Business Ideas : తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలనుకుంటే ఈ లిస్టు ఓసారి చూడండి
05 November 2024, 11:00 IST
- Business Ideas In Telugu : సొంతంగా ఏదైనా స్టార్ట్ చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ పెట్టుబడి గురించి ఆలోచిస్తారు. తక్కువ పెట్టుబడితో మెుదలుపెట్టేందుకు కొన్ని బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. అవేంటో చూడండి.
బిజినెస్ ఐడియాలు
తమకంటూ ఓ బిజినెస్ ఉండాలని ఈ మధ్యకాలంలో చాలా మంది యువత ఆలోచిస్తున్నారు. అయితే ఈ కలను ముందుకు తీసుకెళ్లపోవడానికి ప్రధాన కారణం పెట్టుబడి. ఎక్కువ ఖర్చులు అవుతాయేమోనని భయంతో చాలా మంది వెనక అడుగు వేస్తుంటారు. మీరు తక్కువ ధరతో వ్యాపారం ప్రారంభించేందుకు ఐడియాలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం..
కంటెంట్ క్రియేటర్
సోషల్ మీడియా, 24 వార్తా న్యూస్ చానెళ్లతో చాలా మందికి అవకాశాలు దొరుకుతున్నాయి. కంటెంట్ రైటర్స్, గ్రాఫిక్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. వ్యాపారాలు, మీడియా అవుట్‌లెట్‌ల కోసం మంచి కంటెంట్‌ను రూపొందించొచ్చు. అవసరమైతే కొన్ని సంస్థలతో ఒప్పందం చేసుకుని ఫ్రీలాన్సర్లను మీ దగ్గర పని చేయించుకోవచ్చు. ఒక ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడర్‌గా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవచ్చు.
ఈవెంట్ ప్లానింగ్
మీకు మంచి నైపుణ్యాలు ఉంటే మీరు ఈవెంట్ ప్లానింగ్ సేవలను సులభంగా అందించవచ్చు. ఈ ఈవెంట్ ప్లానింగ్ సేవలు వివాహాలు, పుట్టినరోజు పార్టీలు, ఇతర పార్టీలకు ఇవ్వొచ్చు. ఇందుకోసం మీరు ముందుగా ఈవెంట్ ప్లానర్ దగ్గర కొన్ని రోజులు పని చేస్తే మంచిది.
సోషల్ మీడియా
పెద్ద కంపెనీలు తమ ఫేస్‌బుక్, ఎక్స్ ఖాతాలు, బ్లాగ్‌లను నిర్వహించడానికి ఏజెన్సీ లేదా పూర్తి సిబ్బందిని నియమించుకోవచ్చు. కానీ చిన్న వ్యాపారాలు తరచుగా సోషల్ మీడియా మార్కెటింగ్‌ను వారి స్వంతంగా చూసుకోవాలి. సోషల్ మీడియా కన్సల్టెంట్ పెడితే మీకు మంచి సంపాదన ఉంటుంది. అయితే సోషల్ మీడియాపై పూర్తిస్థాయిలో పట్టు ఉండాలి.
ఆన్‌లైన్ కోర్సులు
ఆన్‌లైన్ కోర్సులు, ట్యూషన్ ప్రారంభించవచ్చు. మీరు దేనిపై ఎక్కువగా ఆసక్తిగా ఉంటే ఆ విషయాన్ని పూర్తిగా నేర్చుకోండి. తర్వాత ఆన్‌లైన్ ద్వారా ఇతరులకు చెప్పొచ్చు. యోగానా? వెబ్ డిజైన్?.. ఇలా ఏదో ఒకటి ఎంచుకోండి. కోవిడ్ మహమ్మారి తర్వాత ఆన్‌లైన్ తరగతులు ప్రాచుర్యం పొందాయి. నేటికీ అలానే కొనసాగుతున్నాయి.
ట్రాన్స్‌లేషన్
అనువాదానికి కూడా ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉంది. లింక్డిన్ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో చాలా మంది పోస్టులు చేస్తుంటారు. ఒక భాష నుండి మరొక భాషకి ఎలా అనువదించాలో మీకు తెలిస్తే మీరు అనువాదకునిగా పని చేయవచ్చు. అనువాదకుల డిమాండ్ పెరుగుతోంది. 2028 నాటికి ఈ రంగంలో 28 శాతం వృద్ధిని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ అంచనా వేసింది.
డిజిటల్ మార్కెటింగ్
మీకు మార్కెటింగ్‌లో అనుభవం ఉంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది తక్కువ ఖర్చుతో కూడిన వ్యాపార ఆలోచన. ఏ సమయంలోనైనా పని చేయవచ్చు. మార్కెటింగ్‌లో నేపథ్యం లేకపోయినా ఫీల్డ్‌పై ఆసక్తి ఉంటే నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఆన్‌లైన్ కోర్సులు ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ సంస్థ అనేది త్వరగా, చౌకగా ప్రారంభించగల వ్యాపారం.
వీడియో ఎడిటింగ్
వీడియో ఎడిటింగ్‌కు ఇటీవలి కాలంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, యూట్యూబ్ సెలబ్రిటీలకు తమ వీడియోల కోసం అధిక-నాణ్యత వీడియోలను రూపొందించడానికి నైపుణ్యాలు లేదా పరికరాలు లేవు. మీకు వీడియో ప్రొడ్యూసర్‌గా అనుభవం ఉంటే మంచి వీడియోలు చేయడం ఎలాగో తెలుసుకోండి. ఎడిటింగ్ నేర్చుకోండి.
టాపిక్