Aadhaar Update: ఉచితంగా ఆధార్ ఆన్‍లైన్ అప్‍డేట్: తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే
16 March 2023, 11:37 IST
- Aadhaar Update: ఆన్‍లైన్‍లో ఆధార్ అప్‍డేట్ ప్రక్రియపై చార్జీలను యూఐడీఏఐ ఎత్తేసింది. మూడు నెలల పాటు ఈ సదుపాయం ఉండనుంది. పూర్తి వివరాలివే..
Aadhaar Update: ఉచితంగా ఆధార్ ఆన్‍లైన్ అప్‍డేట్: తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే
Aadhaar Update: ఆధార్ వివరాలను అప్‍డేట్ చేసుకోవాలనుకుంటున్న వారికి యునీక్ ఐటెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్ డాక్యుమెంట్ వివరాలను ఉచితంగా అప్‍డేట్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఆన్‍లైన్ ద్వారానే ఈ ఉచిత సదుపాయం ఉంటుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇది తీసుకొచ్చామని యూఐడీఏఐ తెలిపింది. అలాగే మూడు నెలల పాటు మాత్రమే ఆన్‍లైన్‍లో ఈ ఉచిత అప్‍డేట్ అవకాశం ఉంది. ఆ తర్వాత చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆధార్ ఉచిత అప్‍డేట్‍పై తప్పక తెలుకోవాల్సిన విషయాలు ఇవే.
ఆన్‍లైన్‍లో మాత్రమే ఫ్రీ
Aadhaar Update: ఆధార్ వివరాలను ఆన్‍లైన్‍లో అప్‍డేట్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఉచిత సదుపాయం ఉంటుంది. మైఆధార్ వెబ్‍సైట్/పోర్టల్(myaadhaar.uidai.gov.in)లో ఆధార్ వివరాలను అప్‍డేట్ చేసుకుంటే ఉచితం. ఒకవేళ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్‍డేట్ చేసుకుంటే సాధారణంగా రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‍లైన్ చేసుకుంటే ఉచితమే. మూడు నెలల పాటు ఆన్‍లైన్ అప్‍డేట్ చార్జీలను యూఐడీఏఐ మాఫీ చేసింది.
ఎప్పటి వరకు అంటే..
Aadhaar Update: ఆన్‍లైన్‍లో ఆధార్ అప్‍డేట్‍ను ఉచితంగా చేసుకునే సదుపాయం మూడు నెలలు ఉంటుంది. ఈనెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు (15-03-2023 నుంచి 14-06-2023 వరకు) ఎలాంటి ఖర్చు లేకుండా ఆన్‍లైన్‍లో ఆధార్ వివరాలను మార్పు చేసుకోవచ్చని యూఐడీఐ వెల్లడించింది. మైఆధార్ (myaadhaar.uidai.gov.in/) వెబ్‍సైట్‍లో ఈ అప్‍డేట్ ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏ వివరాలు అప్‍డేట్ చేసుకోవచ్చంటే..
Aadhaar Update: మై ఆధార్ పోర్టల్‍లో మీ ఆధార్ కార్డులోని పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలను మార్చుకోవచ్చు. వెబ్‍సైట్‍లో ఇందుకోసం అప్లై చేసుకోవచ్చు. అయితే మార్పునకు సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్ (ప్రూఫ్)ను అప్‍లోడ్ చేయాల్సి ఉంటుంది.
అప్‍డేట్ ఇలా..
Aadhaar Update: ముందుగా యూఐడీఏఐ వెబ్‍సైట్ uidai.gov.inలోకి వెళ్లాలి. ఆ తర్వాత అప్‍డేట్ ఆధార్ సెక్షన్‍లో అప్‍డేట్ డెమోగ్రఫిక్ డేటా, చెక్ స్టేటస్ అనే ఆప్షన్‍పై క్లిక్ చేయాలి. లేకపోతే నేరుగా మైఆధార్ పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/ లోకి కూడా వెళ్లవచ్చు. ఆ తర్వాత అక్కడ లాగిన్ బటన్‍పై క్లిక్ చేసి.. ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ కార్డుకు రిజిస్టర్ అయిన మొబైల్‍కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ లాగిన్ బటన్‍పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు మార్చుకోవాలనుకున్న వివరాలను ఎంపిక చేసుకోవాలి. సపోర్టెడ్ డాక్యుమెంట్‍ను అప్‍లోడ్ చేయాలి.
Aadhaar Update: ఆధార్ కార్డు ఉన్న వారు ప్రతీ 10 సంవత్సరాలకు ఒకసారి అప్‍డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది. అంటే పదేళ్ల వ్యవధిలో కనీసం ఒక్కసారైనా అప్‍డేట్ చేసుకోవాలి. ఒకవేళ మార్పులు లేకున్నా పదేళ్లలో ఒక్కసారైనా ఏదైనా ధ్రువీకరణ పత్రాన్ని అప్‍లోడ్ చేసి అప్‍డేట్ చేసుకోవచ్చు.