తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Volkswagen Electric Suv : వోక్స్​వ్యాగన్​ నుంచి సరికొత్త ఎంట్రీ లెవల్​ ఎస్​యూవీ..!

Volkswagen Electric SUV : వోక్స్​వ్యాగన్​ నుంచి సరికొత్త ఎంట్రీ లెవల్​ ఎస్​యూవీ..!

Sharath Chitturi HT Telugu

16 December 2023, 13:40 IST

google News
    • Volkswagen Electric SUV : వోక్స్​వ్యాగన్​ సంస్థ నుంచి కొత్త ఎంట్రీ లెవల్​ ఈవీ సిద్ధమవుతోంది. ఈ మోడల్​ రేంజ్​, లాంచ్​ టైమ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
వోక్స్​వ్యాగన్​ నుంచి సరికొత్త ఎంట్రీ లెవల్​ ఎస్​యూవీ..!
వోక్స్​వ్యాగన్​ నుంచి సరికొత్త ఎంట్రీ లెవల్​ ఎస్​యూవీ..! (REUTERS)

వోక్స్​వ్యాగన్​ నుంచి సరికొత్త ఎంట్రీ లెవల్​ ఎస్​యూవీ..!

Volkswagen Electric SUV : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ వోక్స్​వ్యాగన్​ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ రాబోతోంది. ఇది.. ఎంట్రీ లెవల్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరలను ఇక్కడ తెలుసుకుందము..

వోక్స్​వ్యాగన్​ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​..

వోక్స్​వ్యాగన్​ ఎంట్రీ లెవల్​ ఈవీకి చెందిన ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. చూస్తుంటే.. ఈ మోడల్​ ప్రొడక్షన్​కి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎంఈబీ ఎంట్రీ ప్లాట్​ఫామ్​పై సంస్థ దీనిని రూపొందిస్తోంది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ పేరును సంస్థ ఇంకా రివీల్​ చేయలేదు.

Volkswagen new electric SUV : ఈ ఎస్​యూవీ డిజైన్​ బోల్డ్​గా ఉంటుందని తెలుస్తోంది. సేఫ్టీ, బోల్డ్​నెస్​, సింప్లిసిటీని దృష్టిలో పెట్టుకుని తమ ఈవీలను రూపొందిస్తున్నట్టు వోక్స్​వ్యాగన్​ డిజైన్​ హెడ్​ ఆండ్రెస్​ మిండ్ట్​ ఇటీవలే తెలిపారు.

ఇక కొత్త ఎంట్రీ లెవల్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​ పొడవు 4,100ఎంఎం. వీల్​ బేస్​ 2,600ఎంఎంగా ఉండొచ్చు. 490 లీటర్స్​ బూట్​ స్పేస్​ ఇందులో ఉంటుందట.

ఇక ఇంటీరియర్​ విషయానికొస్తే.. ఈ ఎస్​యూవీలో 12.9 ఇంచ్​ భారీ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 10.9 ఇంచ్​ డిజిటల్​ డ్రైవర్​ డిస్​ప్లే ఉంటుందని సమాచారం. క్లైమేట్​, ఆడియో కంట్రోల్స్​ కోసం ఫిజికల్స్​ వస్తాయని తెలుస్తోంది.

కొత్త ఎలక్ట్రిక్​ కారు లాంచ్​ ఎప్పుడు? రేంజ్​ ఎంత?

Volkswagen new Electric vehicle : వోక్స్​వ్యాగన్​ కొత్త ఈవీలో సింగిల్​ మోటర్​ ఉంటుంది. ఇది 223 హెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలో 38 కేడబ్ల్యూహెచ్​, 56 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​ ఉంటాయని నివేదికలు సూచిస్తున్నాయి. పెద్ద బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. వెహికిల్​తో 450కి.మీల దూరం ప్రయాణించవచ్చని సమాచారం. అంతేకాకుండా.. 125 కేడ్ల్యూ ఛార్జిర్​తో 10-80శాతం ఛార్జింగ్​ని కేవలం 20 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు.

వోక్స్​వ్యాగన్​ ఎంట్రీ లెవల్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని 2024 సంస్థ రివీల్​ చేయనుంది. కారు ప్రొడక్షన్​ 2025లో మొదలవ్వొచ్చు. 2026లో ఈ మోడల్​ లాంచ్​ అవుతుందని టాక్​ నడుస్తోంది. తొలుత.. యూరోపియన్​ మార్కెట్​లోకి ఈ వెహికిల్​ ఎంట్రీ ఇస్తుంది.

అయితే.. దీని కన్నా ముందే.. ఓ ఎంట్రీ లెవల్​ ఈవీ హ్యాచ్​బ్యాక్​ని సంస్థ లాంచ్​ చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

తదుపరి వ్యాసం