తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Air India Special Sale: ఎయిర్ ఇండియా టికెట్స్ డిస్కౌంట్ సేల్; ఈ రూట్లలో మాత్రమే..

Air India special sale: ఎయిర్ ఇండియా టికెట్స్ డిస్కౌంట్ సేల్; ఈ రూట్లలో మాత్రమే..

HT Telugu Desk HT Telugu

18 October 2023, 15:58 IST

  • Air India special sale: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో డిస్కౌంట్ సేల్ ను ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Air India special sale: బ్యాంకాక్, సింగపూర్ మార్గాల్లో విమాన టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ను ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ స్పెషల్ సేల్ భారత్ నుంచి సింగపూర్ కు, భారత్ నుంచి బ్యాంకాక్ కు వెళ్లే బిజినెస్, ఎకానమీ క్లాస్ ల వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మార్చి 2024 వరకు..

ఎయిర్ ఇండియా (Air India) విమానాల్లో ఇండియా నుంచి సింగపూర్ లేదా బ్యాంకాక్ వెళ్లే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ సేల్ లో టికెట్స్ కొనుగోలు చేసిన వారు 2024 మార్చ్ 31 లోపు తమ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇండియా సింగపూర్ రూట్ లో ఎకానమీ రౌండ్ ట్రిప్ కు ఈ ఆఫర్ లో టికెట్ ధర రూ. 13,330 నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా బ్యాంకాక్ రూట్ లో ఎకానమీ క్లాస్ రౌండ్ ట్రిప్ కు ఈ ఆఫర్ లో టికెట్ ధర రూ. 17,045 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, ఇండియా సింగపూర్ రూట్ లో బిజినెస్ క్లాస్ రౌండ్ ట్రిప్ కు ఈ ఆఫర్ లో టికెట్ ధర రూ. 70,290 నుంచి ప్రారంభమవుతుంది. ఇండియా బ్యాంకాక్ రూట్ లో బిజినెస్ క్లాస్ రౌండ్ ట్రిప్ కు ఈ ఆఫర్ లో టికెట్ ధర రూ. 49,120 నుంచి ప్రారంభమవుతుంది.

సింగపూర్, థాయిలాండ్ ల నుంచి..

సింగపూర్, థాయిలాండ్ ల నుంచి టికెట్స్ బుక్ చేసుకునేవారికి ఇతర ప్రత్యేక బెనిఫిట్స్ కూడా ఉంటాయని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. సింగపూర్ - ఇండియా రూట్ లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర 279 సింగపూర్ డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, బ్యాంకాక్ - ఇండియా రూట్ లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర థాయిలాండ్ కరెన్సీ అయిన బాత్ లో 9700 ల నుంచి ప్రారంభమవుతుంది. సింగపూర్ - ఇండియా రూట్ లో బిజినెస్ క్లాస్ టికెట్ ధర 1579 సింగపూర్ డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంకాక్ - ఇండియా రూట్ లో బిజినెస్ క్లాస్ టికెట్ ధర థాయిలాండ్ కరెన్సీ అయిన బాత్ లో 25960 ల నుంచి ప్రారంభమవుతుంది.

ఈ తేదీల్లో మాత్రమే..

ఈ ఆఫర్ ను పొందాలనుకునేవారు సింగపూర్, లేదా బ్యాంకాక్ లకు ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ లోపు టికెట్స్ బుక్ చేసుకోవాలి. మార్చి 31, 2024 లోపు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులు ఎయిర్ ఇండియా వెబ్ సైట్, ఎయిర్ ఇండియా మొబైల్ యాప్ ల ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ప్రతీ విమానంలో ఈ ఆఫర్ ద్వారా లిమిటెడ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అందువల్ల ఎంత త్వరగా బుక్ చేసుకుంటే, అంత మంచిది. గత వారం యూరోప్ లోని ఐదు దేశాలు.. యూకే, డెన్మార్క్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీలకు వెళ్లే వారికి కూడా ఎయిర్ ఇండియా ఇటువంటి డిస్కౌంట్ ప్లాన్ నే ప్రకటించింది.

తదుపరి వ్యాసం