EV Charging : ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఛార్జింగ్ అయిపోతే భయపడకండి
EV Charging : మీ ఎలక్ట్రిక్ వాహనం ఛార్జింగ్ అయిపోతుందని భయపడుతున్నారా? ఒక వేళ మీది ఏథర్ ఎనర్జీకి సంబంధించిన ద్విచక్రవాహనమైతే ఇకపై సమస్య ఉండదు. గూగుల్‌తో కలిసి ఏథర్ పనిచేస్తోంది. మీ సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్లను వెంటనే మీకు చెప్పేస్తుంది.
భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, గూగుల్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. తమ ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల లభ్యత గురించి సమాచారాన్ని అందించడానికి గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. లైట్ ఎలక్ట్రిక్ కంబైన్డ్ ఛార్జింగ్ సిస్టమ్ - LECCS (అధికారిక భారతీయ EV ఛార్జింగ్ కనెక్టర్ స్టాండర్డ్) ఉన్న వినియోగదారులు తమ ద్విచక్ర వాహనాలపై ఛార్జర్‌ల పూర్తి లైవ్ స్టేటస్ అప్‌డేట్‌లను పొందుతారు.
ఏథర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్, ఏథర్ గ్రిడ్ స్థితి అప్‌డేట్‌లతో గూగుల్ మ్యాప్స్‌లో కనిపిస్తుంది. కొత్త ఛార్జర్‌ని ఇన్‌స్టాల్ చేసినప్పుడు, అది Google మ్యాప్స్‌లో జాబితా అవుతుంది. LECCS ఇప్పుడు అధికారికంగా ప్లగ్ రకంగా గుర్తించారు. వినియోగదారులు తమ డిఫాల్ట్ కనెక్టర్ లేదా ప్లగ్ రకాన్ని గూగుల్ మ్యాప్స్‌లో LECCSగా సెట్ చేయడానికి అనుమతిస్తుంది. వినియోగదారులు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జర్లను గుర్తించవచ్చు.
అంటే Google మ్యాప్స్‌లో సమీప EV ఛార్జర్, ఛార్జింగ్ స్టేషన్‌లు కోసం శోధిస్తున్నప్పుడు LECCSతో కూడిన ఛార్జర్‌లు కనిపిస్తాయి. ఇది ఏథర్ గ్రిడ్‌లో ఏథర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను సులభంగా కనుగొని ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఏథర్ గ్రిడ్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ దేశీయంగా అభివృద్ధి చేసిన లైట్ ఎలక్ట్రిక్ కంబైన్డ్ ఛార్జింగ్ సిస్టమ్ (LECCS)పై ఆధారపడి ఉంది. దీనిని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దేశవ్యాప్తంగా ఆమోదించిందని ఏథర్ ఎలక్ట్రిక్ కంపెనీ తెలిపింది.
గూగుల్ మ్యాప్స్‌తో ఏథర్ అప్‌డేట్.. ఈవీ పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రోత్సహించే ప్రయత్నాలకు నిదర్శనమని కంపెనీ తెలిపింది. 2013లో ప్రారంభించినప్పటి నుండి, కంపెనీ డిమాండ్‌లకు అనుగుణంగా నవీకరణలను అందిస్తోంది. ఇప్పుడు గూగుల్‌తో కొత్త అప్‌డేట్ కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని ఏథర్ అంటోంది.
టచ్-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్, ఆన్-బోర్డ్ నావిగేషన్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ మోడ్, మొబైల్ యాప్ వంటి ఫీచర్లు EV సెగ్మెంట్‌లో ఏథర్ తీసుకొచ్చింది. ఇటీవల ఏథర్ గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, అలెక్సా, వాట్సాప్ నోటిఫికేషన్ టెక్నాలజీలను దాని ద్విచక్ర వాహనాల్లోకి చేర్చింది.
ఏథర్ కంపెనీ ఇటీవల రిజ్టా పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కొత్త ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ.1,09,999గా ఉంది. తమిళనాడులోని హోసూర్‌లోని కంపెనీ తయారీ ప్లాంట్‌లో కొత్త ఏథర్ రిజ్టా ఉత్పత్తి ప్రారంభమైంది.