తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mukesh Ambani's Gift To His Employee: స్నేహితుడికి 1500 కోట్ల విలువైన బంగళా గిఫ్ట్ గా ఇచ్చిన ముకేశ్ అంబానీ

Mukesh Ambani's gift to his employee: స్నేహితుడికి 1500 కోట్ల విలువైన బంగళా గిఫ్ట్ గా ఇచ్చిన ముకేశ్ అంబానీ

HT Telugu Desk HT Telugu

25 April 2023, 19:06 IST

google News
    • భారత్ లో దిగ్గజ పారిశ్రామిక వేత, అత్యంత సంపన్న బిజినెస్ మ్యాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ అయిన ముకేశ్ అంబానీ తన ఉద్యోగుల పట్ల చాలా ఔదార్యంగా ఉంటారని పేరు. ఆ పేరును నిలబెట్టుకునేలా, తన కంపెనీలో సీనియర్ ఉద్యోగికి రూ. 1500 కోట్ల బంగళాను బహుమతిగా ఇచ్చారు. అయితే, ఆ ఉద్యోగి కూడా సాధారణ వ్యక్తి కాదు..
మనోజ్ మోదీ, ముకేశ్ అంబానీ
మనోజ్ మోదీ, ముకేశ్ అంబానీ

మనోజ్ మోదీ, ముకేశ్ అంబానీ

Mukesh Ambani's gift to his employee: భారత్ లో దిగ్గజ పారిశ్రామిక వేత, అత్యంత సంపన్న బిజినెస్ మ్యాన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance industries) చీఫ్ అయిన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తన ఉద్యోగుల పట్ల చాలా ఔదార్యంగా ఉంటారని పేరు. ఆ పేరును నిలబెట్టుకునేలా, తన కంపెనీలో సీనియర్ ఉద్యోగికి రూ. 1500 కోట్ల బంగళాను బహుమతిగా ఇచ్చారు. అయితే, ఆ ఉద్యోగి కూడా సాధారణ వ్యక్తి కాదు..

Mukesh Ambani's gift to his employee: కాలేజ్ ఫ్రెండ్..

ముకేశ్ అంబానీ ముంబై యూనివర్సిటీ లో కెమికల్ టెక్నాలజీ చదువుతున్న సమయంలో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) క్లాస్ మేట్, ఫ్రెండ్ మనోజ్ మోదీ (Manoj Modi). అప్పటి నుంచి వారిద్దరూ చాలా సన్నిహిత మిత్రులు. 1980వ దశకంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహణ బాధ్యతలను ముకేశ్ అంబానీ తండ్రి ధీరూభాయి అంబానీ (Dhirubhai Ambani) చూస్తున్న సమయంలో ముకేశ్ అంబానీ సలహా మేరకు మనోజ్ మోదీ (Manoj Modi) రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఉద్యోగిగా చేరారు. నాటి నుంచి నేటి వరకు ముకేశ్ అంబానీకి రైట్ హ్యాండ్’(right hand) గా కొనసాగుతున్నారు. అంతేకాదు, ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ (Nita Ambani)కి, పిల్లలు ఈశా అంబానీ (Isha Ambani), ఆకాశ్ అంబానీ (Akash Imbani ) లకు మనోజ్ మోదీ (Manoj Modi) చాలా సన్నిహితుడు. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ (Reliance Retail), రిలయన్స్ జియో (Reliance Jio) ల్లో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

Mukesh Ambani's gift to his employee: రూ. 1500 కోట్ల విలువైన బంగళా..

ఈ నేపథ్యంలో, తన స్నేహితుడు, తన కంపెనీలో ఉద్యోగి గా ఉన్న మనోజ్ మోదీకి ముకేశ్ అంబానీ ఇటీవల రూ. 1500 కోట్ల విలువైన స్థిరాస్థిని గిఫ్ట్ గా ఇచ్చారు. ముంబైలోని ప్రీమియం లొకాలిటీలో ఉన్న నేపియన్ సీ రోడ్ లో ఉన్న 22 అంతస్తుల, 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఆ భవనాన్ని టాలాటీ అండ్ పార్ట్ నర్స్ (Talati & Partners LLP) డిజైన్ చేశారు. భవనంలోని ఫర్నిచర్ ను ఇటలీ నుంచి తెప్పించారు. ఆ భవనం విలువ రూ. 1500 కోట్లకు పైగానే ఉంటుంది. మనోజ్ మోదీ చాలా సింపుల్ గా ఉంటారు. కానీ, చర్చల్లో చాలా గట్టి మనిషి అని పేరు. లక్షల కోట్ల విలువైన చాలా ప్రాజెక్టులు రిలయన్స్ కు రావడానికి ఆయన సామర్ధ్యమే కారణమని రిలయన్స్ వర్గాలు చెబుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం