తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Airtel Data Plans : రూ.26కే కొత్త డేటా ప్యాక్.. పాత రీఛార్జ్ ప్లాన్లలో మార్పులు చేసిన ఎయిర్‌టెల్

Airtel Data Plans : రూ.26కే కొత్త డేటా ప్యాక్.. పాత రీఛార్జ్ ప్లాన్లలో మార్పులు చేసిన ఎయిర్‌టెల్

Anand Sai HT Telugu

19 September 2024, 10:03 IST

google News
  • Airtel Recharge Plan : ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం రూ .26 విలువైన కొత్త డేటా ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. దీంతోపాటు కంపెనీ పాత డేటా పాక్య్‌ను కూడా మార్చి అదనపు డేటాను అందిస్తోంది. ఎలాంటి మార్పులు చేశారో ఇక్కడ చూద్దాం..

ఎయిర్‌టెల్ డేటా ప్లాన్స్
ఎయిర్‌టెల్ డేటా ప్లాన్స్

ఎయిర్‌టెల్ డేటా ప్లాన్స్

టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్ల డేటా అవసరాలను అర్థం చేసుకుని కొత్త డేటా ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఒక రోజు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్ ధరను రూ.26గా ఉంచింది. ఇది కాకుండా కంపెనీ ఇప్పటికే ఉన్న అనేక ప్లాన్లను కూడా మార్చింది. కొత్త డేటా ప్యాక్ గురించి, మిగిలిన ప్యాక్‌‌లలో ఎలాంటి మార్పులు చేశారో తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ ఒక రోజు వ్యాలిడిటీతో పలు డేటా ప్యాక్‌లను అందిస్తోంది. ఇంతకుముందు వినియోగదారులు రూ .19కి 1 జీబీ డేటాను పొందేవారు. కానీ జూలైలో ఈ ప్యాక్ ధరను రూ.22 కు పెంచారు. ఇప్పుడు కొత్త ప్యాక్ ఒక రోజు వ్యాలిడిటీతో రూ.26కు 1.5జీబీ డేటాను అందిస్తోంది. దీంతోపాటు రూ.33కే 2జీబీ, రూ.49కే అన్ లిమిటెడ్ డేటాను 1 రోజు వ్యాలిడిటీతో పొందొచ్చు.

రూ.77 డేటా ప్యాక్‌తో అందుబాటులో ఉన్న డేటాను కంపెనీ మార్చింది. ఇంతకుముందు ఈ ప్లాన్ రీఛార్జ్ పై 4జీబీ అదనపు డేటాను పొందేది. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ 5జీబీ డేటాను అందిస్తుంది. దీని వ్యాలిడిటీ ప్రస్తుతం ఉన్న యాక్టివ్ ప్లాన్ మాదిరిగానే ఉంటుంది. ఇది కాకుండా వినియోగదారులు థ్యాంక్స్ యాప్‌నకు వెళ్లడం ద్వారా 1జీబీ డేటాను క్లెయిమ్ చేయవచ్చు. తద్వారా వారికి మొత్తం 6జీబీ డేటా ప్రయోజనం లభిస్తుంది.

గతంలో రూ.121 ప్లాన్లో 5జీబీ అదనపు డేటా లభించేదని. ఇప్పుడు 8జీబీ వరకు డేటా లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ ప్రస్తుత యాక్టివ్ ప్లాన్ మాదిరిగానే 6జీబీ అదనపు డేటాను అందిస్తోంది. అయితే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే, 2జీబీ అదనపు డేటాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రూ.121కే 8 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఈ రీఛార్జ్ చేయడానికి యాక్టివ్ ప్లాన్ ఉండటం అవసరం. ఎందుకంటే అవి మెసేజింగ్ లేదా కాలింగ్ ప్రయోజనాలను అందించవు.

తదుపరి వ్యాసం