Air India Sale: ఎయిర్ ఇండియాలో సేల్; డిస్కౌంట్స్ లో ఫ్లైట్ టికెట్స్
Air India Sale: భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి వినియోగదారుల కోసం డిస్కౌంట్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ ద్వారా డిస్కౌంటెడ్ ధరలకే కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో ఫ్లైట్ టికెట్స్ ను కొనుగోలు చేయవచ్చు.
Air India Sale: అంతర్జాతీయ ప్యాసెంజర్స్ కోసం ఎయిర్ ఇండియా ఒక ఆఫర్ ను ప్రకటించింది. భారత్ నుంచి కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల్లో ప్యాసెంజర్లు తక్కువ ధరకే టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బ్రిటన్ సహా యూరోప్ దేశాలకు ప్రయాణించేవారికి ఈ ఆఫర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రూ. 40 వేల నుంచి..
యూరోప్ లోని కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో అన్ని చార్జీలు కలుపుకుని రౌండ్ ట్రిప్ కి రూ. 40 వేల నుంచి టికెట్ రేట్స్ ప్రారంభం అవుతాయని ఎయిర్ ఇండియా (Air India Sale) ఒక ప్రకటనలో తెలిపింది. వన్ వే కి అయితే రూ. 25 వేల నుంచి ప్రారంభం అవుతాయని తెలిపింది. ఈ ఆఫర్ నాన్ స్టాప్ ఫ్లైట్స్ కు వర్తిస్తుంది. ముఖ్యంగా కోపెన్ హెగెన్ (డెన్మార్క్), లండన్ (బ్రిటన్), మిలన్ (ఇటలీ), పారిస్ (ఫ్రాన్స్), వియెన్నా (ఆస్ట్రియా) లకు భారత్ నుంచి వెళ్లాలనుకునే వారికి ఈ డిస్కౌంటెడ్ ధరలు వర్తిస్తాయి.
డిసెంబర్ లోపు..
ఈ సంవత్సరం డిసెంబర్ 15 లోపు యూరోప్ దేశాలకు ప్రయాణించాలనుకునేవారు ఈ నెల 14 వరకు ఎయిర్ ఇండియా వెబ్ సైట్ ద్వారా, లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ ఆఫర్ లో డిస్కౌంట్ ధరలకే టికెట్స్ ను బుక్ చేసుకోవచ్చు. లిమిటెడ్ సీట్స్ కే ఈ ఆఫర్ ఉంటుంది. ఫస్ట్ కమ్.. ఫస్ట్ సర్వ్ విధానంలో డిస్కౌంటెడ్ టికెట్స్ ను కేటాయిస్తారు. ఢిల్లీ, ముంబైల నుంచి ప్రతీ వారం ఎయిర్ ఇండియా యూరోప్ లోని పైన పేర్కొన్న ఐదు నగరాలకు 48 నాన్ స్టాప్ విమానాలను నడుపుతోంది.