తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Pan - Aadhaar Link : పాన్-ఆధార్ లింక్‍కు తుది గడువు సమీపిస్తోంది: ఎలా లింక్ చేసుకోవాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..!

PAN - Aadhaar Link : పాన్-ఆధార్ లింక్‍కు తుది గడువు సమీపిస్తోంది: ఎలా లింక్ చేసుకోవాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..!

05 March 2023, 14:36 IST

google News
    • PAN - Aadhaar Link : పాన్ కార్డుకు ఆధార్ లింక్ చేసేందుకు ప్రభుత్వం నిర్ధారించిన తుది గడువు సమీపిస్తోంది. ఈ తరుణంలో పాన్, ఆధార్ అనుసంధానం ఎలా చేసుకోవాలి.. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి.
PAN - Aadhaar Link : పాన్-ఆధార్ లింక్‍కు తుది గడువు సమీపిస్తోంది
PAN - Aadhaar Link : పాన్-ఆధార్ లింక్‍కు తుది గడువు సమీపిస్తోంది (Reuters)

PAN - Aadhaar Link : పాన్-ఆధార్ లింక్‍కు తుది గడువు సమీపిస్తోంది

PAN - Aadhaar Link : పర్మినెంట్ అకౌంట్ నంబర్ (PAN)కు ఆధార్‌ను అనుసంధానం చేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇందుకు మార్చి 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఆలోగా ప్రజలందరూ తమ పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే పాన్ నిరర్థకమవుతుంది. అయితే ఇప్పటి వరకు పాన్-ఆధార్ లింక్ తుదిగడువును ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. చివరికి మార్చి 31గా నిర్ణయించింది. అయితే ఈసారి పొడిగిస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు. అందుకే ఇంకా పాన్-ఆధార్ లింక్ చేసుకోని వారు వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మంచిది. అలాగే ఇప్పటికే లింక్ చేసుకున్న వారు ఓ సారి స్టేటస్ చెక్ చేసుకొని నిర్ధారించుకోవచ్చు. మరి పాన్-ఆధార్ లింక్ ఎలా చేసుకోవాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

ఆన్‍లైన్‍లో పాన్-ఆధార్ లింక్ చేసుకోండిలా..

  • PAN - Aadhaar Link : ముందుగా బ్రౌజర్‌లో ఇన్‍కమ్ ట్యాక్స్ ఫిల్లింగ్ అఫీషియల్ వైబ్‍సైట్ eportal.incometax.gov.in వెబ్‍సైట్‍లోకి వెళ్లండి.
  • హోమ్ పేజీలో లింక్ యువర్ పాన్ (Link Your Pan) అనే బటన్‍ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
  • లింక్ యువర్ పాన్‍పై క్లిక్ చేశాక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పాన్ కార్డు నంబర్‌ను యూజర్ ఐడీగా ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు ఇంతకు ముందు రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్‌పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక లాగిన్ అవండి.
  • అప్పుడు లింక్ పాన్ విత్ ఆధార్ (Link PAN with Aadhaar) అనే పాపప్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసి ఆధార్‌తో పాన్ లింక్ చేసుకోవచ్చు. పాపప్ రాకపోతే మెనూబార్‌లో ప్రొఫైల్ సెటింగ్స్‌లో లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి.
  • పాన్ కార్డు ప్రకారం అక్కడ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ సహా మరిన్ని వివరాలు కనిపిస్తాయి.
  • మీరు ఆధార్ వివరాలతో వాటిని వెరిఫై చేసుకోండి. వివరాలు మ్యాచ్ అయితే.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి.. లింక్ నౌ బటన్‍పై క్లిక్ చేయండి.
  • అనంతరం ఆధార్‌తో పాన్ కార్డు లింక్ అయిందని ఓ పాపప్ మెసేజ్ కనిపిస్తుంది.

పాన్ - ఆధార్ లింక్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • PAN - Aadhaar Link Status: ముందుగా బ్రౌజర్‌లో www.incometax.gov.in వెబ్‍సైట్‍కు వెళ్లండి.
  • హోం పేజీ క్లిక్ లింక్స్ సెక్షన్‍లో లింక్ ఆధార్ స్టేటస్ (Link Aadhaar Status) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • అనంతరం పాన్ నంబర్, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత కింద ఉండే వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ (View Link Aadhaar Status) బటన్‍పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీ పాన్‍తో ఆధార్ లింక్ అయి ఉంటే పాపప్ మెసేజ్ వస్తుంది. లింక్ కాకపోయినా కాలేదని చూపిస్తుంది.

మీ దగ్గర్లోని పాన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి కూడా పాన్-ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం