తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఇంటి వద్దకే 24 గంటలూ నర్సింగ్, ఫిజియో థెరపీ సేవలు.. మొబైల్‌ యాప్‌ నుంచే బుక్ చేసుకోవచ్చు

ఇంటి వద్దకే 24 గంటలూ నర్సింగ్, ఫిజియో థెరపీ సేవలు.. మొబైల్‌ యాప్‌ నుంచే బుక్ చేసుకోవచ్చు

HT Telugu Desk HT Telugu

25 February 2024, 8:08 IST

google News
    • అత్యుత్తమ నర్సింగ్‌ - ఫిజియో థెరపీ సేవలను, రీజనబుల్‌ ధరల్లో ఇంటి దగ్గర, తమ ట్రాన్సిషన్‌కేర్‌ సెంటర్లయిన ‘హెల్త్‌ ఆన్‌ అజ్‌’ కేంద్రాల్లో పొందేందుకు మొబైల్‌ యాప్‌ను వినియోగించుకోవచ్చని హెల్త్‌ ఆన్‌ అజ్‌ ఛైర్మన్‌ లింగమనేని రమేశ్‌ ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు.
ఇంటి వద్దకే నర్సింగ్, ఫిజియోథెరఫీ సేవలు
ఇంటి వద్దకే నర్సింగ్, ఫిజియోథెరఫీ సేవలు

ఇంటి వద్దకే నర్సింగ్, ఫిజియోథెరఫీ సేవలు

హైదరాబాద్‌: ఉత్తమ హెల్త్‌కేర్‌ సేవలను అందుబాటు ధరల్లో ఆవిష్కరించాల్సిన అవసరాన్ని కొవిడ్‌ పరిస్థితులు మనకు కళ్లకు గట్టాయి. చికిత్సా ఖర్చులు గణనీయంగా పెరగడం, హాస్పిటల్‌లో చేరదామన్నా పడకలు లభించక పోవడం ప్రతి కుటుంబానికి ఎదురైన పరిస్థితే. క్లినికల్‌ నైపుణ్యాలున్న సిబ్బంది సాయంతో ఇంటి దగ్గర వైద్య సదుపాయం పొందితే సరిపోయే పరిస్థితి ఉన్నా, ఆ అవకాశాలు లేక హాస్పిటల్స్‌లో చేరుతున్న వారు ఎందరో.

ఈ పరిస్థితులను గమనించిన కొందరు వైద్య రంగ ప్రముఖులు, టెక్నాలజీ రంగ నిపుణుల మేథోమథనంతో ఏర్పాటైన సంస్థే ‘హెల్త్‌ ఆన్‌ అజ్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌’.

అత్యుత్తమ నర్సింగ్‌ - ఫిజియో థెరపీ సేవలను, రీజనబుల్‌ ధరల్లో ఇంటి దగ్గర, తమ ట్రాన్సిషన్‌కేర్‌ సెంటర్లయిన ‘హెల్త్‌ ఆన్‌ అజ్‌’ కేంద్రాల్లో పొందేందుకు మొబైల్‌ యాప్‌ను వినియోగించుకోవచ్చని హెల్త్‌ ఆన్‌ అజ్‌ ఛైర్మన్‌ లింగమనేని రమేశ్‌ ఇక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. ‘వ్యాధిగ్రస్తులు/క్షతగాత్రులు/శస్త్ర చికిత్సానంతరం కోలుకుంటున్న వారు తమకు అవసరమైన వైద్య/ఫిజియోథెరపీ సేవల కోసం ఈ యాప్‌లో 24 గంటలూ బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

‘నగరాల్లో శాటిలైట్‌ (స్పోక్స్‌) కేంద్రాలను నెలకొల్పాం. మొబైల్‌లో బుక్‌ చేయగానే, సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లి, నర్సింగ్‌ సేవలందించేందుకు సుశిక్షతులైన నర్సింగ్, ఫిజియోథెరపీ, ఫార్మసీ డెలివరీ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వైటల్స్‌ పర్యవేక్షణ అవసరమై, వైద్యుల సమక్షంలో ఉండాల్సిన, నిరంతరం ఆక్సిజన్‌ సరఫరా కావాల్సిన వారికి ‘హెల్త్‌ ఆన్‌ అజ్‌’ కేంద్రాల్లో ఎమర్జన్సీ కేర్‌లో సుశిక్షుతులైన, ఇంటర్వెన్షనల్‌ స్పెషలిస్ట్, అత్యవసరాల్లో వెంటిలేటర్‌తో చికిత్స అందించేలా పడకలు, అత్యవసర చికిత్సా గదులు (ఐసీయూ) ఏర్పాట్లు చేశాం..’ అని వివరించారు.

‘అత్యున్నత ప్రమాణాలతో, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం లేకుండా వైద్య సేవలు అందించేలా మా కేంద్రాలను తీర్చిదిద్దాం. పూర్తిస్థాయిలో శిక్షణ పొంఇన 100 మంది నర్సింగ్‌ సిబ్బంది, 75 ఫిజియోథెరపిస్టులు, 50 మంది ఫార్మసిస్టులున్నారు. 85 మంది ఐటీ నిపుణులు యాప్, ఇతర సాంకేతిక సేవలను ఎప్పటికప్పుడు మెరుగు పరుస్తున్నారు. మొత్తంమీద 300కు పైగా మా సిబ్బంది ఉన్నారని’ రమేశ్‌ వివరించారు.

హెల్త్‌ ఆన్‌ అజ్‌ లక్ష్యాలివీ..

హాస్పిటల్స్‌లో శస్త్రచికిత్స/హార్ట్ఎటాక్‌ వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో చికిత్స చేయించుకున్న వారిని కాస్త కోలుకున్నాక డిశ్ఛార్జి చేస్తుంటారు. తదుపరి అవసరమైన వైద్య సంరక్షణ సేవలను అందించడం, మళ్లీ హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరాన్ని నివారించడం ద్వారా, ఆర్థికంగా ఉపశమనం కలిగించేలా చేయడమే హెల్త్‌ ఆన్‌ అజ్‌ లక్ష్యం. హోమ్‌ కేర్‌ నర్సింగ్‌ అంటే ఇంటి దగ్గర ఉండి రోగులకు భౌతికంగా సహాయం చేయడం మాత్రమే కాదు.

క్లినికల్‌ సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం. ఒకరి హాస్పిటల్‌ డిశ్ఛార్జి సమ్మరీ ప్రకారం, రోగికి తదుపరి చికిత్స అవసరమైతే మా సేవలకూ ఆరోగ్య బీమా పరిహారం లభించే అవకాశం ఉంది. రికవరీ అవుతున్న పేషెంట్లకు ఫిజియోథెరపీ సేవలను మా కేంద్రాలతో పాటు ఇంటి దగ్గరా, అధునాతన పోర్టబుల్‌ యంత్రాలతో చేయగలుగుతాం.

హెల్త్‌ ఆన్‌ అజ్‌ యాప్‌లో రోగులు తమ మెడికల్‌ రికార్డులన్నీ ఉచితంగా అప్‌లోడ్‌ చేసుకోవచ్చు. వీటిని సంబంధితుల అంగీకారంతో మాత్రమే వైద్యులు చూసే వీలుంటుంది.. బీపీ, షుగర్‌ వంటివి ప్రతిరోజూ ఈ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. వైటల్స్‌లో గణనీయ మార్పు ఉండి, వైద్యులను సందర్శించాల్సిన అవసరం వస్తే.. మొబైల్‌ యాప్‌ నుంచి సంబంధితులకు అలర్ట్స్‌ కూడా వస్తాయి.

‘హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 28 పడకలు, ఫిజియోథెరపీ స్టూడియో, ఔషధ-సర్జికల్‌ పరికరాల స్టోర్‌తో కూడిన సమగ్ర కేంద్రాన్ని సిద్ధం చేశాం. విశాఖపట్నంలో 20 పడకలతో ఏర్పాటు చేస్తున్నది 3 నెలల్లో సిద్దమవుతుంద’ని హెల్త్‌ ఆన్‌ అజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భరత్‌రెడ్డి తెలిపారు. ‘అన్నిరకాల శస్త్రచికిత్సానంతర/ఐసీయూ చికిత్సానంతర సేవలు అందిస్తాం. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి వైద్యసేవలందించేందుకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరం. ఇందుకు ప్రత్యేక లైసెన్సింగ్‌ కావాలి. ఏడాదిన్నర తరవాత మూడో దశ విస్తరణలో క్యాన్సర్‌ సంబంధిత బాధితులతో పాటు, డయాలసిస్‌ సేవలందిస్తాం.

రెండో దశలో విస్తరణ..

‘6 నెలల్లో రెండో దశ విస్తరణ చేపడతాం. మరో 2-3 కేంద్రాలు నెలకొల్పుతాం. అప్పటికి మా సిబ్బంది సంఖ్య రెట్టింపవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తిరుపతిలలో ఒక్కో కేంద్రం, బెంగళూరులో మరో కేంద్రాన్ని ప్రారంభించాలన్నది మా ప్రణాళిక. మూడో దశలో హైదరాబాద్‌లో మరో 2 కేంద్రాలు, బెంగళూరులో మరో కేంద్రం కలిపి మొత్తం 7 కేంద్రాల్లో 125 పడకలుంటాయి. ఇప్పటికే రూ.50 కోట్లు పెట్టుబడి చేశాం. రాబోయే మూడేళ్లలో విస్తరణ పథకాలకు మరో రూ.150-175 కోట్ల పెట్టుబడి అవసరం. ఇప్పటివరకు ప్రమోటర్లే పెట్టుబడి పెట్టారు. భవిష్యత్తు ప్రైవేటు వెంచర్, ఈక్విటీ క్యాపిటలిస్టుల నుంచి నిధులు సమీకరిస్తాం’ అని భరత్‌ రెడ్డి తెలిపారు.

హాస్పిటల్స్, డాక్టర్లతో ఒప్పందాలు..

‘ప్రధాన చికిత్స అనంతరమే మేము సేవలందిస్తాం కనుక హాస్పిటల్స్, క్లినిక్స్, డాక్టర్లతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. హాస్పిటల్స్‌ ఐసీయూతో పోలిస్తే చాలా తక్కువగా, రోజుకు రూ. 7500-10000కే చికిత్స అందిస్తాం. ఇందులో మా వైద్యులు, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఆహార ఖర్చులు కలిపే ఉంటాయి. ఇతర డయాగ్నొసిస్‌ సేవలు, మందులతో పాటు రోగులు తమ వ్యక్తిగత వైద్యుల సాయం పొందాలనుకుంటే, వారే ఆ వ్యయం భరించాలి..’ అని వివరించారు.

ఇంటి దగ్గర క్లినికల్‌ సేవలకు గంటకు రూ. 750-1500 అవుతుంది. వెంటిలేటర్‌పై ఇంటి దగ్గర చికిత్స పొందుతున్న వారికి ఆహారం అందించే సేవలూ ఇస్తాం. జనలర్‌ నర్సింగ్‌ సేవలకు 12 గంటలకు రూ.1500 ఛార్జ్‌ చేస్తాం. బుక్‌ చేసుకున్న వెంటనే సిబ్బంది ఎంతసేపట్లో వస్తారో కూడా యాప్‌లో ట్రాక్‌ చేసుకోవచ్చు. సెకండ్, థర్డ్, ఫోర్త్‌ టైర్‌ పట్టణాల్లోనూ స్పోక్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, కార్పొరేట్‌ సంస్థల సిబ్బంది అమ్మానాన్నలకూ సేవలందించాలన్నది మా మూడోదశ ప్రణాళిక. దేశవ్యాప్తంగా ఈ సేవల్లో ప్రధాన సంస్థగా ఎదగాలన్నది మా ధ్యేయమని’ భరత్‌రెడ్డి తెలిపారు.

తదుపరి వ్యాసం