర్జించిన నికర లాభాలైన రూ. 512.6 తో పోలిస్తే FY23 నికర లాభాల్లో 35.5% వృద్ధిని సంస్థ సాధించింది. మంగళవారం ఎన్ఎస్ఈ లో అమరరాజా బ్యాటరీస్ షేర్ విలువ రూ. 634.5 వద్ద ముగిసింది.

తదుపరి వ్యాసం