Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్.. నేటి 'స్టాక్స్ టు బై' లిస్ట్ ఇదే!
07 October 2022, 8:28 IST
- Stocks to buy today : ట్రేడర్స్ ట్రాక్ చేయాల్సిన నేటి స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్ టు బై
Stocks to buy today : అంతర్జాతీయ సానుకూలతల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు కొన్ని రోజులుగా రాణిస్తున్నాయి. గురువారం ట్రేడింగ్ సెషన్లో 57పాయింట్లు మెరుగుపడిన నిఫ్టీ.. 17,331 వద్ద ముగిసింది. ఇక 156 పాయింట్లు పెరిగి.. 58,222 వద్ద స్థిరపడింది సెన్సెక్స్. నిఫ్టీ బ్యాంక్ 172 పాయింట్లు పెరిగి.. 39,282 మార్క్‌కు చేరింది. స్మాల్ క్యాప్ సూచీ 1.13శాతం, మిడ్ క్యాప్ సూచీ 1.30శాతం వృద్ధి చెందాయి.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం.. నిఫ్టీ50.. 18,100 నుంచి 16750 వరకు పడింది. 200డీఎంఏ దగ్గర సపోర్టు తీసుకుంది మళ్లీ పెరుగుతోంది. ఇక ఇప్పుడు 17,450-17500 లెవల్స్ వద్ద రెసిస్టెన్స్ ఉంది. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ట్రేడర్లు కొనుగోళ్లు చేపట్టవచ్చని అంటున్నారు. అయితే రానున్న 1-2 ట్రేడింగ్ సెషన్స్‌లో కాన్సాలిడేషన్ను చూడవచ్చు అని స్పష్టం చేస్తున్నారు.
ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 30పాయింట్ల నష్టంలో ఉంది. అంటే.. నేడు స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సైతం మిశ్రమంగానే ట్రేడ్ అవుతున్నాయి.
స్టాక్స్ టు బై..
- Stocks to buy : ఇండియన్ హోటల్స్ కంపెనీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 303, టార్గెట్ రూ. 380.
- టాటా స్టీల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 97, టార్గెట్ రూ. 112
- వేదాంత:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 278, టార్గెట్ రూ. 320.
- రిలయన్స్ ఇండస్ట్రీస్:- సెల్ రూ. 2409, స్టాప్ లాస్ రూ. 2419, టార్గెట్ రూ. 2399
- అదానీ పోర్ట్స్:- సెల్ రూ. 819, స్టాప్ లాస్ రూ. 823, టార్గెట్ రూ. 812.
(గమనిక: ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతం ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)