తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2025 Honda Activa : మిడిల్​ క్లాస్​ వారికి ఎంతో ఇష్టమైన స్కూటర్​- సరికొత్త ఫీచర్స్​తో కొత్త వర్షెన్​ లాంచ్​..

2025 Honda Activa : మిడిల్​ క్లాస్​ వారికి ఎంతో ఇష్టమైన స్కూటర్​- సరికొత్త ఫీచర్స్​తో కొత్త వర్షెన్​ లాంచ్​..

Sharath Chitturi HT Telugu

22 December 2024, 5:43 IST

google News
    • Best selling scooter in India : 2025 హోండా యాక్టివా 125 స్కూటర్​ లాంచ్​ అయ్యింది. లేటెస్ట్​ అప్​గ్రేడెడ్​ వర్షెన్​లో కొత్త యాడ్​ అయిన ఫీచర్స్​, ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
2025 హోండా యాక్టివా స్కూటర్​ లాంచ్​..
2025 హోండా యాక్టివా స్కూటర్​ లాంచ్​..

2025 హోండా యాక్టివా స్కూటర్​ లాంచ్​..

మిడిల్​ క్లాస్​ వారికి ఎంతో ఇష్టమైన హోండా యాక్టివ్ 125​కి అప్డేటెడ్​ వర్షెన్​ని లాంచ్​ చేసింది హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). ఈ స్కూటర్​ని ఓబీడీ 2బి కంప్లైన్స్​గా మార్చింది. 2025 హోండా యాక్టివా 125 డీఎల్ఎక్స్ వేరియంట్ ధర రూ. 94,922. హెచ్-స్మార్ట్ వేరియంట్ ధర రూ .97,146కు పెరిగింది. ఈ రెండు ఎక్స్​షోరూం ధరలే.

2025 హోండా యాక్టివా 125:

2025 యాక్టివా 125 బ్లూటూత్ కనెక్టివిటీతో కొత్త 4.2 ఇంచ్​ టీసీటీ డ్యాష్ బోర్డును పొందింది. కొత్త యూనిట్ నావిగేషన్, కాల్ / మెసేజ్ అలర్ట్స్ వంటి ఫీచర్లను కలిగిన హోండా రోడ్ సింక్ యాప్​కి అనుకూలంగా ఉంది. యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది.

లాంచ్ గురించి హెచ్ఎంఎస్ఐ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్- సీఈఓ సుత్సుము ఒటాని మాట్లాడుతూ.. “కొత్త ఓబీడీ2బీ-కంప్లైంట్ యాక్టివా 125 ప్రకటించడం మాకు సంతోషంగా ఉంది. ఈ అప్​డేటెడ్ మోడల్ పరిచయం చేయడం కస్టమర్ సంతృప్తి పట్ల మా నిబద్ధతను ప్రదర్శిస్తుంది. 125సీసీ స్కూటర్ సెగ్మెంట్​లో హోండా రోడ్ సింక్ యాప్ ద్వారా టీఎఫ్​టీ డిస్​ప్లే- బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లతో, వినియోగదారులకు రైడింగ్ అనుభవాన్ని పెంచేందుకు మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది తన విభాగంలో బెంచ్​మార్క్​ని సెట్ చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము,” అని అన్నారు.

దీనిపై హెచ్ఎంఎస్ఐ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ.. "యాక్టివా 125 వినియోగదారులకు ఇష్టమైన ఎంపిక అని, దాని తాజా అప్​గ్రేడ్​ సౌలభ్యం, స్టైల్​ని మరింత మెరుగుపరచడానికి రూపొందించడం జరిగిందని అన్నారు. బ్లూటూత్, నావిగేషన్, యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లను ఇంటిగ్రేట్ చేయడం ద్వారా, మేము నేటి రైడర్ల అభివృద్ధి చెందుతున్న అవసరాలను పరిష్కరిస్తున్నాము. శక్తివంతమైన కొత్త రంగులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త యాక్టివా 125 స్కూటర్​ భావి కొనుగోలుదారులను ఆకర్షించడానికి, ఈ విభాగాన్ని శాసించడానికి సిద్ధంగా ఉంది," అని వెల్లడించరు.

2025 హోండా యాక్టివా 125 కలర్స్..

విజువల్​గా 2025 యాక్టివా 125 అదే డిజైన్​ని కలిగి ఉంది. బ్రౌన్ కలర్ సీట్లు, ఇన్నర్ ప్యానెల్స్​ని కలిగి ఉంది. ఇది పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పర్ల్ సైరన్ బ్లూ, రెబల్ రెడ్ మెటాలిక్, పర్ల్ ప్రీషియస్ వైట్ వంటి బహుళ రంగులలో లభిస్తుంది.

2025 హోండా యాక్టివా 125 స్పెసిఫికేషన్లు..

2025 హోండా యాక్టివా 125 స్కూటర్ అప్​గ్రేడ్ చేసిన 123.92 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ నుంచి వచ్చింది. ఇది ఇప్పుడు ఓబీడీ2బీ కంప్లైంట్. ఈ ఇంజిన్ గరిష్టంగా 8.3బీహెచ్​పీ పవర్, 10.15ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్​తో ఈ స్కూటర్​ వస్తుంది.

తదుపరి వ్యాసం