EV Scooters Under 1 Lakh : లక్ష రూపాయల ధరలోపు ఉన్న 5 ఈవీ స్కూటర్లు.. ఓ లుక్కేయండి
10 September 2024, 15:35 IST
- EV Scooters Under 1 Lakh In India : ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం ఇటివలి కాలంలో పెరిగింది. చాలా మంది వీటివైపే మెుగ్గుచూపుతున్నారు. పెట్రోల్ ఖర్చు లేకుండా తక్కువ ధరతో వీటితో ప్రయాణం చేయవచ్చు. భారతదేశంలో లక్ష రూపాయలలోపు ఉన్న 5 ఈవీ స్కూటర్ల గురించి చూద్దాం..
ఈ2జీవో గ్రాఫేన్
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లోనూ భారతదేశం ముందు వరుసలోనే ఉంది. ఈ మధ్యకాలంలో వీటి వాడకం పెరుగుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు పర్యావరణ అనుకూలంగా ఉంటాయి. మరోవైపు పెట్రోల్ ఖర్చులు లేకుండా ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తాయి. వీటికి టెక్నాలజీ కూడా తోడై వస్తుంది. దీంతో వినియోగదారులు ఈవీలపై ఆసక్తి చూపిస్తున్నారు. రూ.1 లక్ష లోపు ఉన్న ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్‌లు వాటి ఫీచర్లు, పనితీరు గురించి తెలుసుకుందాం..
ఓలా ఎస్1
ఓలా ఎస్1 స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది. ఈ స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్. 8.5 kW మోటార్‌తో ఉంటుంది. 95 km/h గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఇది సిటీ రైడ్‌లకు సరైనదిగా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది వీటిని కొన్నారు. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే బ్లూటూత్ కనెక్టివిటీ, మ్యూజిక్ ప్లేబ్యాక్, నావిగేషన్, ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఈ స్కూటర్ ఎకో, నార్మల్, స్పోర్ట్స్‌తో సహా వివిధ మోడ్‌లను కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌తో 141 కి.మీ వరకు వెళ్లవచ్చు. మంచి డిజైన్, విశాలమైన బూట్‌తో ఈ స్కూటీ ఉంటుంది. ధర రూ.87,817గా ఉంది.
ఒడిస్సే ఈ2జీవో గ్రాఫేన్
ఒడిస్సే E2Go గ్రాఫేన్ అనేది రోజువారీ పట్టణ ప్రయాణ అవసరాలను తీర్చడానికి రొపొందించిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ.68,650గా ఉంది. ఇది బలమైన 250W BLDC మోటారును కలిగి ఉంది. 25 km/h గరిష్ట వేగాన్ని అనుమతిస్తుంది. ఇది సిటీ రైడ్‌లకు బెటర్ ఆప్షన్. E2Go గ్రాఫేన్ 1.44 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 కి.మీల పరిధిని అందిస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 8 గంటలు పడుతుంది. దాని స్టైలిష్ డిజైన్‌తో 5 రంగులలో లభిస్తుంది.
ఒడిస్సే స్నాప్
ఒడిస్సే స్నాప్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది రోజువారీ వినియోగానికి సరైనది. 1200W మోటార్, శక్తివంతమైన Li-ion బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది. ఇది కీలెస్ ఎంట్రీ సిస్టమ్‌తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఎంపికను అందిస్తుంది. దీని తేలికపాటి డిజైన్, బలమైన సస్పెన్షన్ సిస్టమ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లతో కలిపి సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. వివిధ రంగులలో అందుబాటులో ఉన్న ఒడిస్సీ స్నాప్ స్టైలిష్‌గా ఉంటుంది. ఈ ఈవీ ధర రూ.79,999గా ఉంది.
ఒకాయ ఫాస్ట్ ఎఫ్2టీ
Okaya Faast F2T ధర రూ.94,998గా ఉంది. 2000W BLDC మోటార్, 2.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో ఆధారితం. ఇది గరిష్టంగా 70 km/h, 100 km పరిధిని అందిస్తోంది. మూడు రైడింగ్ మోడ్‌లు (ఎకో, సిటీ, స్పోర్ట్స్)లో వస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్‌లతో కూడిన స్కూటర్ సస్పెన్షన్ సెటప్ మంచి ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. యాంటీ-థెఫ్ట్ అలారం, కీలెస్ స్టార్ట్‌తోపాటు వివిధ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
టీవీఎస్ ఐక్యూబ్
TVS iQube అనేది సౌకర్యవంతమైన పట్టణ ప్రయాణానికి ఉపయోగపడే ఎలక్ట్రిక్ స్కూటర్. 4.4 kW హబ్ మోటార్‌తో వస్తుంది. 78 km/h గరిష్ట వేగాన్ని అందిస్తుంది. దీని డిజిటల్ TFT డ్యాష్‌బోర్డ్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ ఉన్నాయి. iQube వివిధ అవసరాలకు అనుగుణంగా ఎకో, పవర్‌తో సహా వివిధ రైడింగ్ మోడ్‌లతో వస్తుంది. పూర్తి ఛార్జింగ్‌తో 100 కి.మీల పరిధిని ఇస్తుంది. ఇది నగర ప్రయాణాలకు అనువైనది. దీని ధర రూ.94,999గా ఉంది.