2024 TVS Apache RTR 160 4V: మార్కెట్లోకి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4 వీ; ధర రూ. 1.35 లక్షలే..
09 December 2023, 19:49 IST
- 2024 TVS Apache RTR 160 4V: లేటెస్ట్ 2024 మోడల్ అపాచీ ఆర్టీఆర్ 160 4 వీ (2024 TVS Apache RTR 160 4V) ని టీవీఎస్ లాంచ్ చేసింది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.35 లక్షలుగా నిర్ణయించింది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4 వీ
2024 TVS Apache RTR 160 4V: అపాచీ ఆర్టీఆర్ 160 4 వీ (2024 TVS Apache RTR 160 4V) ని మోటో సోల్ 2023 (MotoSoul 2023) ఈవెంట్ లో టీవీఎస్ ఆవిష్కరించింది. స్టాండర్డ్ వర్షన్ తో పోలిస్తే, ఈ మోడల్ లో పలు కీలక అప్ గ్రేడ్స్ చేశారు. రెండు కొత్త కలర్ స్కీమ్స్.. లైటెనింగ్ బ్లూ, మాటీ బ్లాక్.. ఆ అప్ గ్రేడ్స్ లో భాగమే. అదనంగా, ఈ మోడల్ లో డ్యుయల్ చానల్ ఏబీఎస్ అప్ గ్రేడ్ కూడా ఉంది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1.35 లక్షలుగా నిర్ణయించారు.
మూడు రైడింగ్ మోడ్స్
ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4 వీ (2024 TVS Apache RTR 160 4V) మూడు రైడింగ్ మోడ్‌లలో వస్తోంది. ఇందులో వాయిస్ అసిస్ట్‌తో కూడిన SmartXonnect బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టమ్ అమర్చి ఉంది. ఈ బైక్ 8,000 rpm వద్ద 17.3 bhp, 6,500 rpm వద్ద 14.8 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేసే 160 cc సింగిల్-సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్ ఇంజన్ ను పొందుపర్చారు. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇందులో కూడా టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్స్ ను కొనసాగించారు.
బుకింగ్స్ ఓపెన్
ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4 వీ (2024 TVS Apache RTR 160 4V) బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టీవీఎస్ కంపెనీ షోరూమ్ ల్లో టోకెన్ అమంట్ చెల్లించి, బైక్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ మోటార్‌సైకిల్ Hero Xtreme 160R 4V, హోండా CB హార్నెట్ 2.0, బజాజ్ పల్సర్ N160 తదితర బైక్ లతో పోటీపడుతుంది.